Jawan OTT Release: ఆ ఓటీటీకి ‘జవాన్‘ రైట్స్ - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?
షారుఖ్ ఖాన్ హీరోగా దర్శకుడు అట్లీ తెరకెక్కించిన 'జవాన్' సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటించిన తాజా యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘జవాన్’. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే అద్భుత విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సినిమా విడుదలైన వారం రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.650 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యాయి. ఈ చిత్రంపై దర్శకుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సహా పలువురు ప్రశంసలు కురిపించారు.
భారీ మొత్తానికి ఓటీటీ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్
ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. మరోవైపు ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి సంబంధించిన అన్ని భాషల ఓటీటీ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం భారీ మొత్తంలో డబ్బులు చెల్లించినట్లు తెలుస్తోంది. ‘జవాన్’ చిత్రాన్ని ఏకంగా రూ.250 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. అటు ఈ సినిమా విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ చివరి వారంలో లేదంటే నవంబర్ లో నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు టాక్ నడుస్తోంది. షారుఖ్ ఖాన్ నటించిన ఈ మూవీలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్ గా నటించింది. విజయ్ సేతుపతి ఈ చిత్రంలో విలన్ పాత్రలో కనిపించారు. దీపికా పదుకొణె అతిధి పాత్రలో కనిపించింది. అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు.
#Jawan digital rights sold at a whopping amount to #Netflix 🔥🔥🔥#JawanCreatesHistory #JawanBlockBuster #JawanTsunami pic.twitter.com/NIkRpZEGNt
— SRKian Forever (@srktheking4ever) September 13, 2023
#JAWAN: Streaming Rights Bagged By NETFLIX 💥🔥
— OTT STREAM UPDATES (@newottupdates) September 11, 2023
Streaming On NOVEMBER 2023 - Diwali Special 🎇🪔🎆#ShahRukhKhan | #Nayanthara | #DeepikaPadukone | #VijaySethupathi | #Anirudh | #Atlee 😎✌️#JawanCreatesHistory#JawanOnNetflix#JawanBlockBuster#BlockbusterJawan pic.twitter.com/8PTwZy0A3W
‘పఠాన్’తో దూకుడు పెంచిన షారుఖ్ ఖాన్
కొంతకాలంగా వరుస పరాజయాలతో ఇబ్బంది పడిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రం షారుఖ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘పఠాన్’ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ.1000 కోట్లకుపైగా వసూళు చేసింది. జాన్ అబ్రహాం, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో నటించిన ‘పఠాన్’ మూవీ ఈ ఏడాది జనవరి 25న విడుదల అయ్యింది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అయితే, కొంతమంది ఈ కలెక్షన్స్ మీద అనుమానం వ్యక్తం చేశారు. ఇవి వాస్తవ లెక్కలు కాదని వాదించారు. షారుఖ్ ను లేపడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. షారుఖ్ అభిమానులు మాత్రం ఇవి కచ్చితమైన లెక్కలే అని వాదించారు. కొద్ది రోజుల పాటు నెట్టింట్లో తెగ చర్చ జరిగింది. నెమ్మదిగా ఈ విషయాన్ని చాలా మంది మర్చిపోయారు.
Read Also: రెండో పెళ్లి చేసుకోబోతున్న నాగ చైతన్య? వధువు ఆమేనట!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial