News
News
X

Jersey Trailer: ‘జెర్సీ’ హిందీ ట్రైలర్: సేమ్ టు సేమ్.. కానీ, ‘అర్జున్ రెడ్డి’ తరహాలో హాట్ సీన్స్!

హిందీలో రీమేక్ అవుతున్న నాని చిత్రం ‘జెర్సీ’ ట్రైలర్ వచ్చేసింది. ఎలా ఉందో చూసేయండి.

FOLLOW US: 
Share:

షాహీద్ కపూర్ తెలుగు రీమేక్స్‌లో బిజీగా ఉన్నాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాను హిందీలో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ‘జెర్సీ’ సినిమాతో మరోసారి తన లక్ పరీక్షించుకోడానికి సిద్ధమైపోతున్నాడు. పైగా.. ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది మన తెలుగు నిర్మాతలే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు, నాగ వంశీ, అమన్ గిల్ నిర్మాతలు. బన్నీ వాసు సహ నిర్మాత. 

నానీ హీరోగా నటించిన ‘జెర్సీ’ సినిమా.. ఏ స్థాయిలో హిట్ కొట్టిందో తెలిసిందే. ఈ చిత్రం బాలీవుడ్‌ను సైతం ఆకట్టుకోవడంతో హిందీలో రీమేక్ చేశారు. తెలుగులో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన  గౌతమ్‌ తిన్ననూరి హిందీ ‘జెర్సీ’కి కూడా దర్శకత్వం వహించారు. షూటింగ్‌తోపాటు అన్ని పనులు పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌ 31న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ బుధవారం ‘జెర్సీ’ ట్రైలర్‌ను యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. 

Also Read: దెబ్బలతో సన్నీ లియోన్.. అయ్యో ఏమైంది?

క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో షాహిద్‌ కపూర్‌కి జోడీగా మృణాల్‌ ఠాకూర్‌ నటించింది. ట్రైలర్ చూస్తుంటే.. ఎలాంటి మార్పులు లేకుండా మక్కికి మక్కికి దించేసినట్లు తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలోని ఒరిజనల్ కంటెంట్‌ను ఏ మాత్రం మార్చినా ఫీల్ మిస్ అవుతుందనే దర్శకుడు సీన్ టు సీన్.. రీమేక్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ కావడంతో హాట్ సీన్స్‌లో మాత్రం రాజీ పడలేదు. ‘కబీర్ సింగ్’ తరహాలోనే షాహీద్ కపూర్ ఈ చిత్రంలో కూడా ముద్దు సీన్లలో జీవించాడు. మొత్తానికి ట్రైలర్ చూస్తుంటే.. హిందీలో కూడా హిట్ కొట్టేట్లే ఉంది. అయితే, ఇందులోని కొన్ని సీన్లు ‘అర్జున్ రెడ్డి’ (కబీర్ సింగ్)‌ను పోలి ఉండటంతో.. బాలీవుడ్ అభిమానులు ఈ చిత్రాన్ని ‘కబీర్ సింగ్ 2.0’ అంటున్నారు. హిందీ ‘జెర్సీ’ ట్రైలర్‌ను ఇక్కడ చూడండి. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 24 Nov 2021 01:59 PM (IST) Tags: shahid kapoor jersey movie Jersey Trailer Jersey Hindi Trailer జెర్సీ

సంబంధిత కథనాలు

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Brad Minnich For NTR 30 : ఎన్టీఆర్ సినిమాకు ఇంకో హాలీవుడ్ టచ్ - స్టార్ టెక్నీషియన్ వచ్చాడుగా 

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

Janaki Kalaganaledu March 28th: ఒక్కటైన రామ, జానకి- సంతోషంలో జ్ఞానంబ, అనుమానించిన మల్లిక

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

డేటింగ్‌పై నెటిజన్ వింత ప్రశ్న, తన స్టైల్ లో రిప్లై ఇచ్చిన సమంత

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

'పులి' నుంచి 'కబ్జ' వరకు - పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఇదే జరుగుద్ది

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

మాధురీ దీక్షిత్‌పై అస‌భ్య వ్యాఖ్య‌లు - ‘నెట్‌ఫ్లిక్స్’కు లీగ‌ల్ నోటీసులు జారీ

టాప్ స్టోరీస్

Modi Flexis on Flyover: హైదరాబాద్‌ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు

Modi Flexis on Flyover: హైదరాబాద్‌ ఫ్లై ఓవర్ పిల్లర్లపై మోదీ పోస్టర్లు, ఇంకెన్నాళ్లు కడతారని విమర్శలు

మార్గదర్శి కేసులో మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

మార్గదర్శి కేసులో  మరో సంచలనం- రామోజీరావు, శైలజకు ఏపీ సీఐడీ నోటీసులు

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలకు ట్రాపిక్ అలర్ట్ - 90 రోజుల పాటు అటు చూడొద్దు!

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు

EPFO: శుభవార్త వచ్చేసింది, EPF వడ్డీ రేటు 8.15%కు పెంపు