అన్వేషించండి

Jr NTR’sbag: ఎయిర్ పోర్టులో లూయిస్ విట్టన్ బ్యాగ్‌తో కనిపించిన ఎన్టీఆర్, దాని ధర ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ ఖరీదైన బ్యాగుతో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు. ప్రపంచ ప్రఖ్యాత లూయిస్ విట్టన్ బ్రాండ్ కు చెందిన ఆ బ్యాగ్ ధర ఎంతో తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సినిమా నటీనటుల లైఫ్ చాలా లగ్జరీగా ఉంటుంది. ఉండే ఇల్లు, తిరిగే కార్లు, వేసుకునే దుస్తులు సహా అన్నీ ఖరీదైనవే వాడుతారు. ఇక హీరోయిన్ల దగ్గరుండే పర్సులు, హ్యాండ్ బ్యాగులు ధరల గురించి తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది. రీసెంట్ గా హీరోలు సైతం ఖరీదైన బ్యాగులతో కనిపిస్తున్నారు. కొద్ద రోజుల క్రితం ఫ్యామిలీతో ఫారిన్ వెకేషన్ కు వెళ్తూ ఎయిర్ పోర్టులో ఖరీదైన బ్యాగుతో కనిపించారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.  లూయిస్ విట్టన్ కంపెనీకి చెందిన ఆ బ్యాగు ఖరీదు 3 లక్షల 92 వేలు అని తెలిసి అందరూ అశ్చర్యపోయారు.

ఎన్టీఆర్ బ్యాగు ఖరీదు రూ. 5,60,427

తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం ఓ ఖరీదైన బ్యాగుతో ఎయిర్ పోర్టులో కనిపించారు. తన కారులో నుంచి దిగితూ భుజానికి తగిలించుకుని ఎయిర్ పోర్టులోపలికి వెళ్లారు. ఈ బ్యాగు ఖరీదు గురించి తెలుసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారు. తొలుత ఎన్టీఆర్ దగ్గరున్న బ్యాగ్ గురించి నెటిజన్లు ఆరా తీశారు. ఆ బ్యాగ్ ధర ఎంత? కంపెనీ ఏంటి? సహా పలు విషయాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. చివరకు ఆ బ్యాగ్ వివరాలు తెలిసి షాక్ అవుతున్నారు.  ఎన్టీఆర్ విమానాశ్రయంలో  భుజానికి వేసుకుని తీసుకెళ్లిన ఆ బ్యాగ్ లూయిస్ విట్టన్ కంపెనీకి చెందినదిగా గుర్తించారు. ఈ  బ్యాగ్ హై-ఎండ్ ఫ్యాషన్ కు గుర్తుగా చెప్పుకోవచ్చు. ఈ యాక్సెసరీ విలువ రూ. 5,60,427.44. పూర్తిగా బ్లాక్ కలర్ లో ఉన్న ఈ బ్యాగు చూపరులను బాగా ఆకట్టుకుంది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamlesh Nand (work) (@artistrybuzz_)

లగ్జరీ లైఫ్ కు సింబల్ లూయిస్ విట్టన్ బ్యాగ్

మనలో చాలా మంది  సాధారణ బ్యాక్‌ ప్యాక్‌ ను కొనుగోలు చేసి సంతృప్తి చెందుతారు. అయితే,  ఎన్టీఆర్ లూయిస్ విట్టన్ యాక్సెసరీ మాత్రం చాలా ఖరీదైన బ్యాక్ ప్యాక్. ఇది స్టైలిష్‌గా మాత్రమే కాదు, ఫంక్షనల్‌గా కూడా ఉంటుంది. ఎందుకంటే, ఇది మంచి నాణ్యత కలిగిన మెటీరియల్ తో తయారు చేస్తారు. అంతేకాదు, మల్టీ  కంపార్ట్‌ మెంట్‌లను కలిగి ఉంటుంది. డిజైనర్ ఫ్యాషన్‌లో స్పెషల్ ప్రొడక్టుగా చెప్పుకోవచ్చు. ఆయన ఈ బ్యాగ్ తో ఎయిర్ పోర్టులో కనిపించిన తర్వాత చాలా మంది ఈ బ్యాగ్ గురించి  సెర్చ్ చేశారట. ఈ బ్యాగ్ ను కొనుగోలు చేసిన వారంతా, దీనిని లగ్జరీ లైఫ్ కు చిహ్నంగా భావిస్తారట. అందులో భాగంగానే ఎన్టీఆర్ సైతం లూయిస్ విట్టన్ బ్యాగ్ ను  తీసుకున్నారట.

