అన్వేషించండి

Kanguva 2: ‘కంగువా 2’లో ఆలియా? - డేట్స్ కోసం వేట ప్రారంభించిన నిర్మాతలు!

సూర్య హీరోగా నటిస్తున్న ‘కంగువా’ రెండో భాగంలో ఆలియా భట్‌ను కథానాయకగా తీసుకునేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

సూర్య హీరోగా నటిస్తున్న పీరియాడిక్ డ్రామా ‘కంగువా’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. రెండు భాగాలుగా ఈ సినిమా విడుదల అవుతుందని వార్తలు వస్తున్నాయి. రెండో భాగాన్ని మరింత భారీగా రూపొందించనున్నారని తెలుస్తోంది. ఇందులో సూర్యకు జోడిగా ఆలియా భట్‌ను తీసుకురానున్నారని సమాచారం. ప్రస్తుతం ఆలియా భట్ బాలీవుడ్‌లో స్టార్ స్టేటస్‌ను ఎంజాయ్ చేస్తుంది. దీంతో ఆలియా డేట్స్ కోసం ‘కంగువా’ టీమ్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించిందని తెలుస్తోంది.

‘కంగువా’ మీద సూర్య భారీ ఆశలు పెట్టుకున్నారు. థియేటర్లో సూర్య హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. ఎప్పుడో 2017లో వచ్చిన ‘సింగం 3’ తర్వాత సూర్యకు ఇంతవరకు సరైన హిట్ పడలేదు. ‘సురారై పొట్రు (తెలుగులో ఆకాశం నీ హద్దురా)’, ‘జై భీమ్’ సినిమాలు హిట్ అయినా అవి ఓటీటీ రిలీజులే. గతేడాది వచ్చిన ‘ఈటీ’ కూడా బాక్సాఫీస్ వద్ద బకెట్ తన్నేసింది. ‘విక్రమ్’లో రోలెక్స్ పాత్రకు బీభత్సమైన రెస్పాన్స్ రావడం ఒక్కటే ఊరట. దీంతో ‘కంగువా’కు తన కెరీర్‌లో దాదాపు రెండేళ్లు కేటాయించారు సూర్య. 2022 మార్చిలో ‘ఈటీ’ రిలీజ్ అయిన దగ్గర నుంచి ‘కంగువా’ పైనే కాన్సన్‌ట్రేట్ చేశారు.

ఇటీవల జరిగిన ఫ్యాన్స్ మీట్‌లో కంగువాపై విపరీతమైన నమ్మకం వ్యక్తం చేశారు. ‘మేం ఊహించిన దాని కంటే 100 రేట్లు అద్భుతంగా 'కంగువా' వచ్చింది. ప్రస్తుతం నేను ఆ సినిమా పనుల్లోనే బిజీ బిజీగా ఉన్నాను.’ అని సూర్య చెప్పారు. 'కంగువా' టీజర్‌లో ప్రాచీన తెగకు చెందిన నాయకుడిగా సూర్య కనిపించారు. ఆయన పాత్ర లుక్ బట్టి చూస్తే చాలా వీరోచితంగా ఉంటుందని అర్థం అవుతోంది. టైటిల్ రివీల్ చేసినప్పుడు సూర్య ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ హైలైట్ అని చెప్పాలి.

వచ్చే ఏడాది వేసవిలో పది భాషల్లో ‘కంగువా’ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్రీడీలో కూడా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'కంగువా'లో సూర్య సరసన బాలీవుడ్ హీరోయిన్, తెలుగు సినిమా 'లోఫర్' ఫేమ్ దిశా పటానీ నటిస్తున్నారు. 'కంగువా' టీజర్‌ను కూడా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఇంగ్లిష్ వెర్షన్ టీజర్ కూడా రిలీజ్ అయింది.

అసలు ఏ మాత్రం ఖర్చుకు వెనుకాడకుండా స్టూడియో గ్రీన్ నిర్మాతలు 'కంగువా'ను నిర్మిస్తున్నారని టీజర్ చూసి అర్థం చేసుకోవచ్చు. టీజర్‌లో ప్రతి ఫ్రేమ్‌లోనూ విజువల్ గ్రాండియర్ కనిపించింది. టీజర్, విజువల్స్ అంతా ఒక ఎత్తు అయితే దేవి శ్రీ ప్రసాద్ అందించిన నేపథ్య గీతం మరో ఎత్తు అని చెప్పాలి. కంగ, కంగ, కంగువా... అంటూ గూస్ బంప్స్ ఇచ్చే మ్యూజిక్ అందించారు డీఎస్పీ. ఈ టీజర్‌లో దేవి శ్రీ ప్రసాద్  రెగ్యులర్‌గా కాకుండా కొత్త తరహా సంగీతాన్ని వినిపించారు. దాంతో త్వరలో రానున్న పాటలపై కూడా అంచనాలు పెరిగాయి. 

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?

వీడియోలు

టీమిండియా, సౌతాఫ్రికా మధ్య నేడు ఆఖరి పోరు
సంజూ.. చుక్కలు చూపించాల!
కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Komatireddy Rajagopal Reddy: మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మంత్రిని కాబోతున్నా - డిక్లేర్ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Phone tapping case is SIT: ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సజ్జనార్ నేతృత్వంలో సిట్ - ఇప్పటి వరకూ ఏం తేల్చలేకపోయారా?
Andhra intermediate exams: ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
ఏపీలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లో మార్పుచేర్పులు - కొత్త షెడ్యూల్ ఫుల్ డీటైల్స్ ఇక్కడ
Pawan Kalyan: జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కల్యాణ్ వన్ టు వన్ భేటీ - పనితీరుపై సమీక్ష - గట్టి వార్నింగ్ ఇస్తున్నారా?
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
యువరాజ్ సింగ్,సోనూ సూద్ సహా పలువురి సెలబ్రిటీలకు షాక్, ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Bhartha Mahasayulaku Wignyapthi Teaser : 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
'భర్త మహాశయులకు విజ్ఞప్తి' టీజర్ వచ్చేసింది - మాస్ మహారాజ రవితేజ ఏం చేశారంటే?
Nara Lokesh: నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
నారా కుటుంబంలో అందరికీ అవార్డులు లోకేష్‌కు తప్ప - కష్టమేనని నిట్టూర్చిన యువనేత
Kovvuru Railway Station : కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
కొవ్వూరు ప్రజలకు శుభవార్త; మంగళవారం నుంచి ఆ రెండు ఎక్స్‌ప్రెస్‌లకు హాల్టింగ్!
Embed widget