Janaki Kalganaledu July 12th Update: రామా, జానకికి తొలిరేయి ఏర్పాట్లు- వాళ్ళిద్దరినీ దగ్గర చేయాలని జ్ఞానంబ చేసిన ప్రయత్నం ఫలిస్తుందా?
రామా జానకిలను దగ్గర చేయాలని జ్ఞానంబ దంపతులు ప్రయత్నిస్తారు. వాళ్ళ మధ్య అన్యోన్యత పెరిగేందుకు తొలిరేయి ఏర్పాట్లు చేస్తారు. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
ఏరువాక పండగ సంబరంలో జ్ఞానంబ కుటుంబం అంతా ఆటలు, డాన్స్, పాటల పోటీలు పెట్టుకుని సంతోషంగా గడుపుతారు. ఇక మల్లిక, విష్ణు డాన్స్ వేస్తారు. ఆ తర్వాత జానకి, రామా తమ డాన్స్ తో అదరగొట్టేస్తారు. కాసేపు ఇద్దరి మధ్య రొమాన్స్ నడుస్తుంది. వాళ్ళని మరింత దగ్గర చేసేందుకు గోవిందరాజులు జ్ఞానంబకి ఒక ప్లాన్ చెప్తాడు. అందుకు జ్ఞానం సరే అని అంటుంది. తెలిసిన వాళ్ళతో మాట్లాడాల్సిన పని ఉంది నాన్న, నేను వెళ్ళి మాట్లాడేసి వస్తాం మీరందరూ సాయత్రం వరకు ఇక్కడే గడిపి ఇంటికి వెళ్ళమని జ్ఞానంబ చెప్తుంది. ఇక జ్ఞానంబ దంపతులు ఇంటికి వెళ్ళి రామా వాళ్ళ గదిని పూలతో చక్కగా అలంకరిస్తారు. వారసుల కోసం నువ్వెంత ఆరాటపడుతున్నావో నాకు తెలుసు నీ కోరిక తప్పకుండా నెరవేరుతుందని గోవిందరాజులు అంటాడు. త్వరలోనే మన చేతిలో మనవడో, మనవరాలో వస్తారు అప్పుడు నీ కలలన్నీ నిజమైపోతాయని చెప్తాడు.
Also Read: తులసి జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నాడా? తులసి బోనం ఎత్తకుండా లాస్య స్కెచ్
ఇక అందరూ ఇంటికి వస్తారు. ఆట, పాటలతో బాగా ఎంజాయ్ చేశాం రోజు ఇలాగే ఉంటే బాగుండు అని మల్లిక అంటుంది. ఈరోజు గుడిలో నిద్ర చేస్తే మంచిదని పూజారిగారు చెప్పారు రామా, జానకి, మల్లిక, విష్ణు తప్ప మిగతా వారంతా గుడికి వెళ్లాలని జ్ఞానంబ చెప్తుంది. అదేంటి అన్నయ్య వాళ్ళు ఎందుకు వద్దు అని అఖిల్ అడుగుతాడు. గుడిలో నిద్ర చేయాల్సింది పెళ్లి కాని వాళ్ళని అంటుంది. ఇక జానకి కూడా మేము వస్తామని అంటే కుదరదు మీరిద్దరు ఇంట్లో ఉండి దీపం పెట్టాలని చెప్తుంది. దీంతో అందరూ సరే అని గుడికి బయల్దేరతారు. జ్ఞానంబ జానకిని పక్కకి తీసుకెళ్తుంది. అది చూసి మల్లిక ఏం జరుగుతుందా అని టెన్షన్ పడుతుంది. నువ్వు చెప్పకపోయిన మీరిద్దరి మధ్య దూరం ఉందని మేము గ్రహించాం, అందుకే మీ ఇద్దరికీ ఏకాంతం కల్పించేందుకు మేమంతా గుడికి వెళ్తున్నామని జానకికి చెప్పి జ్ఞానంబ వాళ్ళు వెళ్లిపోతారు. అమ్మ మీకేం చెప్పారని రామా జానకిని అడుగుతాడు.
Also Read: తనవారితో కలసిపోయిన శౌర్య- పూర్తిగా మోనితలా మారిపోయిన శోభ - కార్తీకదీపం కథ ఇక సుఖాంతమేనా !
రామా, జానకి గదిలోకి వస్తారు. మంచం అంతా పూలతో అలంకరించి అందంగా ఉంటుంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారని రామా అడుగుతాడు. అత్తయ్యగారికి మన మధ్య దూరం ఉందనే విషయం తెలిసింది అందుకే ఈ ఏర్పాట్లు చేశారని జానకి చెప్తుంది. దూరంగా ఉంటున్నామని మీరేమైన అమ్మతో చెప్పారా అని అడుగుతాడు. ఇలాంటి విషయం నేను ఎలా చెప్తానని జానకి అంటుంది. ఇప్పుడు మనం ఆలోచిస్తుంది ఎలా తెలిసింది అనేది కాదు వాళ్ళ మనసుని అర్థం చేసుకోవాలి , వాళ్ళ ఇష్టాలని గౌరవించాలి అంతే కాని వాళ్ళని బాధపెట్టడం ధర్మం కాదని జానకి చెప్తుంది. ఈ అలంకరణ చూస్తుంటే మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టు ఉంది కదా అని అంటుంది. జానకి గారు అమ్మకంటే మీ ఐపీఎస్ లక్ష్యం తెలియదు కానీ మేరు కూడా ఏంటండీ ఇలాగా అని రామా అడుగుతాడు. మీరు ఐపీఎస్ అవగానే భర్తగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను అని రామా చెప్తాడు.