Kalyan Ram: దేవర ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‘ను మించి ఉంటుంది, కల్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు
Kalyan Ram About NTRs Devara: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న ‘దేవర‘ మూవీపై కల్యాణ్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా 'గేమ్ ఆఫ్ థ్రోన్స్'ను తలదన్నేలా ఉండబోతుందన్నారు.
Nandamuri Kalyan Ram About Devara Movie: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళితో కలిసి ‘RRR’ మూవీ చేశాక ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ‘RRR’ సినిమా తరువాత వస్తున్న మూవీ కావడంతో దేవరపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. వీటికి తోడు మేకర్స్ కూడా పలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే ఇలాంటి సినిమాను చూసి ఉండరని చెప్తున్నారు. తాజాగా ఈ చిత్ర నిర్మాత, జూ. ఎన్టీఆర్ సోదరుడు హీరో కల్యాణ్ రామ్ దేవర సినిమాపై కీలక విషయాలు వెల్లడించారు. ఈ సినిమా నిర్మాణం విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదన్నారు.
‘దేవర‘ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్‘ను మించి ఉంటుంది- కల్యాణ్ రామ్
‘దేవర’ సినిమా కథతో పాటు దాని నిర్మాణ విలువల గురించి కల్యాణ్ రామ్ పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ‘దేవర’ కథ 1990లలో మొదలైనట్లు ఉంటుందన్నారు. అంతేకాదు, ఈ సినిమా హాలీవుడ్ మూవీ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ను తలదన్నేలా ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘దేవర’ సినిమా కథ 1990లలో నడుస్తుంది. ఈ సినిమా నిర్మాణం కోసం చిత్రబందం ఎంతో కష్టపడుతోంది. సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో జాగ్రత్తగా డీల్ చేస్తున్నాం. ప్రతి సీన్ కోసం ఎంతో రీసెర్చ్ చేస్తున్నాం. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు చూసి ఉండరు. ఈ మూవీలో 30 ఫీట్ల లోతున అండర్ వాటర్ సీక్వెన్స్ షూట్ చేశాం. ఇలాంటి సీక్వెన్స్ ఇంతకు ముందు ఏ సినిమాలో చూసి ఉండరు. ఈ సీక్వెన్స్ కోసం ఏకంగా 8 నెలల పాటు పరిశోధన చేశాం. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ అనేది హాలీవుడ్ మూవీ. ‘దేవర’ సినిమా ఆ సినిమాను మించి ఉంటుంది’’ అని కల్యాణ్ రామ్ వెల్లడించారు.
జనవరి 8న ‘దేవర’ టీజర్ విడుదల
ఇక ‘దేవర’ సినిమాకు సంబంధించిన టీజర్ ను జనవరి 8న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత కొరటాల శివ పనితనం ఏ రేంజిలో ఉందో అర్థం అవుతుందన్నారు. ఆయను మీద తమకున్న నమ్మకం కూడా అదే రోజు తేలుతుందన్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్ రెడీ అయినట్లు టాక్ నడుస్తోంది. అనిరుధ్ సంగీతం మరో లెవల్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. టీజర్ లో వచ్చే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఆడియెన్స్ ను మ్యాజిక్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరుగుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ‘దేవర’ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మలయాళం నటుడు షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక నందమూరి కల్యాణ్ రామ్ తాజాగా ‘డెవిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అభిషేక్ ఆర్ట్స్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కింది. డిసెంబర్ 29న విడుదలైన ఈ మూవీకి మిశ్రమ స్పందన లభించింది.
Read Also: ‘హనుమాన్’ను రిలీజ్ ఎందుకు వాయిదా వేయలేదంటే? అసలు విషయం చెప్పిన ప్రశాంత్ వర్మ