Karate Kalyani: యూట్యూబ్ ఛానెల్స్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు!
నటి కరాటే కళ్యాణి అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తోన్న ఇరవై యూట్యూబర్ ఛానెల్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నటి కరాటే కళ్యాణి(Karate Kalyani) అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తోన్న యూట్యూబర్స్ పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సుమారు ఇరవై యూట్యూబ్ ఛానెల్స్(Youtube Channels) పై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఐటీ యాక్ట్ లోని 67A, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే ఆయన యూట్యూబ్ ఛానెల్స్ పై నిఘా పెట్టడంతో పాటు కేసు విచారణకు ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేశారు.
త్వరలోనే సదరు యూట్యూబ్ ఛానెల్స్ కు పోలీసులు నోటీసులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజులుగా యూట్యూబర్స్ పై దాడి, చైల్డ్ వెల్ఫేర్ తనిఖీలు అంటూ వార్తల్లో నిలుస్తోంది కరాటే కళ్యాణి. ప్రాంక్ పేరుతో ఆసభ్యవీడియోలు చేస్తున్నాడంటూ యూట్యూబర్ శ్రీకాంత్‌పై దాడి చేసింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
ఆ తరువాత కరాటే కళ్యాణి(Karate Kalyani) అక్రమంగా ఓ చిన్నారిని కొనుగోలు చేసిందని.. ఆమె ఇంట్లో చైల్డ్ వెల్ఫేర్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ విషయంపై ఇటీవల మీడియా ముందుకొచ్చి మాట్లాడింది కరాటే కళ్యాణి. అయితే చిన్నారి దత్తతపై ఇంకా క్లారిటీ రాలేదని చెబుతున్నారు అధికారులు.
Also Read: ‘ఎస్కేప్ లైవ్’ రివ్యూ - వాస్తవాలను కళ్లకు కట్టేలా సిద్ధార్థ్ వెబ్ సీరిస్, ఇదో ‘వైరల్’ ఆట!
View this post on Instagram