Janaki Kalaganaledu October 11th: జెస్సి కోసం కుంకుమ పువ్వు తెచ్చిన జ్ఞానంబ- మల్లిక కుట్ర తెలుసుకున్న జానకి
మల్లిక అఖిల్ బుర్రలో జెస్సి గురించి విషం నిపుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జెస్సి నీ కోరిక త్వరలోనే తీరబోతుంది. అత్తయ్యగారు నవరాత్రుల్లో సాధారణంగా బయటకి వెళ్లరు కానీ తనే స్వయంగా బయటకి వెళ్ళి మీ కోసం ప్రత్యేకంగా కుంకుమ పువ్వు కొనుక్కొని వచ్చారని జానకి చెప్తుంది. నిన్ను దోషిలా చూస్తే అలా చేయరు కదా, రోజు లాగా కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగమని జెస్సికి చెప్తుంది. ఆ మాటకి జెస్సి చాలా సంతోషిస్తుంది. కొత్త దారిలో ఇంట్లో ఇబ్బందులు సృష్టించేందుకు ప్లాన్ వేసినట్టు మల్లిక నీలావతికి ఫోన్లో చెప్తుంది. అప్పుడే జానకి పాలు తీసుకుని మల్లిక గదికి వస్తుంది. నువ్వు ఇలా చేయడం ఏమి బాగోలేదు మల్లిక అని జానకి అనేసరికి టెన్షన్ పడుతుంది. కడుపుతో ఉన్న వాళ్ళు ఫోన్ మాట్లాడకూడదని జానకి చెప్తుంది. కుంకుమ పువ్వు కలిపిన పాలు అత్తయ్యగారు నీకు ఇవ్వమని చెప్పారు తాగు అని ఇస్తుంది.
నువ్వు చేసే పనులన్నీ నాకు తెలుసు, ఇంతక ముందు నువ్వు ఫోన్లో మాట్లాడింది నేను విన్నాను. జెస్సిని ఇరికించాలని నువ్వు చేసిన ప్రయత్నం కూడా చూశాను. జెస్సి వాళ్ళ అమ్మానాన్నకి లేనిపోనివి చెప్పింది నువ్వే అని నాకు తెలుసు. నిన్ను పద్ధతి మార్చుకోమని చెప్పాను. ఇంటి కోడలిగా మంచి చేసి ఆనందం నింపాలి. ఇంకోసారి ఇలా చేస్తే అసలు ఊరుకొను అని జానకి మల్లికని హెచ్చరిస్తుంది. జెస్సి సంతోషంగా పాలు తీసుకుని రావడం చూసి అఖిల్ ఏంటి సంగతి అని అడుగుతాడు. అత్తయ్యగారు నాకోసం కుంకుమ పువ్వు తీసుకొచ్చారని చెప్తుంది. అఖిల్ మల్లిక మాటలు గుర్తు చేసుకుని జెస్సి మీద సీరియస్ అవుతాడు.
Also read: పోటాపోటీగా దాండియా ఆడిన సామ్రాట్, తులసి- అవమానించిన అమ్మలక్కలు, ఆగ్రహంతో ఊగిపోయిన అనసూయ
మీ అత్తయ్య దగ్గర నన్ను చెడ్డవాడిని చేసి నువ్వు మాత్రం బాగా దగ్గరవుతున్నావ్ అని అంటాడు. అత్తయ్యగారు నీతో మళ్ళీ మామూలుగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నా అనేసరికి ఆపు నీ నాటకాలు అని అఖిల్ అరుస్తాడు. మా అమ్మ దగ్గర నువ్వు వేసే వేషాలు నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు దగ్గర అవడం కోసం నన్ను చెడు చేస్తున్నావ్, పిచ్చిప ఇచ్చి వేషాలు వేయకు అని పాల గ్లాసు విసిరి కొడతాడు. అది పగిలిన సౌండ్ విని జానకి వాళ్ళని చూస్తుంది. అఖిల్ చేసిన పనికి జెస్సి కుమిలిపోతుంటే జానకి వచ్చి ఓదారుస్తుంది. నేను అత్తయ్యగారి ముందు అఖిల్ ని ఎందుకు చెడ్డవాడిని చేస్తానక్క అని జెస్సి ఏడుస్తుంది.
రామా తన తల్లి జానకికి బాధ్యతలు ఇవ్వడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అది గమనించిన జానకి పుస్తకాలు తీసుకుని అమ్మో చదువుకోవాలి అని కూర్చుంటుంది. రామా వచ్చి జానకి పుస్తకాలు మూసేస్తాడు. నేను ఏవి చెప్పిన నా ఆరాటం మీకు అర్థం కావడం లేదు, చదువుని పట్టించుకోవడం లేదు, బాగా చదువుకుంటారు అనుకుంటే జెస్సికి పద్ధతులు నేర్పిస్తూ పాలు ఇస్తూ ఇప్పటి దాకా ఉన్నారని కోప్పడతాడు. అత్తయ్యగారు అఖిల్ తో మాట్లాడటం లేదని ఆ కోపం జెస్సి మీద చూపిస్తున్నాడు, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి, అఖిల్ ని ప్రయోజకుడిని చేయాలి అని జానకి అంటుంది. వాళ్ళని అత్తయ్యగారికి దగ్గర చేయాల్సిన బాధ్యత మనదే కదా అని అంటుంది. కాదని నేను అనను అలా అని పరీక్షలు పక్కన పెట్టి కాదు కదా ముందు మీరు మీ ఆశయం మీద దృష్టి పెట్టమని రామా చెప్తాడు.
Also Read: మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన భాగ్యమ్మ- ఆదిత్య, సత్య మధ్య రుక్మిణి ఉందని దేవుడమ్మకి తెలిసిపోతుందా?