Kareena kapoor: కరోనా సూపర్ స్ప్రెడర్ కరీనా ఇల్లు సీజ్... మరి సైఫ్ ఎక్కడ?
కరోనాకు పాజిటివ్ అని తేలినప్పటి నుంచి ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆమెను కలిసిన వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్‌లో అత్యధికంగా అల్లాడింది ముంబై నగరమే. మళ్లీ ఒమిక్రాన్ భయం అందరినీ కమ్ముకున్న వేళ బాలీవుడ్ టాప్ హీరోయిన్ సూపర్ స్ప్రెడర్ గా మారిందన్న అంశం ప్రజలను కలవరపెడుతోంది. కరీనాకు కరోనా వచ్చిన సంగతి తెలియక ఆమె ఈ మధ్య కాలంలో పలు పార్టీల్లో పాల్గొంది. అలాగే చాలా మందిని కలిసింది. దీంతో కరోనా బారిన పడిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు ముంబై అధికారులు. కరోనా పాజిటివ్ అని తెలిశాక కరీనా తన ఇంట్లోనే క్వారంటైన్లోకి వెళ్లింది. అధికారులు కూడా ఆమె ఇంటికి ఎవరూ వెళ్లకుండా, ఇంట్లోంచి ఎవరూ బయటకు రాకుండా సీజ్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే గేటుకు కరోనా పాజిటివ్ కేసులున్నట్టు తెలియజేసే పోస్టర్‌ను కూడా అతికించారు.
సైఫ్ ఆచూకీ తెలియక
కరీనాతో గత కొన్ని రోజులుగా టచ్‌లో ఉన్న అందరినీ అధికారులు గుర్తించగలిగారు. కానీ సైఫ్ ఆచూకీ మాత్రం కనిపెట్టలేకపోయారు. కరీనా కుటుంబం సైఫ్ గురించి సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు అధికారులు. పదే పదే అడిగాక సైఫ్ ముంబైలో లేరని చెప్పారు. కానీ ఎక్కడికెళ్లారో, ఎక్కడున్నారో, తిరిగి ఎప్పుడొస్తారో లాంటి సమాచారమేదీ ఇవ్వలేదు.
కరీనాకు డిసెంబర్ 13న కరోనా సోకినట్టు తేలింది. అంతకుముందే ఆమె పలు పార్టీలకు హాజరైంది. ముఖ్యంగా కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీలోనే ఆమెకు కరోనా సోకినట్టు అనుమానిస్తున్నారు. ఆ పార్టీలో పాల్గొన్న ఓ వ్యక్తి దగ్గుతూ ఉన్నారని, ఆ వ్యక్తే పార్టీలో ఉన్న వారికి కరోనా సోకడానికి కారణమయ్యారని చెబుతున్నాడు కరీనా తరఫు అధికార ప్రతినిధి. ఆ పార్టీలో కరీనాతో పాటూ పార్టీలో పాల్గొన్న పదమూడు మందికి కరోనా సోకినట్టు గుర్తించారు అధికారులు. అది ఒమిక్రానా లేక మామూలు వేరియంటేనా అని కనుగొనే పనిలో ఉన్నారు.
Also Read: ఎవడాడు? దిగొచ్చాడా?... రానాకు 'భీమ్లా నాయక్' టీమ్ ఇచ్చిన బర్త్‌డే గిఫ్ట్ చూశారా?
Also Read: కొత్త నేలపై 'సంచారి'... 'రాధే శ్యామ్' సినిమాలో కొత్త సాంగ్ టీజర్ వచ్చింది
Also Read: ఇమ్మూ-వర్ష జోడీ వచ్చాక... సుధీర్-రష్మీ జోడీకి క్రేజ్ తగ్గిందా?
Also Read: నువ్వు పెళ్లి చేసుకుని వెళ్లిపోతే బంగార్రాజు... మాకు ఇంకెవ్వడు కొనిపెడతాడు కోకా బ్లౌజు?
Also Read: తూరుపు కొండలు వెలిగిద్దాం... విప్లవ గీతం వినిపిద్దాం! - రవన్న పాత్రలో రానా విప్లవ గళం విన్నారా?
Also Read: అమెరికాలో బాలకృష్ణ క్రేజ్ అన్‌స్టాపబుల్... మరో రికార్డ్ క్రియేట్ చేసిన 'అఖండ'
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి