By: ABP Desam | Updated at : 18 Jun 2023 10:00 AM (IST)
జేడీ చక్రవర్తి(Photo Credit: Ramesh Bala/twitter)
జేడీ చక్రవర్తి గురించి పెద్దగా పరిచయం అసవరం లేదు. ఆర్జీవీ గ్యాంగ్ లో జేడీ ఒకరు. ఆయన తెరకెక్కించిన పలు సినిమాల్లో నటించాడు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఎన్నో పాత్రల్లో కనిపించాడు. నేచురల్ యాక్టింగ్ తో తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఓటీటీలోకి అడుగు పెట్టాడు. పలు వెబ్ సిరీస్ లలో నటిస్తున్నాడు.
కాసేపు జేడీ చక్రవర్తి సినిమాల గురించి పక్కన పెడితే, ఆయన మాట్లాడే మాటలు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంటాయి. ఆయన చెప్పే ప్రతి విషయం ఎదుటివారిలో క్యూరియాసిటీ కలిగిస్తాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తనపై హత్యాయత్నం జరిగిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తనను చంపేందుకు స్లో పాయిజన్ ఇచ్చినట్లు చెప్పాడు. అదీ ఏకంగా 8 నెలల పాటు ఇచ్చారని చెప్పుకొచ్చాడు. “వాస్తవానికి నాకు ఎలాంటి బ్యాడ్ హాబిట్స్ లేవు. కొంత కాలంగా క్రితం నాకు ఉన్నట్టు ఉండి శ్వాస సంబంధ సమస్యలు తలెత్తాయి. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టం గా ఉండేది” అన్నారు.
తన ఆరోగ్య సమస్య గురించి పలువురు డాక్టర్ల దగ్గరకు వెళ్లినా వాళ్లు ఏం తేల్చలేకపోయారని జేడీ చక్రవర్తి తెలిపారు. “తనకు ఆరోగ్య సమస్య తలెత్తగానే చాలా మంది డాక్టర్ల దగ్గరికి వెళ్లాను. ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ చూపించుకున్నాను. అయినా, నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. నా పరిస్థితి చూసి కష్టమే అన్నారు. అప్పుడు నా ఫ్రెండ్, నిర్మాత శేషురెడ్డి నాకు మంచి వైద్యం ఇప్పించారు. డాక్టర్ నాగార్జున దగ్గరకు తీసుకెళ్లి నా సమస్య చెప్పారు. ఆయన పరీక్షలు నిర్వహించి డ్రగ్స్ ఎందుకు తీసుకుంటున్నావు అడిని అడిగాడు. నాకు ఆ అలవాటే లేదని చెప్పాను. కానీ నాకు తర్వాత అర్థం అయ్యింది. నా శరీరంలోకి మత్తు పదార్థాలు ఎలా వెళ్లాయో” అని చెప్పారు.
కషాయం పేరుతో తనకు స్లో పాయిజన్ ఇచ్చారని చక్రవర్తి తెలిపారు. “నేను ఎడిటింగ్ చేస్తున్న సమయంలో నాకు కషాయం తాగే అలవాటు ఉండేది. ఓసారి నాతో ఉన్న నిర్మాత ఖాసీం కషాయం తాగుతానని చెప్పాడు. సరే అని తనకు ఇప్పించాను. ఆ కషాయం తాగి తను ఆస్వస్థకు గురయ్యాడు. ఇదే విషయాన్ని కషాయం తయారు చేసిన వ్యక్తికి చెప్పాను. నీ కోసం తయారు చేసిన కషాయం వేరేవాళ్లు ఎందుకు ఇచ్చావని తిట్టాడు. చివరకు హాస్పిటల్లో నాకు తెలిసిన విషయం ఏంటంటే, సుమారు 8 నెలల పాటు నా మీద విష ప్రయోగం జరిగింది. నేను రోజూ తీసుకున్న కషాయమే విషం అని వెల్లడి అయ్యింది. దాని కారణంగానే నాకు శ్వాస సంబంధ సమస్యలు వచ్చాయి. అయితే, విష ప్రయోగం చేసిన వ్యక్తులు ఎవరు? వారికి ఆ అవసరం ఏంటి? అనే విషయాన్ని మాత్రం జేడీ చెప్పలేదు.
జేడీ చక్రవర్తి నిజానికి ఉన్న విషయాలకంటే, లేని వాటిని ఉన్నట్లుగా చెప్పడంలో దిట్ట. గతంలో తేజ పెళ్లి గురించి సంచనల విషయాలు చెప్పాడు. ఆయన ప్రేమ పెళ్లిలో సినిమాల్లో మాదిరి ట్విస్టులు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తాజాగా ఈ విషయం గురించి మాట్లాడిన తేజ, జేడీ చెప్పిన మాటలన్నీ అవాస్తవం అని తేల్చి చెప్పారు. అటు గతంలో ఓసారి తనకు హాలీవుడ్ డైరెక్టర్ స్పీల్ బర్డ్ ఓ సినిమాలో అవకాశం ఇచ్చాడని చెప్పాడు. అది కూడా జస్ట్ జనాలను ఫూల్స్ చేయడానికి చెప్పిందేనని కొద్ది రోజుల్లోనే అర్థం అయ్యింది. ఇప్పుడు చెప్పిన స్లో పాయిజన్ కథ కూడా అంతే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Read Also: ‘కుదిరినప్పుడు రండి’ - ఏఏఏ సినిమాస్‌కు నాగబాబును ఆహ్వానించిన అల్లు అరవింద్!
Bigg Boss Telugu 7: ‘స్పా’ బ్యాచ్‌లో మనస్పర్థలు - టమాటాల గురించి శోభా, ప్రియాంకల గొడవ
Lokesh Kanagaraj Fight Club : ఫైట్క్లబ్తో వస్తున్న లోకేశ్ కనగరాజ్.. డైరక్టర్గా మాత్రం కాదు
Naga Panchami November 29th Episode : కరాళి ప్రాణత్యాగం.. రంగంలోకి ఫణేంద్ర.. పంచమికి అండగా సుబ్బు!
Krishna Mukunda Murari November 29th Episode : గత జ్ఞాపకాల్లో మురారి ముకుందతో పెళ్లికి ఏర్పాట్లు.. ముహూర్తం ఫిక్స్!
Bigg Boss Telugu 7: గౌతమ్‌కు ప్రియాంక సపోర్ట్ - వెధవను అయిపోయాను అంటూ అమర్ సీరియస్
Fire Accident: హైదరాబాద్‌లో భారీ ప్రమాదం, రూ.2 కోట్ల దాకా ఆస్తి నష్టం
Hyderabad Poll Queue Status: హైదరాబాద్ ఓటర్లకు గుడ్ న్యూస్, క్యూ లైన్లో ఎందరున్నారో ఇలా చెక్ చేసుకోండి
Telangana Elections: హైదరాబాద్ లో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
Sandeep Reddy Vanga : ‘స్పిరిట్’ విడుదల తేదీని రివీల్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా!
/body>