Janaki Kalaganaledu March 31st: చంటిపిల్లల ఫోటో చూసి మురిసిన జానకి- ప్రెగ్నెన్సీ గురించి మల్లికని అడిగిన జ్ఞానంబ
రామ, జానకి ఒక్కటి కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
మల్లిక పూలు తెచ్చి తన తలలో పెట్టమని విష్ణుని అడుగుతుంది. పెట్టడం సరిగా రాక మల్లిక తల పొడుస్తూ ఉంటుంటే మిఠాయి పోట్లాలు కట్టుకునే మీ అన్నయ్య నయం పెళ్ళాం తలలో చక్కగా పూలు పెట్టాడని తిడుతుంది. ఇక చేసేది లేక తనే పూలు పెట్టుకుని వార్నింగ్ ఇస్తుంది. జ్ఞానంబ ఇంట్లో ఉగాది సందర్భంగా పూజ చేస్తుంది. మన పండుగలన్నీ ఒక ఎత్తైతే ఉగాది పండుగ ఒక ఎత్తని పండుగ విశిష్టత గురించి చెప్తుంది. ఉగాది పచ్చడి లో షడ్రుచులు ఎలా కలిసి ఉంటాయో జీవితంలో కూడా కష్టసుఖాలు ఉంటాయని అంటుంది. గోవిందరాజులు అందరికీ శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలు చెప్తాడు. ఆట పాటలతో అందరూ సంతోషంగా గడుపుతారు. ఒక్కొక్క కాగితంలో ఉగాది పచ్చడిలో ఉన్న రుచులు ఒక్కొక్కటి రాసి ఉన్నాయి. ఎవరి మనస్తత్వం ఎలా ఉందో వాళ్ళకి తగిన చీటీ దేవుడు వచ్చేలా చేస్తాడని చెప్తాడు.
Also Read: ఒక్కటైన దివ్య, విక్రమ్- కూతురి ప్రేమ విషయం తులసి ముందు బయటపెట్టేసిన లాస్య
తనకి తీపి అనే చీటీ వస్తే అందరినీ ఒక ఆట ఆడిస్తానని మల్లిక మనసులో అనుకుంటుంది. మొదటి చీటీ రామ తీస్తాడు. అందులో ఉప్పు రాసి ఉంటుంది. ఎంత కరెక్ట్ కాగితం వచ్చిందో ఏ పదార్థం అయినా ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగే ఈ ఇంట్లో రామ లేకపోతే వాడి చెయ్యి వేయకపోతే పని జరగదని గోవిందరాజులు మెచ్చుకుంటాడు. తర్వాత విష్ణు తీయగా వగరు వస్తుంది. నీకు భలే కరెక్ట్ గా వచ్చిందని అంటాడు. నీ గురించి నువ్వు ఆలోచించుకునే వరకు నీ జీవితం వగరుగా ఉంటుంది భరించాలి తప్పదని సెటైర్ వేస్తాడు. అఖిల్ చీటీ తీస్తే కారం వస్తుంది. అందరూ అది విని నవ్వుతారు. ఉప్పుతో కలిసి ఉంటే కాస్త కారం తగ్గిద్దని తండ్రి పంచ్ వేస్తాడు. ఇక జెస్సికి పులుపు రాగానే ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని నిన్ను నువ్వు ఇబ్బంది పెట్టుకుంటావ్ పులుపు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని అంటాడు.
ఇక చేదు, తీపి మిగిలిపోతాయి. మల్లిక ఏ చీటీ తీయాలో అర్థం కాక టెన్షన్ పడుతుంది. చీటీ తీసి దేవుడికి దణ్ణం పెట్టేసి ఓపెన్ చేసి చూస్తే అందులో చేదు ఉంటుంది. అందుకేనా నా కోడలు మొహం చేదుగా పెట్టిందని కౌంటర్ వేస్తాడు. ఇక మిగిలింది తీపి నీ మనసులాగే తీపి వచ్చిందని అనేసరికి జానకి నవ్వుతుంది. ఇక ఇంతటితో ఆట ఆపేద్దామని జ్ఞానంబ అంటుంది. ఏ ఒక్క రుచి లేకపోయినా ఈ ఉమ్మడి కుటుంబం సంపూర్ణం కాదని ఈ అదృష్టాన్ని దూరం చేసుకోవద్దని గోవిందరాజులు చివర్లో మంచి మాట చెప్తాడు. జ్ఞానంబ మళ్ళీ పిల్లల గురించి జానకిని అడుగుతుంది. ఏ వయసులో జరగాల్సిన ముచ్చటి ఆ వయసులో జరగాలి. నీ మనసులో లక్ష్యం చేదిరిపోకుండా ఉండాలంటే పెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా అని పిల్లలు ఉన్న పోస్టర్ జానకికి ఇస్తుంది. నీకు విషయం ఏంటో అర్థం అయ్యింది కదా అనేసరికి జానకి సిగ్గుపడుతుంది. అదంతా చూసి మల్లిక ఎటూ కాకుండా పోతుంది నెనే అని బుంగమూతి పెట్టుకుంటుంది.
Also Read: కనకాన్ని కలిసేందుకు గుడికి వెళ్తున్న స్వప్న- అపర్ణ మీద విరుచుకుపడిన ఇంద్రాదేవి
మల్లికని చూసిన జ్ఞానంబ రమ్మని పిలుస్తుంది. జానకి హక్కులు నీకు ఉన్నాయి. నా దృష్టిలో కోడళ్ళు అందరూ సమానమే చాటుగా వినాల్సిన అవసరం లేదని చెప్తుంది. తల్లి అవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని దూరం చేసుకున్నావ్ ఎందుకైనా మంచిది రేపు నిన్ను డాక్టర్ దగ్గరకి తీసుకెళ్ళి టెస్ట్ లు చేయిస్తాను. లోపం ఏమైనా ఉంటే బయట పడుతుందని అంటుంది. లోపం కాదు తన మోసం బయట పడుతుందని అనుకుని టైమ్ కలిసి రావాలి త్వరలోనే మీరు శుభవార్త వింటారని మల్లిక చెప్తుంది.