JD Chakravarthy: ఒకే అమ్మాయితో నేను, వంశీ ప్రేమలో పడ్డాం - మహేశ్వరితో ప్రేమపై జేడీ చక్రవర్తి స్పందన
ఉన్న మ్యాటర్ కు మంచిగా మసాలా దట్టించి చెప్పడంలో జేడీ చక్రవర్తి ముందుంటాడు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ మహేశ్వరితో ప్రేమాయణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రామ్ గోపాల్ వర్మ ‘శివ’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జేడీ చక్రవర్తి, ‘గులాబీ’ సినిమాతో ఓ రేంజిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ సినిమా అంటే ఇప్పటిక పడిచచ్చే యువతీ, యువకులు ఎంతో మంది ఉన్నారు. మేఘాలలో తేలిపొమ్మన్నది, తూఫానులా రేగిపొమ్మన్నది అనే పాట ఇప్పటికీ చాలా హమ్ చేస్తూనే ఉంటారు. 1995లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఆన్ స్ర్కీన్ మీద ఇద్దరూ ఓ రేంజిలో రొమాన్స్ పండించారు. ఆ తర్వాత వీరిద్దరి గురించి ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే ప్రచారం జరిగింది. ఇప్పటికీ ఆ ప్రచారం అలాగే కొనసాగుతోంది. తాజా ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి జేడీ స్పందించారు.
మహేశ్వరితో ప్రేమాయణం గురించి జేడీ క్లారిటీ
వాస్తవానికి సినిమా పరిశ్రమలో హీరో, హీరోయిన్ల మధ్య ఏదో ఉందనే వార్తలు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అలాగే చాలా ఏళ్ల క్రితం జేడీ చక్రవర్తి , మహేశ్వరి మధ్య ఎదో ఉందని గుసగుసలు వినిపించాయి. వీరిద్దరు కలిసి నటించిన కొన్ని సినిమాలు సైతం బాగా హిట్ అయ్యాయి. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.బాక్సాఫీసు దగ్గర రికార్డులు బద్దలు కొట్టింది. తాజాగా మహేశ్వరితో ప్రేమాయణం గురించి జేడీ చక్రవర్తి కీలక విషయాలు చెప్పుకొచ్చాడు. అప్పట్లో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నా, కుదరలేదనే వార్తలపైనా స్పందించాడు. తాము పెళ్లి చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా చేసుకునే వాళ్లమని చెప్పాడు. “ప్రేమలో ఉన్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్న చేసుకోలేదు అనేది వాస్తవం కాదు. పెళ్లి చేసుకోవాలని అనుకుంటే చేసుకునే వాళ్లం. చేసుకోవాలి అనుకోలేదు కాబట్టి చేసుకోలేదు. ఆమెతో రిలేషన్ షిప్ లో లేను. పెళ్లికి ముందు లేను. ఆ తర్వాత లేను. తను నాకు డియరెస్ట్ ఫ్రెండ్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. గులాబీ సినిమా సమయంలో వంశీ, నేను ఒకే అమ్మాయితో ప్రేమలో పడ్డాం. ఆ అమ్మాయి వంశీని అన్నయ్య అంది. నన్ను బ్రదర్ అంది” అని తెలిపాడు. అయితే, ఆ అమ్మాయి మహేశ్వరీయేనా? లేదా మరెవ్వరైననా అనే క్లారిటీగా చెప్పలేదు.
వర్మ మాదిరిగానే జేడీ సమాధానాలు
వాస్తవానికి జేడీ చక్రవర్తి చెప్పే మాటల్లో సగానికి పైగా అవాస్తవాలే ఉంటాయనేది ఇండస్ట్రీలో టాక్. మీడియాను, సినీ అభిమానులను ఆటపట్టిండమే పనిగా పెట్టుకుంటారట. అంతేకాదు, ఆయన వర్మ డెన్ నుంచి వచ్చిన వ్యక్తి కావడంలో కొన్నిసార్లు తలతోకా లేని సమాధానాలు కూడా వస్తుంటాయి. అమ్మాయిపై కామెంట్స్ కూడా అచ్చం వర్మ మాదిరిగానే చేస్తాడు. అచ్చం వర్మ మాదిరిగానే వ్యవహారశైలి ఉంటుంది. జేడీ సుమారు 30కి పైగా సినిమాల్లో నటించాడు. వర్మ తెరకెక్కించిన పలు సినిమాల్లో నటించాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో పాత్రల్లో కనిపించాడు. నేచురల్ యాక్టింగ్ తో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఓటీటీలోకి అడుగు పెట్టాడు. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు.
Read Also: కషాయం పేరుతో విషం ప్రయోగం, జేడీ చక్రవర్తి హత్యకు కుట్ర!