అన్వేషించండి

Vedavyas Movie : సరికొత్త కాన్సెప్ట్‌తో 'వేదవ్యాస్' - మీ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి... హీరో ఎవరో తెలుసా?

SV Krishna Reddy Movie : ఒకప్పటి స్టార్ డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి 'వేదవ్యాస్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో హీరోగా పిడుగు విశ్వనాథ్‌ను ఇంట్రడ్యూస్ చేశారు.

Director SV Krishna Reddy New Movie Vedavyas Latest Update : తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌ హిట్స్ అందించిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. డైరెక్టర్‌గా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఆయన దర్శకత్వంలో 43వ సినిమా ఎప్పుడో అనౌన్స్ చేసినా తాజాగా హీరో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్‌లో జరిగిన ఈవెంట్‌లో నటుడు సాయికుమార్ అతిథిగా పాల్గొన్నారు.

హీరో ఎవరంటే?

ఈ మూవీకి 'వేదవ్యాస్' అనే టైటిల్ ఫిక్స్ చేయగా... పిడుగు విశ్వనాథ్ హీరోగా పరిచయం అవుతున్నారు. సౌత్ కొరియా నటి జున్ హ్యూన్ జీ హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి సమర్పణలో సాయిప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త, పొలిటీషియన్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. 

ఇదే ఫస్ట్ టైం

అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి కాంబో సినిమాలో తాను నటించడం ఇదే ఫస్ట్ టైం అని సీనియర్ హీరో సాయికుమార్ అన్నారు. 'వారి ఫస్ట్ డబ్బింగ్ మూవీ సూర్య ది గ్రేట్‌కు నేనే డబ్బింగ్ చెప్పా. అప్పటి నుంచి వారితో మంచి అనుబంధం ఉంది. 'వేదవ్యాస్' సినిమాలో వేద నారాయణ అనే మంచి క్యారెక్టర్‌లో నటిస్తున్నా. మన నాగరికతను మనం మర్చిపోకూడదనే మంచి అంశంతో కుటుంబమంతా కలిసి చూసేలా ఈ చిత్రాన్ని ఎస్వీ కృష్ణారెడ్డి రూపొందిస్తున్నారు.

విశ్వనాథ్‌ను హీరోగా పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా మనకు పరిచయం ఉన్న పిడుగు సుబ్బారావు గారి కొడుకు పిడుగు విశ్వనాథ్ హీరోగా మన ముందుకు వస్తున్నారు. ఆయన హీరోగా మంచి పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.

Also Read : యశ్‌తో రొమాంటిక్ సీన్స్ - ఇన్ స్టా డిలీట్ చేసిన టాక్సిక్ బ్యూటీ... అసలు రీజన్ అదేనా?

'అది నా అదృష్టం'

'వేదవ్యాస్' సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమని అన్నారు హీరో పిడుగు విశ్వనాథ్. 'ఈ అవకాశం కల్పించిన అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి గారికి కృతజ్ఞతలు. మూవీలో బాగా నటించేందుకు, బాగా కనిపించేందుకు సపోర్ట్ చేసిన మా టీమ్ అందిరికీ థ్యాంక్స్. నాకు గతంలో ఏడీగా వర్క్ చేసే అవకాశం కల్పించారు నీరజ కోన, త్రికోటి గారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నా.' అని చెప్పారు.

అదే స్పెషల్

విశ్వనాథ్ ప్రతీ సీన్‌లో చాలా అద్భుతంగా నటించారని అన్నారు డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. 'విశ్వనాథ్ హీరోగా మంచి పేరు తెచ్చుకుంటాడు. అలాగే మా మూవీలో కీలకంగా ఉండే వేద నారాయణ అనే పాత్రలో సాయికుమార్ నటించారు. కొరియన్ అమ్మాయిని హీరోయిన్‌గా తీసుకున్నాం. ఆమె తెలుగు నేర్చుకుని తన డబ్బింగ్ చెప్పుకొంది. అలాగే మంగోలియా విలన్ బాగా నటించాడు. భారతీయ సంస్కృతి సంప్రదాయల గొప్పదనం చాటేలా రూపొందిస్తున్న ఈ సినిమా గురించి మేము ఇక్కడ చెప్పేది చాలా తక్కువ. మిగతా అంతా మూవీలో చూస్తారు.' అని తెలిపారు.

