అన్వేషించండి

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: విశ్వనాథ్ సినిమాల్లోని పాటల్ని ఎలా మర్చిపోగలం?

"పాట అంటే Fill in the Blnaks కాదు. Feel in the Blanks" అని నిర్వచించిన డైరెక్టర్ కళాతపస్వి కె. విశ్వనాథ్. ఆయన సినిమాల్లోని పాటలన్నీ సూపర్ హిట్టే. పాటలు కథకు బ్రేక్ వేయకూడదని భావిస్తారు విశ్వనాథ్. అందుకే...వాటిలోనూ కథ చెప్పిస్తారు. అందుకే ఆయన సినిమాల్లోని సాంగ్స్ అలా చిరస్థాయిగా నిలబడిపోయాయి. సంగీత, సాహిత్య ప్రధాన చిత్రాలను తెరకెక్కించిన విశ్వనాథ్...ఈ రెండింటికీ సమన్యాయం చేసే దిగ్గజాలనే తన టీమ్‌లో చేర్చుకున్నారు. కేవి మహదేవన్, ఇళయరాజా, వేటూరి సుందర రామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రి..ఈ కాంబినేషన్‌. ఇప్పటికీ ఎప్పటికీ సెన్సేషన్. మనసుని తాకే సిచ్యుయేషన్‌ని క్రియేట్ చేయడం వరకూ ఓ ఎత్తు అయితే..అందుకు తగ్గట్టుగా బాణీ కట్టి పదాలు కూర్చి పాటగా  మలచడం మరో ఎత్తు. విశ్వనాథ్ సినిమాల్లోని పాటలు అనగానే అందరికీ "సువ్వి సువ్వి" పాట ఠక్కున గుర్తొస్తుంది. అందుకు కారణం...ఆ పాటలోనూ "కథ" చెప్పడమే. గుండే లేని మనిషల్లే నిను కొండా కోనలకొదిలేశాడా..? అని హీరో క్వశ్చన్‌ చేయడం కథలో భాగమే. కోదండ రాముడిని నమ్ముకుంటే నిన్ను అడవుల పాలు చేశాడా..? అంటూ రామాయణ కథనూ ఇక్కడ గుర్తు చేశారు సినారె. ఈ ఆలోచన రావడానికి ఇన్‌స్పిరేషన్‌ మళ్లీ కథే. ఇదొక్కటే కాదు.

"ఆది నుంచి ఆకాశం మూగది..అనాదిగా తల్లి ధరణి మూగది.
నడుమ వచ్చి ఉరుముతాయి మబ్బులు...
ఈ నడమంత్రపు మనుషులకే మాటలు..ఇన్ని మాటలు.."

అని వేటూరితో తత్త్వం చెప్పించారు విశ్వనాథ్. ఈ "కులం" గోడలు మన చేతుల్తో మనమే కట్టుకున్నాం. ముందు నుంచి ఉన్నవేం కాదు...అనే అభ్యుదయవాదానికి ఇలా పాట కట్టించి వెండితెరపై చూపించారు విశ్వనాథ్. కళాతపస్వికి సంగీతమంటే ఎంత ప్రాణమో వేటూరి కలం, బాలు గళం చాటి చెప్పింది. "అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమే సోపానము" అని "సంగీతం" గొప్పదనాన్ని పరిచయం చేశారు శంకరాభరణం చిత్రంలో. 

జీవితాన్ని చాలా మంది చాలా రకాలుగా నిర్వచించారు. కళాతపస్వి కూడా తనదైన స్టైల్‌లో జీవితాన్ని డిఫైన్ చేశారు. అదీ వేటూరి మాటల ద్వారా. 

"నరుడి బతుకు నటన..ఈశ్వరుడి తలపు ఘటన..
ఆ రెంటి నట్ట నడుమ నీకెందుకింత తపన"  అని వేటూరితో చెప్పించిన విశ్వనాథ్..."కలలా కరగడమా జీవితాన పరమార్థం" అంటూ సిరివెన్నెల కలాన్ని పరుగులు పెట్టించారు. 

కవిత్వం, చిత్రలేఖనం, శిల్పం చెక్కడం ఈ లలిత కళలకు గౌరవం ఇచ్చే కళాతపస్వి విశ్వనాథ్..  

"పంచ భూతముల పరిష్వంగమున ప్రకృతి పొందిన పదస్పందన అది కవనమా.. 
కంటి తుదల హరివింటి పొదల తళుకందిన సువర్ణ లేఖనా అది చిత్రమా..
మౌన శిలల చైతన్య మూర్తులుగ మలచిన సజీవ కల్పన.. అది శిల్పమా.." అని సిరివెన్నెల రాయడానికి ఎంత స్ఫూర్తినిచ్చారో.

