Joju George: దళపతి విజయ్ 'లియో'లో ‘ఇరట్టా’ స్టార్ జోజు జార్జ్
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ తెరకెక్కుతోన్న విజయ్ దళపతి నెక్ట్స్ ప్రాజెక్ట్ 'లియో' షూటింగ్ ప్రస్తుతం చెన్నైలో జరుగుతోంది. ఈ షూటింగులో తాజాగా మాలీవుడ్ నటుడు జోజు జార్జ్ జాయిన్ అయ్యారు.
Joju George : కోలీవుడ్ స్టార్స్ విజయ్ దళపతి, త్రిష జంటగా నటిస్తోన్న గ్యాంగ్‌స్టర్ డ్రామా 'లియో'పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం చెన్నైలో ఈ మూవీ షూటింగ్ జరుగుతుండగా.. తాజాగా ఈ మూవీ షూటింగ్ లో మాలీవుడ్ నటుడు జోజు జార్జ్ జాయిన్ అయ్యారు. విజయ్ తో పాటు ఆయన కూడా పలు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్టు సమాచారం.
2021లో విడుదలైన ధనుష్ నటించిన 'జగమే తంధిరమ్' అనే తమిళ సినిమాతో జోజు జార్జ్ చిత్రసీమలోకి అడుగుపెట్టారు. 2022 లో తమిళ చిత్రం 'బఫూన్'లో కీలక పాత్ర పోషించి, విమర్శకుల చేత ప్రశంసలు పొందారు. ఇటీవల విడుదలైన కాప్ డ్రామా, 'ఇరట్ట' వంటి మలయాళ చిత్రాలలో నటింటిన జోజు జార్జ్ .. అత్యంత పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
ఇక 'లియో' సినిమా విషయానికొస్తే.. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో కోలివుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్, పోస్టర్స్ కు విపరీతమైన స్పందన వచ్చింది. గత కొన్ని రోజుల క్రితమే కశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లియో.. గడ్డ కట్టే చలిలో చిత్ర బృందం పడిన కష్టానికి సంబంధించిన వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. వారందరికీ ఈ సందర్భంగా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు.
ఆ తర్వాత ఇటీవలే చెన్నై లో 'లియో' షూటింగ్ మొదలు కాగా... విజయ్ కు సంబంధించిన పలు కీలక సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. అందులో భాగంగానే ప్రముఖ మలయాళ దర్శకుడు, నటుడు జోజు జార్జ్ సైతం ఈ మూవీ షూటింగులో పాల్గొనట్టు తెలుస్తోంది. విజయ్ తో పాటు కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను షూట్ చేసినట్టు సమాచారం.
ఇటీవలే హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తోన్న ఓ సినిమాలో జోజు జార్జ్ విలన్ గా కనిపించనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ మూవీకి శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్త నిర్మాణంలో రూపొందున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు మెగా అభిమానులను ఆకట్టుకోగా.. ఇటీవలే ఈ సినిమాలో విలన్ పాత్రను పోషించనున్నట్టు మూవీ మేకర్స్ వెల్లడించారు.
ఈ సందర్భంగా జోజు జార్జ్ కు పాత్రకు సంబంధించి ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఆయన ఈ సినిమాలో ఆయన ‘చెంగా రెడ్డి’ అనే ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జోజు లుక్ ను రివీల్ చేస్తూ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జోజు జార్జ్ కు తొలి తెలుగు సినిమా కావడంతో తెలుగు ఫ్యాన్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పటివరకూ ఓటీటీ ఫ్లాట్ ఫాంలలో మాత్రమే కనువిందు చేసిన జోజు జార్జ్.. ఇప్పుడు పెద్ద స్క్రీన్ పైనా అలరించనుండడంతో ఆయన ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో వస్తోన్న 'లియో' మూవీ చెన్నై షెడ్యూల్‌ను పూర్తి చేసిన తర్వాత.. మూవీ టీమ్ మరో మేజర్ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలు నెలకొనగా.. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.
Also Read : మొగుళ్ళు బాధలే 'సేవ్ ద టైగర్స్' - 'భార్యల నుంచి కాపాడుకుందాం' అంటున్న ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