Guppedantha Manasu మార్చి 9ఎపిసోడ్: మౌనంగా ఉన్నాం అంటే యుద్ధం మానేశాం అని కాదు, డైలాగ్స్ అదుర్స్

గుప్పెడంత మనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. తన చినప్పుడు ఏం జరిగిందో తెలియక రిషి, కొడుక్కి దూరంగా ఉండలేక జగతి, మధ్యలో మహేంద్ర నలిగిపోతున్నారు.మార్చి 9 బుధవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే

FOLLOW US: 

గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 9 బుధవారం ఎపిసోడ్

రిషి క్యాబిన్ నుంచి ఏడ్చుకుంటూ బయటకు వచ్చిన జగతిని ఏమైందని ప్రశ్నిస్తాడు మహేంద్ర. రిషి ఏమైనా అన్నాడా అని అడుగుతూ ఉండగానే ఏమీ సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోతుంది. వసుధారని పిలిచిన మహేంద్ర...నువ్వు జగతితో వెళ్లు, తనెందుకు ఏడుస్తోంది వెళ్లి చూసుకో ప్లీజ్ అంటాడు. రిషి క్యాబిన్ కి ఆవేశంగా వెళ్లిన మహేంద్ర ఏం జరిగింది...జగతిని ఏమన్నావ్... జగతి ఎందుకు ఏడుస్తూ వెళ్లిపోతోంది అని అడుగుతాడు.
రిషి: నేను ఏమీ అనలేదు..సమస్యకి పరిష్కారం వెతకమన్నాను
మహేంద్ర: ఎవరు సమస్య..ఎవరికి సమస్య...నీకు నువ్వే పెద్ద సమస్యవి..
రిషి: డాడ్ ఏం మాట్లాడుతున్నారు..ఏం మాట్లాడుతున్నానో కూడా వినవా
మహేంద్ర: నీ సమస్య ఏంటి...
రిషి: నా ప్లాబ్లెమ్ నిన్నటి వరకూ నా దగ్గరే ఉండేది..ఇప్పుడు అందరికీ ఓ టాపిక్ అయిపోయింది
మహేంద్ర: చెట్టు నుంచి వేరుపడిన పండు..నాకు చెట్టుతో సంబంధం లేదు, బంధమే కాదు అంటుందా
రిషి: నేను జీవితంలో ఎన్నికోల్పోయినా ఇన్నాళ్లూ మాట్లాడలేదు, నిన్నటి సంఘటనకు పరిష్కారం అడిగాను
మహేంద్ర: నువ్వు ఏం కోల్పాయావ్...అంతకన్నా ఎక్కువగా జగతి-నేను కోల్పోతాయం..నీకు తల్లిదండ్రులం అవడమే మా తప్పా
రిషి; నేను ఏమన్నాను..మీకు మీరే ఎక్కువ అనుకుంటున్నారు
