By: ABP Desam | Updated at : 28 Mar 2023 10:14 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
పెళ్లి కావడం లేదని ఊరేసుకుబోతున్నాడని మల్లిక హడావుడి చేస్తుంది. ఇక ఆపండి నేను అరటి గెల కట్టబోతుంటే మీరు నన్ను చంపెంత పని చేశారని మలయాళం తిడతాడు. రామ అసలు విషయం ఏంటో చెప్పమని జానకిని అడుగుతాడు. అప్పుడే భర్తని శోభనం గదిలోకి తీసుకెళ్తుంది. ఏదో ఆలోచిస్తూ పొరపాటున వేరే వాళ్ళ గదిలోకి వచ్చేశామని రామ అమాయకంగా అంటాడు. శోభనం కోసం భలే అందంగా అలంకరించారు కదా మీలాగే మంచి అభిరుచి ఉంది, ఎవరో కానీ మంచి అదృష్టవంతులని రామ అంటాడు. ఇది మన కోసమేనని చెప్తుంది. ఇది కల కాదు కదా అంటే జానకి గట్టిగా గిల్లుతుంది. అవును ఇది నిజమే మీ కళ్ళలో ప్రేమ నిజం. కానీ ఎందుకు ఇప్పుడు ఇలా. మీ లక్ష్యాన్ని మీరు మర్చిపోయారా అని అడుగుతాడు.
Also Read: కొత్తకోడలిని ఇంట్లోకి రానివ్వకుండా చేసిన రాజ్యలక్ష్మి- దివ్య డాక్టర్ జాబ్ పోతుందా?
రామ- జానకి: మీరు ఐపీఎస్ అయిన తర్వాతే కదా పూల మంచం అనుకున్నామని రామ అంటాడు. మన ఇద్దరి మధ్య ప్రేమ ఉంది కానీ అందులో జీవం కనిపించడం లేదు కలిసి ఉంటున్నాం కానీ ఆనందం కనిపించడం లేదు. నా లక్ష్యం కోసం మీరు మీ ఇష్టాన్ని వదులుకుంటున్నారు. నేను నా ఆడమనసు నోరు నొక్కేసుకున్నా. నేను మారాలి అనుకున్న, మన బిడ్డని మీ చేతిలో పెట్టాలని అనుకున్నా, రామ కళ్ళలో ఆనందం చూడాలని అనుకుంటున్నానని చెప్తుంది. ఎవరి గురించి దేని గురించి ఆలోచించొద్దు కొద్ది సేపు మన గురించి మనం ఆలోచించుకుందామని అంటుంది. పాల గ్లాసు తెచ్చి భర్త చేతికి అందిస్తుంది. రామ తెగ సిగ్గుపడిపోతూ దాన్ని అందుకుంటాడు. ఎన్నో రాత్రులొస్తాయి.. అంటూ సాంగ్ వేసి రొమాంటిక్ ఫీలింగ్ తెప్పించేశారు. శోభనం అయిపాయే. జానకి లేచి అద్దంలో తన మొహం చూసుకుని బొట్టు లేదని అనుకుంటుంది. అది రామ మొహానికి అంటుకుంటే తీసుకుని పెట్టుకుంటుంది.
ఒక నిజం నాకు తెలిసి అర్థం చేసుకోవడానికి ఇంత కాలం పట్టింది. అత్తయ్య పుణ్యమానని కళ్ళు తెరిచానని మనసులో అనుకుంటుంది. ఇప్పుడే మన జీవితం తెల్లారిందని అనుకుంటాడు. ఇక్కడే ఉందామని అంటాడు కానీ వాళ్ళు బయటకి గెంటేస్తారని బలవంతంగా లేపి రెడీ అవమని చెప్తుంది. వెన్నెల తనకి ఇంకా చదువుకోవాలని అనిపిస్తుందని అంటుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది అలా అయితే పెళ్లి, పిల్లలని గోల ఉంటుందని వెన్నెల అంటుంది. చదువుకుని ఏం ఉద్ధరించాలని మల్లిక దెప్పి పొడుస్తుంది. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి ఉంటాయి. నువ్వు చదువుకోలేదని ఆడపిల్లలకి చదువు వృథా అంటే ఎలా అని జ్ఞానంబ గడ్డి పెడుతుంది. ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని వెన్నెల చెప్తుంది. మంచి సంబంధం దొరికితే చదువు కంటే పెళ్లికే విలువ ఇవ్వాలని చెప్తుంది. అప్పుడే రామ, జానకి ఇంటికి వస్తారు.
Also Read: కావ్యని బంధించిన అపర్ణ- తప్పతాగి కళావతి గదిలో దూరిన రాజ్
జానకి అత్తను చూసి సిగ్గుపడుతూ ఉంటుంది. సిగ్గుతోనే శోభనం అయిపోయిందని చెప్తుంది. జానకి ఏంటి కొత్తగా కనిపిస్తుందని మల్లిక అనుకుంటుంది. ఏదో జరుగుతుంది తెలియడం లేదని వెళ్ళి ఆత్రంగా జానకి ఎందుకు సిగ్గు పడుతుందని జ్ఞానంబని అడుగేస్తుంది. లేకపోతే నీలాగా సిగ్గు లేకుండా ఉంటారా అని తిడుతుంది.
మహేష్ కోసం థమన్ కాపీ ట్యూన్ ఇచ్చాడా? 'గుంటూరు కారం' బీట్‌ను అక్కడి నుంచి లేపేశాడా?
ఎన్టీఆర్ మాస్టర్ ప్లాన్ - రెండు సినిమాల షూటింగ్స్ ఒకేసారి!
షూటింగ్ పూర్తి చేసుకున్న 'జైలర్' - రిలీజ్ ఎప్పుడంటే!
విజయ్ దేవరకొండపై సమంత ఎమోషనల్ కామెంట్స్ - రౌడీబాయ్ లవ్లీ రిప్లై
జోరుమీదున్న నిఖిల్ - ‘స్వయంభూ’ ఫస్ట్ లుక్ అదుర్స్
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !