అన్వేషించండి

Karthika Deepam మార్చి 10 ఎపిసోడ్: కాలి బూడిదైన డాక్టర్ బాబు, వంటలక్క- బావా మరదలుగా రీఎంట్రీ ఇస్తారా

బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మార్చి 10 గురువారం 1296 ఎపిసోడ్‌కి ఎంటరైంది. రకరకాల ట్విస్టులతో సాగుతున్నకథలో ఈ రోజు ఏం జరిగిందంటే…

కార్తీకదీపం(Karthika Deepam) మార్చి 10 గురువారం ఎపిసోడ్

 దీప-కార్తీక్: రాత్రి తాగితూగిన దీప..తెల్లారేసరికి రాత్రి ఏం జరిగింది,నేనేమైనా ఎక్కువ చేశానా అంటే... అవును ఎక్కువే చేశావ్ నా ఆనందాన్ని అన్న కార్తీక్ చాలా బావుందిలే అంటాడు. ఈ ప్రపంచాన్ని, ఈ కష్టాలని మరిచిపోయి చాలారోజుల తర్వాత మనకోసం మనం బతికినట్టు అనిపిస్తోంది...ఎప్పటికీ ఇలాగే ఆనందంగా ఉండాలనిపిస్తోంది. మనం ఇక్కడే ఇలాగే ఉండిపోదామా అంటే.. మనం ఇక్కడే ఇలాగే ఉండిపోతే అత్తయ్య, మావయ్య, ఆదిత్య, శ్రావ్య, దీపు సంగతేంటి...నేను వదిలి ఉండలేనన్న దీపతో పాటూ..అవును నిజమే నేనుకూడా ఉండలేను అంటాడు. రాత్రి మంది తాగి అరెయ్ అన్న దీప మాటలు గుర్తుచేసుకున్న కార్తీక్...ఓసారి  ఏరా అని పిలవ్వా అని అడుగుతాడు. రాత్రి మందులో అలా జరిగిపోయింది అంతే అంటుంది.

సౌందర్య ఇంట్లో: ఫంక్షన్ కి రావడానికి సౌందర్య ఒప్పుకుందా అని ఆనందరావు అడిగితే.. కష్టపడి ఒప్పించానని సమాధానం ఇస్తాడు ఆదిత్య. కార్తీక్ వాళ్లని  రమ్మని అడుగుదాం అనుకుంటే ఫోన్ కూడా కలవడం లేదంటాడు. నెట్ వర్క్ ప్రాబ్లెమ్ లేకపోతే ఇంట్లోకూడా ప్లాబ్లెమ్ ఉండేది కాదేమో అన్న ఆనందరావు..అమ్మని పిలుచుకురా అని ఆదిత్యకి చెబుతాడు. వెళ్లేందుకు సిద్ధపడిన సౌందర్య అంతలోనే సోఫాలో కూర్చుండిపోతుంది...నేను రాలేను, నా వల్ల కాదు మీరు వెళ్లండి అనేస్తుంది. అందరం కలసి వెళితే బావుంటుంది కదా అని బతిమలాడినా సౌందర్య వినదు. మీ ప్రశ్నలకి నా దగ్గర సమాధానం లేదు, నా బాధకి మీ దగ్గర ఓదార్పు లేదు..నన్ను వదిలేసి మీరు వెళ్లండని తేల్చిచెప్పేస్తుంది.

Also Read: మౌనంగా ఉన్నాం అంటే యుద్ధం మానేశాం అని కాదు, డైలాగ్స్ అదుర్స్
హిమ-శౌర్య ఇద్దరూ రిసార్ట్ బయట లోకేషన్స్ లో ఫొటోస్ తీసుకుంటారు. ఆ తర్వాత కార్తీక్-దీపకి పిల్లలు ఫొటోస్ తీస్తారు. అమ్మని పట్టుకునే ఉండు నాన్న... నేను చెప్పేవరకూ అని శౌర్య అంటుంది. మీ అమ్మ చేయి ఎప్పటికీ వదలను చివరకి చావులో కూడా అనగానే దీప కంగారుగా కార్తీక్ నోటికి చేయి అడ్డం పెడుతుంది. రెండుసార్లు పెళ్లిచేసుకున్నాం కదా బంధం ఇంకా బలంగా ఉంటుందని చెప్పేందుకే అలా అన్నా అంటాడు. నువ్వు కార్లో కూర్చుని డ్రైవింగ్ చేస్తున్నట్టు నటించు నేను ఫొటోస్ తీస్తానంటుంది శౌర్య. డ్రైవింగ్ చేస్తున్నట్టు నటించడం కాదు నిజంగానే డ్రైవింగ్ చేస్తానంటూ కార్లో కూర్చుంటుంది. ఇప్పుడు వద్దులే..బయటకు వెళ్లినప్పుడు రోడ్డు బాగున్నచోట నేను ఇస్తానులే అంటాడు. ఫొటోస్ బావున్నాయా అంటే నువ్వు తీశావ్ కదా నాకు తెలుసులే అని కార్తీక్ అనడంతో హిమ నవ్వుతుంది. ఉడుక్కున్న శౌర్య..నువ్వు నవ్వొద్దంటుంది. తాడికొండ నుంచి వచ్చాక నువ్వు మారిపోయావ్ అంటే నువ్వు మారిపోయావ్ అని ఇద్దరూ గొడవ పెట్టుకుంటారు. కారు డ్రైవింగ్ గురించి కాసేపు మాట్లాడుకుంటారు. నానమ్మకి వీడియో కాల్ చేద్దామా అంటే..మాట్లాడేందుకే సిగ్నల్స్ లేవంటే వీడియో కాల్ ఏంటి శౌర్య అంటుంది హిమ. ఆ తర్వాత అంతా కలసి బయటకు వెళతారు. 

సౌందర్య: ఇంట్లో ఉన్న సౌందర్య కంగారుగా ఫోన్ తీస్తుంది. దీపతో కానీ కార్తీక్ తో కానీ మాట్లాడకపోతే పిచ్చి పట్టేంటుంది అనుకుంటుంది. అయినా ఇంట్లో ఎవరికీ లేని బాధ, భయం నాకు ఎందుకు.. పూజారి చెప్పిన మాటలు అంతా విన్నారు...అయినా వాళ్లలో ఏ బాధా లేదు. మరి నాకు మాత్రమే ఎందుకు ఇలా అనిపిస్తోంది.  నిజంగా ఫోబియానే...కాదు  కాదు..మనిషి అబద్ధం చెబుతాడు మనసు అబద్ధం చెప్పదు ఏదో జరగబోతోంది అనుకుంటుంది. అసలు అక్కడ సిగ్నల్స్ లేవని తెలిసిఉంటే మరో ప్లేస్ కి పంపించేదాన్ని. మరీ ఇలా మాట కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుందని అనుకోలేదని బాధపడుతుంది

Also Read: 'మామా ఏక్ పెగ్ లా' సాంగ్ కి డాన్స్ ఇరగదీసిన వంటలక్క
కార్లో వెళుతూ కార్తీక్...దీపని ఆటపట్టిస్తాడు. ఈ కొండలు, గుట్టల మధ్య హోటల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నావా అంటే..అస్సలు లేదు...ఇకపై మీరు ఎక్కడికి వెళ్లినా మీతో పాటే అంటుంది. అవును నాన్నా ఎక్కడికి వెళ్లినా అంతా కలిసే ఉందాం..తాడికొండ వెళ్లొచ్చాక ఏదోలా ఉందన్న శౌర్యతో..ఆనంద్ ని గుర్తుచేసుకున్న హిమ...ఇంకోసారి తాడికొండ టాపిక్ తీసుకురావొద్దంటుంది. ఇంతలో ఫోన్ సిగ్నల్ రావడంతో మమ్మీ నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయేంటంటూ కారు పక్కన ఆపి మాట్లాడేందుకు దిగుతాడు.  ఈ ప్లేస్ చాలా బావుందనుకుంటూ అంతా కిందకు దిగుతారు. కారు ఎలాగూ నడపడనివ్వడం లేదు కదా నడిపినట్టు యాక్ట్ చేస్తాను నువ్వు కూర్చో అంటుంది. మరోవైపు నాన్న ఫోన్ కి సిగ్నల్స్ దొరకడం లేదేమో నేను అటువెళ్లి ట్రై చేస్తానంటూ శౌర్య దూరంగా వెళుతుంది. ఎపిసోడ్ ముగిసింది

రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
చిక్ మంగుళూర్ అందాలను ఎంజాయ్ చేస్తుంటారు దీప-కార్తీక్ పిల్లలు. ఇంతలో హిమ అమ్మ కార్లో కూర్చో అంటుంది. దీప కూర్చోగానే నేను నడుపుతా అంటూ హిమ స్టార్ట్ చేసేస్తుంది. ఎంత చెప్పినా వినకుండా కార్ డ్రైవ్ చేస్తుంది. అసలే హిల్ స్టేషన్...కంట్రోల్ కాకపోవడంతో కార్లోంచి కేకలు పెడతారు. పరిగెత్తి వెళ్లిన డాక్టర్ బాబు కార్లో కూర్చుని కంట్రోల్ చేసేలోగా రాయిపైకి ఎక్కిన కారు కొండపైనుంచి బోర్లా పడి మంటలు చెలరేగుతాయి..శౌర్య కొండపై ఉంటుంది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Yadagirigutta: యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
యాదాద్రి ఇకపై యాదగిరిగుట్ట - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Sharmila On Jagan : జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి -  షర్మిల డిమాండ్
జగన్, వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి వెళ్లే ధైర్యం లేకపోతే రాజీనామా చేయాలి - షర్మిల డిమాండ్
Revanth Reddy: మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
మూసి పునరుజ్జీవం కోసం మొదటి పాదయాత్ర - నది కాలుష్యాన్ని స్వయంగా పరిశీలించిన రేవంత్
Bloody Beggar Review: బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
బ్లడీ బెగ్గర్ రివ్యూ: తమిళ హీరో బిచ్చగాడిగా ఆకట్టుకున్నాడా? ఇది థ్రిల్లరా? కామెడీనా? హార్రరా?
Minister Atchannaidu: రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - 2 రోజుల్లోనే అకౌంట్లలో డబ్బులు జమ
UP Women Commission: మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
మహిళల దుస్తుల కొలతలు పురుషులు తీసుకోవద్దు - యూపీ మహిళా కమిషన్ కీలక ప్రతిపాదనలు
More Drink Less Kick : ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
ఎన్ని బీర్లు తాగినా కిక్ ఎక్కట్లేదా? అంటే మీ స్టామినా పెరిగినట్టేనా? కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలివే
KTR Arrest : అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
అరెస్ట్‌కు మానసికంగా సిద్ధం అయిన కేటీఆర్ - కాంగ్రెస్ ఆటంబాంబు ఈ సారి పేలడం ఖాయమేనా ?
Embed widget