మహేంద్ర: ఇంతకన్నా ఎక్కువే అన్నావ్...తానేమో పిచ్చిది ఎప్పుడూ నీ గురుంచే ఆలోచిస్తుంటుంది, ఇరవైఏళ్లకి పైగా ఎంత నరకం చూస్తున్నామో నీకు అర్థం కావడం లేదు... జగతిని పండక్కి ఒక్కరోజు పిలిచి ఏదో గొప్ప పని చేశావేమో...ఇంటికొచ్చినప్పటి నుంచీ పైకి నవ్వుతున్నా...ఎక్కడ ఏమాట పడాల్సి వస్తుందేమో అని భయపడుతూనే ఉంది
రిషి: అంత విజ్ఞత లేకుండా మాట్లాడలేదు
మహేంద్ర: ఆహా..అంత విజ్ఞతగా అవమానించావా అమ్మని
రిషి: అమ్మ..ఈ పదం పలికి ఏళ్లు గడిచింది...ఇల్లంతా అన్నీ ఉన్నా ఇంట్లో అమ్మలేదు... తెల్లవారితే స్కూల్ కి వెళ్లాలి, అమ్మతో ప్రేమగా మాట్లాడుతూ, గోరు ముద్దలు తింటూ బుగ్గపై అమ్మ ముద్దుపెట్టి స్కూల్ కి పంపిస్తే పిల్లలు ఎంత ఆనందంగా వెళతారో కదా... నాకు ఆ అదృష్టం లేదు. స్కూల్ ని ఇంటికొచ్చాక ఎప్పుడెప్పుడు ఇంటికొచ్చి అమ్మతో చెబుతామా అనిపించేది...గదిలోకి వచ్చి ఇంట్లో కనిపించని అమ్మను పుస్తకాల్లో అమ్మ బొమ్మతో ఒంటరిగా మాట్లాడుకునేవాడిని...ఇది మీకు తెలుసా... ఫ్రెండ్స్ అడిగినా మనింటికి రానిచ్చేవాడిని కాదు..మీ అమ్మ ఏదిరా అంటే నా దగ్గర సమాధానం లేదు..ఎందుకు వెళ్లిందో, ఎందుకు నన్ను వదిలి వెళ్లిపోయిందో 22 ఏళ్లు అయినా ఇప్పటికీ నాకు తెలియదు. మీ చిన్నప్పుడు తాతయ్య-నానమ్మతో ఎంత అందమైన జ్ఞాపకాలు ఉన్నాయో మీకు తెలుసు.... అమ్మ లేకుంటే ఎలా ఉంటుందో, అమ్మ లేని లోటు ఎలా ఉంటుందో తెలుసుకోలేరు.. రిషి సార్ సీరియస్ గా ఉంటారని అంటారు...ఒంటరితనం, లెక్కను మించి ప్రశ్నలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయ్..కొత్తగా కాలేజీలో వాళ్లు నా చుట్టుపక్కల వాళ్లు చూసేవాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఏంటో తెలుసుకోమని మేడంని అడిగాను.. ఇది తప్పా డాడ్
మహేంద్ర: ఇన్ని మాటలు చెప్పావ్ కదా..నేను ఒక్కమాట చెబుతాను... ఇన్నాళ్లూ నన్ను డాడ్ అంటూ ఆవిడని మేడం అంటున్నావ్ కదా.. ఒక్క మాట చాలదా ఆ తల్లి బుండె బద్దలవడానికి
మహేంద్ర అక్కడి నుంచి వెళ్లిపోతాడు....

