Janaki Kalganaledu July 20th Update : జానకి చదువు బయట పెట్టేందుకు మల్లిక ప్లాన్- చివరికి జ్ఞానంబ చేతిలో మల్లికకు మొట్టికాయలు
జానకి ఐపీఎస్ కలని ఎలాగైనా నెరవేర్చాలని రామా ప్రయత్నిస్తాడు. కానీ జానకి మాత్రం అత్తయ్య జ్ఞానంబకి ఇచ్చిన మాట ప్రకారం పిల్లలు కందామని చెబుతుంది. అందుకు రామా ఒప్పుకోడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
జానకి రామాతో కలిసి ఏకాంతంగా ఉండడటం కోసం కాలు జారీ కింద పడి దెబ్బ తగిలినట్టు నటిస్తుంది. ఈ విషయాన్ని రామా పసిగట్టేస్తాడు. ఏంటి జానకి గారు మీరు ఇలా చేశారు, మీకు నిజంగానే దెబ్బ అతగిలిందని ఎంత కంగారూ పడ్డానో తెలుసా అని అనడంతో జానకి వెళ్ళి అమాంతం రామాని కౌగలించుకుంటుంది. దీంతో రామా షాక్ అవుతాడు. నా చదువు కోసం మీ ఇష్టాలని చంపేసుకుంటున్నారు, భార్యగా అది నా మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుందని జానకి అంటుంది. మీ చదువు కోసం మన మనసుని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం, నేను కొట్టుకు వెళ్తాను అని వెళ్లబోతుంటే జానకి రామాని తన మీదకి లాక్కుంటుంది. మిమ్మల్ని ఈరోజంతా నా పక్కనే ఉండమని చెప్పారు అత్తయ్యగారు, మరి ఏం చెప్పి వెళ్తారని అడగడంతో రామా బిక్క మొహం వేస్తాడు. మీ అల్లరికి నేను శిక్ష వేస్తున్నానని చెప్పి జానకికి పుస్తకాలు తెచ్చి ఇస్తాడు. అది మల్లిక చాటుగా చూసి నోరెళ్ళబెడుతుంది. ఈ విషయం అర్జెంట్ గా అత్తయ్యగారికి చెప్పాలని వెళ్తుంది.
Also Read: తులసి మీద సామ్రాట్ ఫైర్ , హనీని కాపాడిన తులసి- ఇల్లు వదిలి వెళ్ళిపోయిన శ్రుతి
జ్ఞానంబ జానకికి తగిలిన దెబ్బ గురించి బాధపడుతూ ఉండగా మల్లిక పరిగెత్తుకుంటూ వచ్చి పిలుస్తుంది. ఏమైంది ఎందుకు అరుస్తున్నావ్ అని జ్ఞానంబ తిడుతుంది. రాత్రి కాలేజీ వాళ్ళు ఫోన్ చేసి సర్టిఫికెట్స్ తెమ్మని చెప్పారని చెప్తే మీరు నమ్మలేదు కదా, జానకి ఏ ఐఎఎస్, ఐపీఎస్ చదువుతున్నట్టు పెద్ద పెద్ద పుస్తకాలు ముందేసుకుని చదువుతుందని చెప్తుంది. ఆ మాటకి జ్ఞానంబ దంపతులు షాక్ అవుతారు. పదండి అత్తయ్య గారు చుద్దూరు గాని రండి అని పిలుస్తుంది. కానీ జ్ఞానంబ మాత్రం ఎక్కడికి వచ్చేది ఓ పక్క జానకి కాలుకి దెబ్బ తగిలి అల్లాడిపోతుంటే నువ్వు ఇలా చెప్తావా అని తిట్టి పంపించేస్తుంది. జానకి చదువుతుందనే విషయం వీళ్ళకి తెలిసేలా ఎలా చెయ్యాలని మల్లిక తెగ ఆలోచిస్తుంది. ఇక జానకి చదువుకోనని మారాం చేస్తుంది. మళ్ళీ మల్లిక వెళ్ళి జ్ఞానంబ వాళ్ళని జానకి చదువుకుంటుందని చెప్పి వాళ్ళ గది దగ్గరకి తీసుకొస్తుంది. చూడండి అత్తయ్య గారు జానకి చేతిలో పుస్తకాలు ఉన్నాయని అంటుంది. జ్ఞానంబ వాళ్ళు చూసేసరికి జానకి, రామా కౌగలించుకుని ఉంటారు. అది చూసి మల్లికకి జ్ఞానంబ మొట్టికాయ వేస్తుంది. ఇక జానకి మీద చెడుగా చెప్పినందుకు మల్లికకు చీవాట్లు పెడుతుంది. ఇంకోసారి జానకి మీద చాడీలు చెప్తే పుట్టింట్లో ఉంటావని చెప్పి వెళ్ళిపోతుంది.
Also Read: ఖైలాష్ ని చితక్కొట్టిన యష్, వేదకి క్షమాపణ చెప్పనన్న యష్-తగ్గేదెలే అంటున్న వేద
జానకి రామ ఎదురుగా కూర్చుని ముద్దు కావాలని ఆటపట్టిస్తుంది. జానకి పుస్తకాలు పట్టుకుని చదువుకోవడం మల్లిక చూస్తూ ఉండగా అటు జ్ఞానంబ వచ్చి తిడుతుంది. ఇక వంట గదిలోకి తీసుకెళ్ళి ఈరోజు ఇంట్లో వాళ్ళందరికీ నువ్వే వంట చెయ్యాలని పురమాయిస్తుంది. జానకిని ఇరికిద్దామనుకుంటే నేను ఇరుక్కున్నాను దీన్నే స్వర్గానికి పోయిన అత్త పోరు తప్పలేదని అంటారు అని మల్లిక ఏడుస్తుంది. రామా, జానకి కలిసి బయటకి వెళ్లేందుకు రెడీ అవడం మల్లిక చూస్తుంది. ఇక జానకి వాళ్ళు బయటకి వచ్చేసరికి హల్లో జ్ఞానంబ దంపతులు కూర్చుని ఉంటారు. బయటకి వెళ్లబోతుంటే రామా ఎక్కడికి వెళ్తున్నారని జ్ఞానంబ అడుగుతుంది.
Also Read: ఎట్టకేలకు రిషికి 'ఐ లవ్ యూ' చెప్పేసిన వసుధార, సాక్షిని ఆడేసుకున్న గౌతమ్