సాగర సంగమం చిత్రంలో క్లైమాక్స్‌లో వచ్చే పాట కంట తడి పెట్టిస్తుంది. లీడ్ క్యారెక్టర్ చనిపోయే ముందు వచ్చే ఈ పాటలో సంగీతం బాగుంటుందా, సాహిత్యం బాగుంటుందా అని అడగటం పిచ్చి ప్రశ్నే అవుతుంది. అంత బ్యాలెన్స్ చేశారు ఇళయరాజా, వేటూరి. అప్పటి వరకూ లీడ్ క్యారెక్టర్‌ని అసహ్యించుకున్న డ్యాన్సర్ చివరకు ఆయన ముందు ప్రదర్శన ఇస్తుంది. తన తప్పుని తెలుసుకుని ఆ పాట ద్వారానే తన పశ్చాత్తాపాన్నివ్యక్తం చేసేస్తుంది. ఇదంతా విశ్వనాథ్‌ ఎంత గొప్పగా వివరించి ఉంటే.."గురుదక్షిణైపోయే జీవం" అని ఒకే ఒక్క లైన్‌తో ఆ క్యారెక్టర్‌ గిల్ట్‌ని చెప్పేసి ఉంటారు వేటూరి. ఇవి జస్ట్ శాంపిల్స్ మాత్రమే. విశ్వనాథ్‌ పాటల్లోని సాహిత్యాన్ని విశ్లేషిస్తూ పోతే పెద్ద గ్రంథమే అవుతుంది. ఇవి అందరి నోటా వినిపించిన పాటలు కాబట్టి వీటి గురించి మాత్రమే మాట్లాడుకుంటున్నాం అంతే. 

Also Read: K Viswanath : సినిమాల్లో సంస్కృతికి టార్చ్ బేరర్ - విశ్వనాథ్ అంటే సాహసాలు కూడా!


 
 

 

టాప్ హెడ్ లైన్స్

Brahmamudi Serial Today October 20th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని వెళ్లగొట్టిన ఐషు – రాజు, ఇందు మధ్యలోకి ప్రశాంత్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీని వెళ్లగొట్టిన ఐషు – రాజు, ఇందు మధ్యలోకి ప్రశాంత్‌
Jagadhatri Serial Today October 19: వైజయంతిని గుర్తుపట్టిన రంగా...కేదార్‌ చెల్లిని ఏం చేశావని నిలదీసిన సుధాకర్‌
జగద్ధాత్రి సీరియల్: వైజయంతిని గుర్తుపట్టిన రంగా...కేదార్‌ చెల్లిని ఏం చేశావని నిలదీసిన సుధాకర్‌
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: త్రిగుణ్‌ని రోహిత్ చెంప దెబ్బ కొట్టాడా? నీతూని ఏడిపించేసిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: త్రిగుణ్‌ని రోహిత్ చెంప దెబ్బ కొట్టాడా? నీతూని ఏడిపించేసిన ముకేశ్!
Karthika Deepam 2 Serial Today October 20th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని అత్తకి అప్పగించిన సూరజ్! మరోసారి గొడవ!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్నని అత్తకి అప్పగించిన సూరజ్! మరోసారి గొడవ!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Telangana on El Nino Conditions: ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ అప్రమత్తం.. కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
Deputy CM Pawan Kalyan: పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
పల్లె పండుగ రోడ్డు తవ్వేసిన వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసులకు పవన్ కళ్యాణ్ ఆదేశం
Jio Platforms IPO: లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
లిస్టింగ్‌కు ముందే జియో IPO బంపర్ హిట్.. గ్లోబల్ ఇన్వెస్టర్ల క్యూ.. 30 రెట్లకు పైగా డిమాండ్!
ETV Win OTT : ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
ఈటీవీ విన్‌లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ - రాబోయే రెండు నెలల్లో సూపర్ మూవీస్ / వెబ్ సిరీస్
Telangana Congress: గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
గాంధీ, నెహ్రూ చరిత్రను చెరిపివేసే కుట్ర.. దేశం కోసం బీజేపీ చుక్క రక్తం చిందించిందా?: కాంగ్రెస్
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు- హైకోర్టులో వైసీపీకి మరో ఎదురుదెబ్బ
Secon-hand Tata Nexon: సెకండ్‌హ్యాండ్‌లో టాటా నెక్సాన్‌ కొనాలా? అదిరిపోయే ఫీచర్లు.. కానీ ఈ 3 సమస్యలు ఉంటే మీ జేబుకు చిల్లు పడినట్టే!
సెకండ్ హ్యాండ్ టాటా నెక్సాన్ కొనాలనుకుంటున్నారా? లక్షలు పెట్టే ముందు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
Embed widget