News
News
X

Sunny Leone: దెబ్బలతో సన్నీ లియోన్.. అయ్యో ఏమైంది?

శృంగార తార సన్ని లియోన్‌ దెబ్బలతో ఉన్న ఫొటోను ట్వీట్ చేసింది. త్వరలోనే దీనిపై అప్‌డేట్ ఇస్తానని ప్రకటించింది.

FOLLOW US: 

సన్నీ లియోన్.. ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చదువుకున్న వ్యక్తుల నుంచి చదువురానివారి వరకు గూగుల్‌లో స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కొట్టగలిగే ఏకైక సెలబ్రిటీ పేరు ఇది. అందుకే ఒకప్పుడు గూగుల్ ట్రెండ్స్‌లో టాప్‌లో ఉండేది. ఇప్పుడు ఆమె పోర్న్ రాజ్యాన్ని వదిలి.. బాలీవుడ్ బాట పట్టడంతో ఆమెను వెతికేవారి సంఖ్య తగ్గింది. అయితే, ఆమె సినిమాలను బిగ్ స్క్రీన్ మీద చూసి ఆనందించాలని కోరుకొనే అభిమానుల సంఖ్య మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. అందుకే.. ఆమె తన ఫ్యాన్స్‌ కోసం కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వెబ్ సీరిస్‌ల్లో కూడా కనిపిస్తోంది. రియాలిటీ షోలతో సైతం అలరిస్తోంది. 

తాజాగా ఆమె ట్విట్టర్‌లో దెబ్బలతో ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు అయ్యో సన్నీ.. ఏమైంది అని అడుగుతున్నారు. అయితే, ఆమె దెబ్బలను చూసి మీరు అంత ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. త్వరలో విడుదల కాబోయే ఓ సినిమా లేదా వెబ్ సీరిస్‌లోని సన్నివేశంలో సీన్‌ను ఆమె షేర్ చేసింది. త్వరలోనే అప్‌డేట్ చెబుతానని ఊరించింది. 

సన్నీ లియోన్ ప్రస్తుతం చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంది. ఆమె నటిస్తున్న ‘షేరో’ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ‘పట్టా’ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2022లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. సన్నీ తెలుగులో నటిస్తున్న ‘వీరమహాదేవి’ చిత్రం ఈ నవంబరు 27న విడుదల కానున్నట్లు అప్పట్లో నిర్మాతలు ప్రకటించారు. అయితే, ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా అనేది కూడా అనుమానమే. ఇవి కాకుండా ‘రంగీలా’, ‘ఓ మై ఘోస్ట్’, ‘అనామిక’ చిత్రాలు కూడా క్యూలో ఉన్నాయి. మరి, తాజా సన్నీ ట్వీట్ చేసిన స్టిల్ ఏ చిత్రంలోనిదో తెలియాల్సి ఉంది.  

Also Read: 'కె.జి.యఫ్' రేంజ్‌లో NTR31... ఆ సినిమా గురించి ఎన్టీఆర్ ఏమన్నారంటే?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి 

Published at : 24 Nov 2021 12:40 PM (IST) Tags: Sunny Leone సన్నీ లియోన్ Sunny Leone Movies Sunny Leone Video Sunny Leone Web Series

సంబంధిత కథనాలు

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Mahesh Babu: ఆ మహేష్ బాబును మళ్లీ చూడలేమా? ఈ ప్రయోగాలు మరే హీరో చేయలేడు!

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Sravanthi Instagram Hacked: ‘బిగ్ బాస్’ బ్యూటీ స్రవంతికి హ్యాకర్స్ షాక్, అవన్నీ డిలీట్ - ఇవి మాత్రమే మిగిలాయ్!

Pawan Kalyan Mahesh Babu : ఆ రోజు మహేష్ బాబుకు మద్దతుగా నిలిచా - పవన్ కళ్యాణ్ 

Pawan Kalyan Mahesh Babu : ఆ రోజు మహేష్ బాబుకు మద్దతుగా నిలిచా - పవన్ కళ్యాణ్ 

Chiranjeevi Aamir Khan : మెగాస్టార్‌తో అటువంటి సినిమా సాధ్యమేనా?

Chiranjeevi Aamir Khan : మెగాస్టార్‌తో అటువంటి సినిమా సాధ్యమేనా?

Meena: ‘నీకు మేమున్నాం మిత్రమా’ - మీనాను కలిసిన అలనాటి తారలు

Meena: ‘నీకు మేమున్నాం మిత్రమా’ - మీనాను కలిసిన అలనాటి తారలు

టాప్ స్టోరీస్

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Tirumala News : శ్రీవారి భక్తులకు టీటీడీ అలర్ట్, తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి

Zoonotic Langya virus: చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Zoonotic Langya virus:  చైనా నుంచి మరో వైరస్ - ఇది కరోనా కంటే ఎంత డేంజరంటే ?

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!

Alto K10 2022 Vs Celerio: కొత్త ఆల్టో K10 ఫస్ట్ లుక్ రివ్యూ, సెలెరియో ఫీచర్స్‌తో మరో బడ్జెట్ కార్, ప్రత్యేకతలు ఇవే!

Telangana Cabinet : 11న తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ !

Telangana Cabinet : 11న తెలంగాణ కేబినెట్ భేటీ - కీలక నిర్ణయం తీసుకునే చాన్స్ !