News
News
X

Sridevi-Boney Kapoor: ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న శ్రీదేవి ఇల్లు - చెన్నైలో జాన్వీ హోమ్ టూర్, వీడియో వైరల్

చెన్నైలోని శ్రీదేవి ఇల్లు ఇంద్ర భవనంలా కనిపిస్తోంది. అతిలోక సుందరి ఎంతో ఇష్టపడే ఈ ఇంటికి సంబంధించిన వీడియోను జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ హోమ్ టూర్ వీడియో వైరల్ అవుతోంది.

FOLLOW US: 

అతిలోక సుందరిగా గుర్తింపు పొందిన నటీమణి శ్రీదేవి. తొలుత సౌత్ సినిమా పరిశ్రమలో సత్తా చాటిన ఈ అందాల తార, ఆ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. అక్కడ కూడా తన ప్రతిభ నిరూపించుకుంది. ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి చక్కటి గుర్తింపు తెచ్చుకుంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సినిమా పరిశ్రమలో అడుగు పెట్టిన తర్వాత.. తన ఎంతో ఇష్టపడి కొనుగోలు చేసిన తొలి ఆస్తి చెన్నైలోని ఇల్లు. ఈ ఇల్లు ఆమెకు ఎంతో ఎంతో ఇష్టం. తాజాగా చెన్నైలోకి ఆ ఇంటికి వెళ్లిన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్, తన తల్లితో ఉన్నఅనుబంధాన్ని గుర్తు చేసుకోవడంతో పాటు హోమ్ టూర్ నిర్వహించింది.

శ్రీదేవి-బోనీ పెళ్లిపై జాన్వీ ఇంట్రెస్టింగ్ కామెంట్!

జాన్వీ కపూర్ కు తన తల్లింద్రులు శ్రీదేవి, బోనీ కపూర్ అంటే ఎంతో ఇష్టం. వారే తన ప్రపంచంగా పెరుగుతోంది. శ్రీదేవి ఉన్నంత కాలం జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ తల్లి చాటు బిడ్డల్లా పెరిగారు. తన తల్లితో ఎన్నో జ్ఞాపకాలను పెనవేసుకుని పెరిగింది. తాజాగా తన తల్లికి ఎంతో ఇష్టమైన చెన్నై ఇంటికి వెళ్లింది. తన రాజభవనం లాంటి ఇంటికి సంబంధించి వోగ్ ఇండియాకు గ్రాండ్ టూర్ ఇచ్చింది. ఇందులో శ్రీదేవి కొన్నేళ్లుగా సేకరించిన అనేక పెయింటింగ్స్, ఆర్ట్ పీస్‌లను చూపించింది. శ్రీదేవి స్వయంగా వేసిన అనేక పెయింటింగ్స్ ఇందులో  ఉన్నాయి. జాన్వీ తన తల్లిదండ్రుల పెళ్లి ఫోటోలను చూపించింది. తమ తల్లిండ్రుల పెళ్లి రహస్యంగా జరిగినట్లు చెప్పింది. “ఇది అమ్మా నాన్నల పెళ్లి ఫోటో. వీరిద్దరు రహస్య వివాహం చేసుకున్నారు. అందుకే ఈ ఫోటోల్లో వారు చాలా ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఎందుకు అలా ఉన్నారో నిజంగా నాకు తెలియదు” అని ఆమె చెప్పింది.

జాన్వీ బాత్ రూమ్ తలుపుకు గొళ్లెం ఎందుకు ఉండదంటే?

జాన్వీ కపూర్ తన బెడ్ రూమ్ టూర్ ను కూడా చేసింది. ‘‘నేను అబ్బాయిలతో ఫోన్‌ లో మాట్లాడటం అమ్మకు ఇష్టం లేదు. అందుకే నా బాత్రూమ్ తలుపుకు గొళ్లం వేయడానికి అనుమతించేది కాదు. అందుకే, గోళ్లెం తీయించేసింది’’ అని తెలిపింది. లీకేజీల కారణంగా ఇల్లు మొత్తం రెన్నొవేషన్ చేసినట్లు జాన్వీ చెప్పింది. కొత్త నిర్మాణాలను నాన్న బోనీ కపూర్ దగ్గరుండి చేపట్టారని వెల్లడించింది. అయితే, పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసిన తర్వాత కూడా  బాత్రూమ్ తలుపుకు గొళ్లెం పెట్టలేదని చెప్పింది.

జాన్వీ కపూర్ సినిమాల విషయానికి వస్తే.. ‘దఢక్’ సినిమాతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో అడుగు పెట్టింది. 2018లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా జాన్వీ ‘మిలీ’ సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా బాగానే ఆడింది. ప్రస్తుతం తను రెండు సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి వరుణ్ ధావన్‌ హీరోగా నితేష్ తివారీ  దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘బవాల్’ మూవీ. మరొకటి శరణ్ శర్మ దర్శకత్వంలో రాజ్‌ కుమార్ రావుతో కలిసి ‘మిస్టర్ అండ్ మిసెస్హి’ మూవీ.

News Reels

Read Also: హీరోలకూ లైంగిక వేధింపులు? కాస్టింగ్ కౌచ్ పై రణ్ వీర్ సింగ్ షాకింగ్ కామెంట్స్

Published at : 17 Nov 2022 01:30 PM (IST) Tags: Sridevi Janhvi Kapoor Chennai house Home tour Sridevi-Boney Kapoor secret wedding Vogue India

సంబంధిత కథనాలు

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Ennenno Janmalabandham November 28th: కోర్టులో నేరం చేశానని ఒప్పుకున్న మాళవిక, షాకైన వేద - ఖుషి మీద అరిచిన ఆదిత్య

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

టాప్ స్టోరీస్

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

Minister Botsa : కాళ్లు పట్టుకునైనా సమస్యలు పరిష్కరించుకునే నేర్పు ఉండాలి - మంత్రి బొత్స

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి