అన్వేషించండి

Puneeth Rajkumar: పునీత్‌ను ముద్దాడిన సీయం... క‌న్నీటితో వీడ్కోలు...

కన్నడ కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ అంతిమ సంస్కారాలు కర్ణాటక ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆదివారం ఉదయం పూర్తయ్యాయి. పునీత్‌ను ముద్దాడిన‌ కర్ణాటక సీయం బసవరాజు బొమ్మై... కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు.

క‌థానాయ‌కుడిగా పునీత్ రాజ్‌కుమార్‌కు ఎంత పేరుందో... మాన‌వ‌తావాదిగా అంత‌కంటే ఎక్కువ పేరుంది. వెండితెర‌పై త‌న న‌ట‌న‌తో ఎంతోమందిని ఆక‌ట్టుకున్న ఆయ‌న‌... నిజ జీవితంలో సేవా కార్య‌క్ర‌మాల‌తో అంత కంటే ఎక్కువ‌మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు. నిజ జీవితంలో త‌న ప్ర‌వ‌ర్త‌న‌తో ఎంతోమంది గుండెల్లో గూడు క‌ట్టుకున్నారు. సామాన్య ప్ర‌జ‌ల్లో మాత్ర‌మే కాదు... రాజ‌కీయ, సినీ, సామాజిక ప్ర‌ముఖుల్లోనూ పునీత్ రాజ్‌కుమార్‌కు అభిమానులు ఉన్నారు. పునీత్ అకాల మ‌ర‌ణంతో వారంతా శోక‌సంద్రంలో మునిగారు. ముఖ్యంగా... పునీత్ సోద‌రుడు, క‌థానాయ‌కుడు శివ రాజ్‌కుమార్‌! కన్నీటితో క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. పునీత్ అంతిమ‌యాత్ర జ‌రిగిన బెంగ‌ళూరు రోడ్లు, క‌న్న‌డ కంఠీర‌వ స్టేడియం ప్రాంతాలు క‌న్నీటి సంద్ర‌మ‌య్యాయి.

పునీత్ రాజ్‌కుమార్ కుటుంబ సభ్యులు స‌హా క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి బ‌స‌వ‌రాజ బొమ్మై, డీకే శివ‌కుమార్, ఇంకా ప‌లువురు రాజ‌కీయ‌, సినీ ప్ర‌ముఖులు, అభిమానులు అంతిమయాత్ర‌లో పాల్గొన్నారు. అంతిమ యాత్ర ప్రారంభం కావ‌డానికి ముందు... పునీత్‌ను సీయం బ‌స‌వ‌రాజ్ బొమ్మై ముద్దాడారు. దివంగ‌త న‌టుడిపై త‌న‌కున్న ప్రేమ‌ను ఆ విధంగా చాటుకున్నారు. 

Also Read: పునీత్ రాజ్‌కుమార్‌ గురించి మీకు తెలియని ఆసక్తికర విషయాలు...

తల్లిదండ్రులు పార్వతమ్మ, రాజ్ కుమార్ సమాధుల పక్కనే పునీత్ భౌతిక కాయాన్ని ఖననం చేశారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. పునీత్ రాజ్‌కుమార్‌కు కుమారులు లేనందున పునీత్ అంత్యక్రియలను ఆయన అన్న కొడుకు విన‌య్ రాజ్‌కుమార్ చేశారు. అంతకుముందు పునీత్ రాజ్ కుమార్ భౌతిక కాయానికి అంతిమ యాత్ర నిర్వహించారు. ఆదివారం తెల్లవారు జామున ఈ అంతిమ యాత్ర సాగింది. ఉదయం 4.30 గంటలకే అంతిమ యాత్ర మొదలుకాగా.. 16 కిలోమీటర్ల మేర జరిగింది. ఆ సమయంలోనూ పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు తమ అభిమాన హీరోను చూసేందుకు తరలివచ్చారు. వేల మంది అభిమానుల మధ్య పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు సంప్రదాయ పద్ధతిలో జరిగాయి. గౌరవ సూచకంగా పోలీసులు మూడు రౌండ్లు గాలిలోకి కాల్పులు జరిపారు. నటుడు రవిచంద్రన్, సుదీప్, యష్, నటుడు రిషబ్ శెట్టి, టెన్నిస్ కృష్ణ, నటి, శ్రీజన్ లోకేష్, ఎంపీ సుమలత, యోగితో పాటు పలువురు ఈ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

Also Read: శాండిల్‌వుడ్‌కు పునీత్ పరిచయం చేసిన హీరోయిన్లు ఎవరో తెలుసా?

Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?

Also Read: ఏడాదిన్న‌ర ఎదురుచూశా.... ప‌వ‌న్‌ క‌ల్యాణ్ నుంచి పిలుపు రాలేదు! - రాజ‌మౌళి

Also Read: ఓ కిలోమీటరు... ప్రభాస్ పరుగు ఆగలేదు... ఫ్యాన్స్‌కు పండగే!

Also Read: అర్ధరాత్రి హైద‌రాబాద్‌లో ఆ బ్రిడ్జ్ మీద వెంకీ, వరుణ్! ఏం చేస్తున్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

 

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : భార్య మిస్సింగ్... భర్త అరెస్ట్... క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్ - ఓటీటీలో దుమ్ము రేపుతోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
భార్య మిస్సింగ్... భర్త అరెస్ట్... క్లైమాక్స్‌లో బిగ్ ట్విస్ట్ - ఓటీటీలో దుమ్ము రేపుతోన్న క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్
Scene Movie OTT : ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఓటీటీలోకి సూర్య సీన్ మూవీ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Nuvvu leka Neanu Lenu Serial Today Nov 6: శీనయ్యను భవానీశంకర్ ఇంట్లో దాచిన విక్కీ! అసలు ప్లాన్ ఏంటి?
నువ్వులేక నేను లేను నవంబర్ 6 ఎపిసోడ్: శీనయ్యను భవానీశంకర్ ఇంట్లో దాచిన విక్కీ! అసలు ప్లాన్ ఏంటి?
Gunde Ninda Gudi Gantalu November 6th: గుండెనిండా గుడిగంటలు నవంబర్ 6: నకిలీ నగ కొనుగోలు చేసి ప్రభావతికి గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిణీ..రవికి నీతూ బిగ్‌షాక్?  
గుండెనిండా గుడిగంటలు నవంబర్ 6: నకిలీ నగ కొనుగోలు చేసి ప్రభావతికి గిఫ్ట్‌గా ఇచ్చిన రోహిణీ..రవికి నీతూ బిగ్‌షాక్?  

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KA Paul: రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
రేవంత్ రెడ్డి సర్కార్ అవినీతి బట్టబయలు చేస్తా.. కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Anil Reddy Daughter Wedding: చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
చెన్నై వెడ్డింగ్‌లో మైండ్ బ్లాకింగ్ ఫ్రేమ్ - ఒకే వేదికపై జగన్, కేటీఆర్, అదానీ, సీఎం విజయ్!
Ramayana Day 1 Collections : రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
రామాయణ ఫస్ట్ డే కలెక్షన్స్ - 100 కోట్ల క్లబ్‌లో మైథలాజికల్ ఎపిక్!
KTR On RR Tax: తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ దందా.. స్క్వేర్ ఫీటుకు రూ.200 వసూలు - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Bigg Boss Season 10 Today November 5th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ముకేశ్‌పై రివేంజ్ తీర్చుకున్న దేబ్జానీ! అమన్‌ చేసిన పనికి త్రిగుణ్‌ ఎమోషనల్!
Embed widget