‘దేవర’ చిత్రంలో నటిస్తున్న ఎన్టీఆర్

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవర’ సినిమాలో నటిస్తున్నారు. ఈ మూవీకి టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభించిన షూటింగ్ షెడ్యూల్ ను విజయవంతంగా పూర్తి చేసింది మూవీ టీమ్. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టు తెలుస్తోంది.  ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. తెలుగులో ఇదే ఆమెకు మొదటి సినిమా కావడం విశేషం. అలాగే బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారట. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5 న రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్‌ పై హరికృష్ణ కె, యువసుధ ఆర్ట్స్‌పై సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

Read Also: ఆస్కార్ కమిటీలో ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి - మళ్ళీ కాలర్ ఎగరేసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' టీమ్

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Dacoit Chichubuddi Song : స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
స్పెషల్ సాంగ్‌లో ఫేమస్ సింగర్ - ఈ 'చిచ్చుబుడ్డి' బ్యూటీ ఎవరో తెలుసా?
Anakapalli Movie: వయలెంట్‌గా విక్రమ్ సహిదేవ్... వేసవిలో విడుదలకు 'అనకాపల్లి'
వయలెంట్‌గా విక్రమ్ సహిదేవ్... వేసవిలో విడుదలకు 'అనకాపల్లి'
Kalki 2898AD Sequel : కాస్త ఆలస్యమైందా ఆచార్య దేవా! - షూటింగ్‌లో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే?
కాస్త ఆలస్యమైందా ఆచార్య దేవా! - షూటింగ్‌లో ప్రభాస్ ఎంట్రీ ఎప్పుడంటే?
Kriti Sanon : నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్

వీడియోలు

IPL 2026 Opening Ceremony | ఆర్సీబీ, సన్ రైజర్స్ మ్యాచ్ కి ముందు ఎలాంటి హంగామా ఉండదు | ABP Desam
MS Dhoni Injury CSK IPL 2026 Update | మొదటి మ్యాచ్ కి ముందే తలా అభిమానులకు భారీ షాక్ | ABP Desam
RCB vs SRH Match Preview IPL 2026 | నేటి నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 19వ సీజన్ | ABP Desam
Vaibhav Sooryavanshi Turned 15 IPL 2026 | బీసీసీఐ నిబంధనలకు అర్హుడయ్యాడు...సీనియర్స్ టీమ్ లో చోటే తరువాయి | ABP Desam
Surya Tilak in Ayodhya on Ram Navami | అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం | ABP Desam

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TDP Foundation Day: ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఇకపై మూడు ముక్కలాటలు ఉండవు.. అమరావతి అభివృద్ధే లక్ష్యం: సీఎం చంద్రబాబు
PM Modi Mann Ki Baat: టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
టీమిండియాపై ప్రధాని మోదీ ప్రశంసలు.. ఇంధన కొరతపై వదంతులు నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి
TVK Candidate List: టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల.. 2 చోట్ల నుంచి బరిలోకి దిగుతున్న నటుడు విజయ్
CM Revanth Reddy: కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలు ఎందుకు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
కాళేశ్వరం కేసు సీబీఐకి అప్పగించినా కేసీఆర్‌పై చర్యలేవీ?: సీఎం రేవంత్ రెడ్డి
Kriti Sanon : నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
నాకు పెళ్లికి హడావిడి లేదు - డేటింగ్ రూమర్స్, పెళ్లిపై బాలీవుడ్ బ్యూటీ స్ట్రాంగ్ రియాక్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
MI vs KKR ముఖాముఖీ పోరులో పైచేయి ఎవరిది? వాంఖడేలో మ్యాచ్ అయినా ముంబైలో టెన్షన్
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?
Dhurandhar 2 Collections : బాహుబలి 2ని దాటేసిన ధురంధర్ 2 - ఆ రికార్డు పదిలం... 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
బాహుబలి 2ని దాటేసిన ధురంధర్ 2 - ఆ రికార్డు పదిలం... 10 రోజుల్లో కలెక్షన్స్ ఎంతంటే?
Embed widget