Also Read: 'మామా ఏక్ పెగ్ లా' సాంగ్ కి డాన్స్ ఇరగదీసిన వంటలక్క

దేవయాని-వసుధార: జగతి వసుధార కార్లో ఇంటికి వెళుతూ రిషి మాటలు గుర్తుచేసుకుంటుంది జగతి...మరోవైపు మేడంతో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదనుకుంటుంది వసుధార. ఎదురుగా దేవయాని కనిపించడంతో కారు ఆపి కిందకు దిగుతారు జగతి, వసుధార. కారుకి అడ్డంగా నిల్చుని ఎలా ఉన్నావ్ జగతి..సడెన్ గా నిన్ను చూడాలని మనసులో అనిపించింది ఎంతకాదన్నా నిన్ను చూడాలని అనిపించింది... వరుసకు చెల్లెలివి ఆ మాత్రం ప్రేమ నాక్కూడా ఉంటుంది కదా..దిగుతావా మాట్లాడుకుందాం అంటుంది. ఏంకాదు మేడం దిగండి అంటుంది వసుధార. 
దేవయాని: జగతి ఆరోగ్యం బావుందా..టైంకి తింటున్నావా..సరిగ్గా నిద్రపడుతోందా...కళ్లలో ఏమైనా నలకపడిందా..కళ్లలో కన్నీళ్లేంటి..
వసుధార: కళ్లలో నలక పడితే పోతుంది..మేడం జీవితంలో నలకపడింది..ఆ నలక ఇప్పుడు ఇబ్బంది పెడుతోంది..ఆ నలకను ఎలా తీసేయాలో ఏం చేయాలో మేడంకి బాగా తెలుసు..
దేవయాని: నీ గూటి చిలకకి నీకన్నా తెలివి తేటలు పెరిగిపోయాయ్ జగతి, మీ జగతి మేడం జీవితంలో నలక పడిందా...ఎవర్ని అంటున్నావ్ నన్నేనా...
వసుధార: మీకు తొందరగానే అర్థమైంది మేడం...
దేవయాని: నిన్ను ఓదార్చేందుకు నాకు మాటలు రావడం లేదు..నిజం ప్రపంచానికి తెలిసిందని సంతోషపడుతున్నావో తెలియదు..కుమిలి కుమిలి ఏడుస్తున్నావో తెలియదు... రిషి నిన్ను అమ్మా అంటున్నాడా-మేడం అంటున్నాడా....రిషి నీతో మాట్లాడుతున్నాడా...ఇవన్నీ జరిగి ఉండవులే నాకు తెలుసు.. హమ్మయ్య జీవితంలో ఏదో సాధించినట్టు నాకు చాలా ఆనందంగా ఉంది తెలుసా...
వసుధార: సాధించడం మీకు అలవాటే కదా
దేవయాని:  మధ్యలో నీకెందుకు..మేం మేం చుట్టాలం
వసుధార: మీరు మీరూ చుట్టాలు, అక్కా చెల్లెళ్లు అయితే.. జగతి మేడం-రిషి సార్ ఏమవుతారు మరి..అంటే మీకు తెలియకుండానే వాళ్ల బంధాన్ని ఒప్పుకుంటున్నారు. మీరేకాదు మేడం తల్లీ-కొడుకుల బంధాన్ని దేవుడు కూడా కాదనలేరు. మేడం బాధలో ఉన్నారు..ఆ బాధని చూసి ఆనందించాలని వచ్చారు..అంతేకదా.. ఒకరి బాధని చూసి ఆనందించే వారిని ఏమంటారో మీరే ఆలోచించుకోండి
దేవయాని: వసుధారా అని గట్టిగా అరుస్తుంది 
వసుధార: నేను మీకంటే గట్టిగా అరవగలను, మీరు చేసే ప్రతి పనినీ రిషి సార్ తో చెప్పగలను, ఈ మాటలన్నీ రికార్డ్ చేసి రిషి సార్ కి వినిపించగలను..అప్పుడేం చేస్తారు, నిజం అనేది ఎప్పటికైనా తెలుస్తుంది...కొంగులో నిప్పులు కట్టుకుని తిరుగుతున్నారు...ఆ నిప్పు ఎప్పటికైనా మిమ్మల్నే కాల్చేస్తుంది జాగ్రత్త.... అహంకారం తగ్గించుకుంటే ఆనందం ఉంటుంది..అహంకారమే ఆనందం అనుకుంటే దాని ముగింపేంటో మీకు త్వరలోనే తెలుస్తుంది.  పదండి మేడం...రోడ్డుకి అడ్డంగా మనకు అవసరం లేనివి చాలానే వస్తుంటాయ్...పక్కకు తప్పుకుని వెళ్లిపోవాలి..ప్రతిసారీ ఆగకూడదు..పదండి మేడం

కారు వెళ్లేందుకు దారి ఇవ్వకుండా అడ్డంగా నిల్చుంటుంది దేవయాని. వసుధార ఆపకుండా హారన్ కొడుతూనే ఉండటంతో దారిస్తుంది. జగతి కాదు ముందు ఈ వసుధార సంగతి చూడాలి అనుకుంటుంది దేవయాని.

