News
News
వీడియోలు ఆటలు
X

ఎన్టీఆర్ పిల్లలకు అలియా భట్ స్పెషల్ సర్‌ప్రైజ్ - థ్యాంక్స్ చెప్పిన తారక్

అలియా ఇటు సినిమాలతో పాటు వ్యాపారంలోనూ దూసుకెళ్తోంది. రెండేళ్ల క్రితం దుస్తులకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పిల్లలకు తన బ్రాండ్ నుంచి ప్రత్యేక బహుమతులను పంపింది.

FOLLOW US: 
Share:

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతటి విజయాన్ని సాధించిందో అందరికీ తెలసిందే. ఇక ఈ మూవీలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు రావడంతో మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే ఈ సినిమాలో నటించిన వారికీ అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా సీత పాత్రలో కనిపిచింది అలియా భట్. ఈ పాత్రతో అలియా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతేకాదు తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరైంది. అలియా ఇటు సినిమాలతో పాటు వ్యాపారంలోనూ దూసుకెళ్తోంది. ఆమె రెండేళ్ల క్రితం దుస్తులకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించిన సంగతి తెలసిందే. ఈ నేపథ్యంలో ఆమె జూనియర్ ఎన్టీఆర్ పిల్లలకు తన బ్రాండ్ ఈద్ ఎ మామ(Ed-A-Mamma) నుంచి ప్రత్యేక బహుమతులను పంపింది. అయితే దీనిపై ఎన్టీఆర్ హర్షం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్ అవుతోంది.

అలియా భట్ ఎన్టీఆర్ కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు తన బ్రాండ్ నుంచి ప్రత్యేకంగా గిఫ్ట్ లు పంపంచి సర్పైజ్ చేసింది. అలియా తన కుమారులకు గిప్ట్ లు పంపించడం పట్ల ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ద్వారా ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. అందులో అలియా పంపిన గిఫ్ట్ ల ఫోటోను కూడా షేర్ చేశారు ఏన్టీఆర్. దానితో పాటు ఓ స్పెషల్ నోట్ ను రాసుకొచ్చారు. "నువ్వు పంపించిన ఈ దుస్తులు పిల్లలకు చాలా బాగా నచ్చాయి. అవి చూశాక వాళ్ల మొహంలో చిరునవ్వులు చూశాను’’ అంటూ కృతజ్ఞతలు తెలుపుతూనే త్వరలో తన పేరు మీద కూడా గిఫ్ట్ ఒకటి పంపాలంటూ అలియాను ట్యాగ్ చేశారు. దానికి అలియా కూడా స్పందిస్తూ ‘‘స్వీటెస్ట్ ఎన్టీఆర్ కోసం ఈద్ స్పెషల్ అవుట్ పుట్ ను సిద్దం చేస్తాను’’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

ఇక వీరి సినిమాల విషయానికొస్తే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తయి ఏడాది గడచిన సందర్భంగా ఇటీవలే అలియా భట్ ఓ స్పెషల్ పోస్ట్ చేసింది. ఈ మూవీతో అలియా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో కూడా పాపులారిటీ తెచ్చుకుంది. అలియా ప్రస్తుతం 'రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ' సినిమాలో నటిస్తోంది. ఎన్టీఆర్ కూడా అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఎన్టీఆర్ 30’ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ పనులు ఆలస్యం అవుతూ వస్తుందడటంతో ఈసారి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏర్పాట్లు చేస్తున్నారట, అలాగే టీమ్ అందరికీ తగు సూచనలు చేస్తున్నారట కొరటాల. ఇక ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగులో ఇదే ఆమె మొదటి సినిమా. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. 

Published at : 27 Mar 2023 11:27 AM (IST) Tags: RRR Jr NTR Alia Bhatt NTR 30

సంబంధిత కథనాలు

BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?

BRO Update: డబ్బింగ్ కార్యక్రమాలు షురూ చేసిన పవన్ కల్యాణ్ 'బ్రో' - మరీ ఇంత ఫాస్టా?

Buddy Movie First Look : తక్కువ అంచనా వేయకండి - 'బడ్డీ'తో బాక్సాఫీస్‌కు గురి పెట్టిన అల్లు శిరీష్!

Buddy Movie First Look : తక్కువ అంచనా వేయకండి - 'బడ్డీ'తో బాక్సాఫీస్‌కు గురి పెట్టిన అల్లు శిరీష్!

Priyanka Chopra: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా

Priyanka Chopra: చెత్త డైలాగులు, గంటల తరబడి ఎదురుచూపులు - ఆ సినిమా అంటే ఇప్పటికీ అసహ్యం: ప్రియాంక చోప్రా

BellamKonda Ganesh: మోక్షజ్ఞ నటన, డ్యాన్స్‌లతో తాత, తండ్రి పేరు నిలబెడతాడు - బాలయ్య ఫ్యాన్స్‌కు బెల్లంకొండ గణేష్ గుడ్ న్యూస్

BellamKonda Ganesh: మోక్షజ్ఞ నటన, డ్యాన్స్‌లతో తాత, తండ్రి పేరు నిలబెడతాడు - బాలయ్య ఫ్యాన్స్‌కు బెల్లంకొండ గణేష్ గుడ్ న్యూస్

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

బాలయ్య మూవీ టైటిల్ ఇదేనా, సమంత చెప్పులు చాలా కాస్ట్లీ గురూ - ఈ రోజు టాప్ 5 సినీ విశేషాలివే

టాప్ స్టోరీస్

KTR : జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !

KTR  :   జనాభాను నియంత్రించినందుకు దక్షిణాదికి అన్యాయం  - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు !

Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి

Kakani Satires On Chandrababu: మేనిఫెస్టోని వెబ్ సైట్ నుంచి డిలీట్ చేసిన ఘనత చంద్రబాబుదే- మంత్రి కాకాణి

Wrestlers At Haridwar: గంగా నదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధమైన రెజ్లర్లు, అంతలోనే ఆసక్తికర పరిణామం

Wrestlers At Haridwar: గంగా నదిలో మెడల్స్ పారవేసేందుకు సిద్ధమైన రెజ్లర్లు, అంతలోనే ఆసక్తికర పరిణామం

TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం, జీవితాంతం ఎగ్జామ్స్ రాయకుండా 37 మందిని డీబార్

TSPSC Paper Leak Case: టీఎస్ పీఎస్సీ సంచలన నిర్ణయం, జీవితాంతం ఎగ్జామ్స్ రాయకుండా 37 మందిని డీబార్