దాదాపు ఐదేళ్లు ఈ స్క్రిప్ట్‌పై ఎస్వీ కృష్ణారెడ్డి వర్క్ చేశారని నిర్మాత అచ్చిరెడ్డి తెలిపారు. 'ఈ సినిమా కోసం ప్రతీ విషయం కొత్తగా ఉండాలని ఎస్వీ కోరుకున్నారు. కొరియా వెళ్లి ఆడిషన్ చేసి కొరియన్ అమ్మాయి జున్ హ్యున్ జీని సెలెక్ట్ చేసుకున్నారు. ఆడియన్స్ ఆ క్యారెక్టర్‌ను యాక్సెప్ట్ చేస్తారని చెప్పారు. అలాగే మంగోలియా వెళ్లి విలన్‌ను సెలెక్ట్ చేశారు. ఓ కొత్త హీరో అయితేనే బాగుంటుందని విశ్వనాథ్‌ను తీసుకున్నారు. మూవీలో వీళ్లందరినీ చూశాక ఆయన జడ్జిమెంట్ ఎంత కరెక్ట్ అనేది అర్థమైంది.' అని అన్నారు.

'వేదవ్యాస్' నటీనటులు - పిడుగు విశ్వనాథ్, జున్ హ్యున్ జీ, మురళీ మోహన్, సుమన్, సాయికుమార్, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రఘుబాబు, పృథ్వీ, రాజశ్రీ నాయర్, విద్యుల్లేఖ రామన్, దేవి శ్రీ, నవీనా రెడ్డి, ఐమ్యాక్స్ వెంకట్, బేబి సహస్రశ్రీ, మాస్టర్ మురారి, మాస్టర్ మోక్షజ్ఞ, మాస్టర్ రాయన్, తదితరులు

టెక్నికల్ టీమ్ - వీఎఫ్ఎక్స్ ప్రొడ్యూసర్ - ఆకుల సునీల్, మేకప్ - రాఘవ రాపర్తి, కాస్ట్యూమ్స్ - గుబ్బల నరసింహారావు, చందాన రామకృష్ణ, స్టిల్స్ - మనీషా ప్రసాద్, పబ్లిసిటీ డిజైనర్ - ధని ఏలె, ప్రొడక్షన్ కంట్రోలర్ - ఉదయభాస్కర్, లిరిక్ రైటర్స్ - భువనచంద్ర, డా.వెనిగళ్ల, రాంబాబు, డ్యాన్స్ మాస్టర్ - సుచిత్ర చంద్రబోస్, ఎడిటర్ - ఛోటా కె ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ - బ్రహ్మ కడలి, డీవోపీ - శరత్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మేడపాటి శ్రీనివాస్ రెడ్డి, పీఆర్ఓ - ప్రభు, సమర్పణ - కె. అచ్చిరెడ్డి, నిర్మాత - కొమ్మూరి వి ప్రతాప్ రెడ్డి, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం - ఎస్వీ కృష్ణారెడ్డి.

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Sowcar Janaki Career : 400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
400కు పైగా సినిమాలు... పర్సనల్ లైఫ్‌లో అవమానాలు - షావుకారు జానకి సినీ కెరీర్, ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలుసా?
Sowcar Janaki : సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూత - సినీ ఇండస్ట్రీ తీవ్ర దిగ్భ్రాంతి
Revenge Thriller OTT : తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
తాప్సీ లేటెస్ట్ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ - డైరెక్ట్‌గా ఓటీటీలోకి గాంధారి... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna
పిల్లాడిలా పేరెంట్స్‌తో మధ్య పడుకున్న విజయదేవరకొండ.. ఫోటో తీసిన Rashmika Mandanna

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Embed widget