Gruhalakshmi March 28th: కొత్తకోడలిని ఇంట్లోకి రానివ్వకుండా చేసిన రాజ్యలక్ష్మి- దివ్య డాక్టర్ జాబ్ పోతుందా?
ప్రియతో సంజయ్ పెళ్లి జరగడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
వానపాము అనుకున్నా నాగుపాములా మారుతుందని అనుకోలేదు. దివ్య కొట్టిన దెబ్బ మామూలు దెబ్బ కాదు మన పరువు బజారున పెట్టింది, నా కొడుకు జీవితం మీద కోలుకోలేని దెబ్బ కొట్టిందని రాజ్యలక్ష్మి మండిపడుతుంది. ఏదో ఒకటి చేసి దివ్యని వదిలించుకోవాలని బసవయ్య సలహా ఇస్తాడు. ఇప్పటి వరకు హాస్పిటల్ విషయాల్లోనే జోక్యం చేసుకుంది, ఇప్పుడు పర్సనల్ విషయాల్లోకి వచ్చింది. ఎక్కడైతే అది హీరోలా వెలిగిపోతుందో అక్కడే దాన్ని విలన్ చేసి తలవంచుకుని బతికేలా చేయాలని రాజ్యలక్ష్మి పగ పడుతుంది. హాస్పిటల్ లో వాళ్ళందరూ దివ్యకి కంగ్రాట్స్ చెప్తారు. ఆడపిల్లకి హెల్ప్ చేశాను అంతే కదా అని దివ్య అంటుంది. వాళ్ళని ఎదిరించి భయపడకుండా ఉన్నారని అంటే ఏం చేస్తారు కావాలంటే జాబ్ లో నుంచి తీసేస్తారు అంతే కదా బయటకి వెళ్తే కళ్ళకద్దుకుని తీసుకుంటారని కాన్ఫిడెంట్ గా చెప్తుంది.
Also Read: కావ్యని బంధించిన అపర్ణ- తప్పతాగి కళావతి గదిలో దూరిన రాజ్
దివ్య హీరో అయిపోయింది కానీ విక్రమ్ బాబుని దూరం చేసుకుందని దేవుడు అనుకుంటాడు. అప్పుడే విక్రమ్ ఫోన్ చేసి అసలు ఏం జరుగుతుందని అడిగితే దేవుడు తిక్కతిక్కగా మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. ఈ పెద్ద మనిషి ఎక్కడికి వెళ్ళిపోయాడని అనుకుంటూ ఉండగా దేవుడి వచ్చి విక్రమ్ బొకే పంపాడని ఇస్తాడు. నందు తులసి జట్టుగా, పరంధామయ్య, లాస్య జట్టుగా చేరి క్యారమ్స్ ఆడుతూ ఉంటారు. అప్పుడే లాస్యకి భాగ్య ఫోన్ చేస్తుంది. దీంతో ఆట మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది. తనకి తెలియకుండానే బాయ్ ఫ్రెండ్ ఇంట్లో చిచ్చు పెట్టిందని చెప్పి దివ్య హాస్పిటల్ దగ్గర చేసిన ధర్నా గురించి భాగ్య ఉప్పందిస్తుంది. సంజయ్ చేసేది లేక ప్రియని తీసుకుని ఇంటికి వస్తుంటే రాజ్యలక్ష్మి గుమ్మం దగ్గర ఆపేస్తుంది. సంజయ్ ప్రియ చేయి పట్టుకుని ఉండటం చూసి రగిలిపోతుంటే వెంటనే చేయి వదిలేస్తాడు.
సవతి కొడుకు కోసం ఒక పనికిమాలిన కోడలిని చూడమంటే దేవుడు ఏకంగా నా కొడుకు సంజయ్ ఏకంగా అలాంటి భార్యని అంటగట్టి పంపించాడని మనసులో అనుకుంటుంది. పెళ్లి అంటే ముహూర్తం చూసి చేయాలి. అందుకే పంతుల్ని పిలిపించాను. ఈ ఇంటి కోడలు అడుగుపెట్టడానికి మంచి ముహూర్తం చూడమంటే అసలు బాగోలేదని చెప్తాడు. కొత్త కోడలు జాతకంలో దోషం ఉంది అది పోవాలంటే శాంతి జరపాలి. అమ్మాయి ప్రతిరోజు 101 బిందెలు నీళ్ళతో వందరోజుల పాటు అమ్మవారికి అభిషేకం చేయాలి. 10వ రోజు ఉపవాసం ఉండి జాగారం చేస్తే దోషం పోతుంది. ఆ మరునాడు కుడి కాలు లోపల పెట్టి గృహప్రవేశం చేయవచ్చని చెప్తాడు. ఇలాంటి శాస్త్రం ఎక్కడా చూడలేదని విక్రమ్ తాతయ్య అంటాడు. ఈ ఇంటి కోడలిగా మంచి జరుగుతుందని అంటే ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రియ చెప్తుంది. దివ్య నిన్ను బలవంతంగా మా నెత్తి మీద రుద్దింది కానీ నిన్ను ఎప్పటికీ ఈ ఇంటి కోడలివి కాలేవని మనసులో అనుకుంటుంది.
Also Read: పెళ్లిరోజు యష్, వేద క్యూట్ రొమాన్స్- చిత్రకి ఐలవ్యూ చెప్పిన అభిమన్యు
మా వాడు చేసిన పని మర్చిపోయి ఇంటి కోడలిగా ఆలోచించి అత్త మనసు అర్థం చేసుకున్నావని మాట్లాడుతూ మంచిదానిలా నటిస్తుంది. కొత్త కోడలిని అవుట్ హౌస్ లో ఉంటుందంటే ఏమి మాట్లాడవు ఏంటని అంటే దోషం పోతుంది కదా అంటాడు. ప్రియని దేవుడికిచ్చి అవుట్ హౌస్ కి పంపించేస్తుంది. ప్రియ వైపు వెళ్లొద్దని రాజ్యలక్ష్మి సంజయ్ కి వార్నింగ్ ఇస్తుంది. నందుకి పెళ్లి కార్డు వచ్చిందని తులసి చెప్తుంది. చూడవచ్చు కదా అంటే పరాయి వాళ్ళవి నేను చూడనని చెప్తుంది.