Also Read:  రిషికి మహేంద్ర క్లాస్-దేవయానికి వసు వార్నింగ్, జగతి ఏం చేయబోతోంది
రిషి ఒక్కడూ నిల్చుని తండ్రి అన్న మాటలు తల్చుకుంటాడు. నీకు తల్లిదండ్రులం అవడమే మా తప్పా అన్నమాటలన్నీ గుర్తుచేసుకుంటాడు. ఇన్నాళ్లూ వేరు ఇప్పుడు వేరు ఈ సిట్యుయేషన్ కి పుల్ స్టాఫ్ పెట్టాలి అనుకుంటాడు. మరోవైపు జగతి..దేవయాని మాటలు తలుచుకుంటూ బాధపడుతుంది. కాఫీ తీసుకోండి మేడం అంటూ వసుధార వస్తుంది. 
వసుధార: మీ స్థాయికి తగని వారిముందు కూడా మీరు మౌనంగా ఉండడం సరికాదేమో, దేవయాని గారు కావాలని మిమ్మల్ని బాధపెట్టి ఆనందించాలని చూస్తుంటే మీరెందుకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటారు
జగతి: మౌనంగా ఉన్నాం అంటే యుద్ధం మానేశాం అని కాదు..చాలామందికి మౌనం అనేది చేతకానితనంలా కనిపిస్తుందేమో...కానీ నా మౌనం వెనుక రిషి మనసు దాగి ఉంది. దేవయాని అక్కయ్య కన్నా ఎక్కువ అరవగలను, బాగా మాట్లాడగలను..కానీ ఏం జరుగుతుంది. అక్కయ్య వెళ్లి రిషిని రెచ్చగొడుతుంది, రిషి-మహేంద్ర డిస్ట్రబ్ అవుతారు అది నాకు ఇష్టం లేదు. నేను దేవయాని అక్కయ్యకు కాదు బంధాలకు భయపడతాను. యుద్ధం చేసే ప్రతివారూ వీరులు కాదు వసు. అక్కయ్య ఏదో అరిచినంత మాత్రాన తను బలవంతురాలు అని కాదు కదా..సమస్యని ఎదిరించినవారే బలవంతులు అవుతారు. ఓపిగ్గా ఉన్నావారే ధైర్యవంతులు అవుతారు. కాసేపు నన్ను ఒంటరిగా వదిలెయ్

రేపటి ( గురువారం) ఎపిసోడ్ లో
మీ మేడం గారికి  ఓపని అప్పగించాను అదెంతవరకూ వచ్చిందో ఓసారి అడుగు అన్న రిషితో..నేనెందుకు అడగాలి అంటుంది. ఏంటి అలా సమాధానం చెబుతున్నావ్ అంటే..మీకు నచ్చని వ్యక్తులను దూరం పెట్టండి బాధపెట్టొద్దు అని చెబుతుంది. నువ్వు బయటపడవు కానీ నీకు ఈగో ఎక్కువే కదా అన్న రిషితో... నా కున్న ఈగో కన్నా మీకు పదిరెట్లు ఎక్కువే ఉంది సార్ అంటుంది. 

Published at : 09 Mar 2022 09:34 AM (IST) Tags: గుప్పెడంత మనసు ఈ రోజు సీరియల్ Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Guppedantha Manasu 9th March Episode 393

సంబంధిత కథనాలు

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Samudram Chittabbai: చక్కని విలేజ్ ప్రేమ కథ ‘సముద్రం చిట్టబ్బాయి’, ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Escaype Live Review: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్‌ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Bigg Boss 6 Telugu: ‘బిగ్ బాస్’ సీజన్-6లోకి సామాన్యులకు అవకాశం, నాగ్ ఆహ్వానం

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Thank You Teaser: నాగ చైతన్య ‘థాంక్యూ’ టీజర్, లైఫ్‌లో ఇక కాంప్రమైజ్ అయ్యేదే లేదంటున్న చైతు!

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?

Karan Johar New Movie: రూట్ మార్చిన బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ - 'ఆర్ఆర్ఆర్', 'కెజియఫ్ 2'  విజయాలే కారణమా?
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay Sensational Comments: తెలంగాణలో మసీదులన్నీ తవ్వాలి, బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు