Gruhalakshmi October 11th: పోటాపోటీగా దాండియా ఆడిన సామ్రాట్, తులసి- అవమానించిన అమ్మలక్కలు, ఆగ్రహంతో ఊగిపోయిన అనసూయ
గృహలక్ష్మి సీరియల్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
కాలనీలో దసరా వేడుకలు సరాదగా జరుగుతూ ఉంటాయి. ఆటలో ప్రేమ, శ్రుతి పేర్లు పిలుస్తారు. ఇటు సామ్రాట్ టెన్షన్ గా వస్తూ ఉంటాడు. ప్రేమ్ కి మనసంతా నువ్వే అని సినిమా పేరు వస్తుంది. అది సైగ చేసి చూపిస్తే శ్రుతి కనిపెట్టేస్తుంది. నేను ఏం చేశానో చిన్న సైగతో అర్థం చేసుకున్నావ్ మరి నా మనసు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావ్ అని ప్రేమ్ మనసులోనే బాధపడతాడు. చిన్న మాటని కూడా సైగతో చెప్పగలిగే నువ్వు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఎందుకు ప్రేమ నటిస్తున్నావ్ అని శ్రుతి అనుకుంటుంది. కాసేపు ఇద్దరూ మనసులతోనే మాట్లాడుకుంటారు.
మరో గేమ్ ఆడిస్తారు. అందులో ప్రేమ, శ్రుతి, నందు, లాస్య ఆడతారు. కానీ ఒడిపోతారు. తర్వాత అభి, అంకితల వంతు వస్తుంది. ఆ ఆటలో అభి, అంకిత గెలుస్తారు. ఈ ఆటే నీ జీవితం అనుకో అంకిత చెప్పినట్టు నడుచుకుంటే జీవితంలో గెలుస్తావ్ అని తులసి మొదలుపెట్టేస్తుంది. అప్పుడే సామ్రాట్ అక్కడికి వస్తాడు. తులసి వెళ్ళి పలకరించబోతుంటే అనసూయ ఆపి ఇది మన ఇల్లు కాదు కాలనీ నీ హద్దులో నువ్వు ఉండు అని అంటుంది. సామ్రాట్ తులసి మీద అరుస్తాడు. మీ పద్ధతి ఏమి నచ్చలేదు హనీ అంటే నాకు ఎంత ఇష్టమో తెలిసి కూడా తనని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారా? తను కడుపులో నొప్పితో బాధపడుతుంటే చూస్తూ ఉంటారా అని మాటలు అనేస్తాడు. మీ అందరికీ ఫోన్స్ చేస్తూనే ఉన్నా ఒక్కరూ కూడా రెస్పాండ్ అవ్వలేదని సామ్రాట్ అరుస్తాడు.
Also Read: మాధవ్ కి వార్నింగ్ ఇచ్చిన భాగ్యమ్మ- ఆదిత్య, సత్య మధ్య రుక్మిణి ఉందని దేవుడమ్మకి తెలిసిపోతుందా?
హనీకి కడుపులో నొప్పి అని నాకు తెలియదని తులసి అంటుంది. హనీ నాకు కడుపులో నొప్పి అని అబద్ధం చెప్పాను, మనం అందరం పండగ సెలెబ్రేట్ చేసుకుంటున్నాం బాధగా అనిపించిందని చెప్తుంది. హనీ ఎంత చెప్పినా సామ్రాట్ మాత్రం అరుస్తాడు. ఎలాగూ ఇక్కడ దాకా వచ్చావు మాతో కలిసి కాసేపు ఎంజాయ్ చెయ్యమని తులసి ఫ్యామిలీ అందరూ సామ్రాట్ ని బతిమలాడతారు. సామ్రాట్ మాత్రం రావడానికి ఇబ్బంది పడుతుంటే హనీ బలవంతంగా తీసుకొచ్చేస్తుంది. అగ్గి రాజుకుంది నా ప్లాన్ లో ఆఖరి గట్టం మొదలవుతుందని లాస్య అనుకుంటుంది. ఇప్పుడు ఆటలో భాగంగా దాండియా మొదలు పెడతారు. అందరూ సంతోషంగా దాండియా ఆడుతూ ఉంటారు. అభి, అంకిత , దివ్య, ప్రేమ్, శ్రుతి ఇలా ఒక్కొక్కరు ఆడలేక పక్కకి వెళ్లిపోతూ ఉంటారు. చివరికి తులసి సామ్రాట్ మిగులుతారు.
ఇక సామ్రాట్, తులసి సంతోషంగా పోటాపోటీగా ఆడుతూ, మాట్లాడుకుంటూ ఉంటారు. చివరికి సామ్రాట్ ఆపేసి తులసికి కంగ్రాట్స్ చెప్తాడు. అద్భుతంగా ఆడారు అని యాంకర్ మెచ్చుకుంటుంది. అది చూసి అనసూయ కోపంగా ఉంటుంది. గెలిచిన సామ్రాట్, తులసికి కాలనీ ప్రెసిడెంట్ బహుమతి ఇస్తుంది. జీవితంలో ప్రతి దాన్లో ఓడిపోవడం తప్ప గెలుపు తెలియదు నాకు సామ్రాట్ గారు గెలుపు రుచి చూపించారు అని తులసి సామ్రాట్ కి థాంక్స్ చెప్తుంది. అదంతా చూస్తూ నందు చిరాకు పడతాడు. తులసిని అమ్మ వారికి హారతి ఇవ్వమని యాంకర్ చెప్తుంది. అనసూయని రమ్మని తులసి పిలిస్తే నేను రాను నువ్వు వెళ్ళు అని కోపంగా చెప్తుంది. తులసి వెళ్లబోతుంటే ఒకామె ఆగమని అంటుంది. ఆడది అంటే అణుకువగా ఉండాలి కట్టుబాట్లు వదిలి ఊరి మీద తిరగడం కాదు అని అక్కడ ఉన్న అమ్మలక్కలు తులసిని అవమానిస్తారు.
Also Read: కాంచనని నిలదీసిన వేద, బయటపడ్డ నిజం- సులోచనకి హారతి ఇచ్చి స్వాగతం చెప్పిన మలబార్ మాలిని