By: ABP Desam | Updated at : 15 Mar 2023 09:47 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
జానకి ఫోటో పేపర్ లో పడటం చూసి ఎస్సై మనోహర్ రగిలిపోతూ ఉంటాడు. పేపర్ లో తన ఫోటో చూసుకుని సంతోషపడుతుంది. కానీ ఇదంతా రామ ఇదంతా చేయించాడని, ఎస్సై కి రావాల్సిన పేరు నీకు వచ్చింది ఇదంతా నీ కుట్ర అని నోటికొచ్చినట్టు తిడతాడు. చదువులేని మొగుడిని కంట్రోల్ చేసినట్టు నన్ను కంట్రోల్ చేయాలని చూడకు ఇక్కడ ఉంది నీ మిఠాయి కొట్టు మొగుడు కాదు మిరపకాయ ఎస్సై మనోహర్. నాకులా ఎస్సై కావాలంటే పాతికేళ్లు పడుతుంది. ఎక్కువ చేస్తే ప్రశంసా పత్రం కాదు సస్పెన్షన్ లెటర్ వచ్చేలా చేస్తాను. ఆ న్యూస్ పేపర్ కాల్చేయమని చెప్తాడు. దీంతో జానకి బాధగా పేపర్ ని కాల్చేస్తుంది. ఇంట్లో సౌభాగ్య వ్రతం చేసుకుంటున్నారు, త్వరగా వస్తానని అత్తయ్యకి మాట ఇచ్చాను త్వరగా వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వమని ఎస్సైని అడుగుతుంది. ఈవినింగ్ కదా చూద్దాంలేనని అంటాడు.
Also Read: కావ్యకి బలవంతంగా అన్నం తినిపించిన రాజ్- దుగ్గిరాల ఇంట్లో నిప్పు రాజేసి సంబరపడుతున్న రుద్రాణి
పేపర్లో పడిన జానకి ఫోటోని కట్ చేసి బండికి తగిలించుకుని సంతోషపడతాడు. అటుగా వెళ్తుంటే రామ బండి కనిపించి మనోహర్ వెహికల్ ఆపుతాడు. ఫోటో అక్కడ వేలాడదీసి ఊర్లో జనాలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నాడని మాట్లాడతాడు. పైకి అమాయకంగా కనిపిస్తాడు కానీ మిఠాయి పొట్లం గాడు చాలా తెలివిగలవాడని అనేసరికి మా ఆయన పేరు రామ అని జానకి చెప్తుంది. వెళ్ళి స్వీట్స్ పట్టుకుని రమ్మని రామ దగ్గరకి పంపిస్తాడు. జానకిని చూసి ఏంటి ఇలా వచ్చారని అడుగుతాడు. ఎస్సై కూడా వచ్చాడని చెప్పడంతో రామ మనోహర్ ని పిలుస్తాడు. మీ ఆవిడకి బాగా పబ్లిసిటీ ఇస్తున్నావని అంటాడు. మీ వల్లే ఇంత గౌరవం లభించిందని రామ మనోహర్ ని పొగుడుతాడు. మీ ఆవిడకి నువ్వు అంటే పిచ్చి ప్రేమ అనేసరికి అవును నాకు కూడా జానకి అంటే ప్రాణమని చెప్తాడు. నీ ముందే నీ భార్యని ఎలా ఏడిపిస్తానో చూడు అని కావాలని తూలి పడబోతాడు.
Also Read: షాకింగ్ ట్విస్ట్, యష్ వేదని విడదీసేందుకు విన్నీ స్కెచ్- భార్య అలక తీర్చే పనిలో మిస్టర్ యారగెంట్
తన కాలి షూ లేస్ ఊడిపోయిందని నటించి కావాలని రామతో దాన్ని కట్టేలా చేస్తాడు. పాపం పిచ్చి రామ అదంతా నిజమని అనుకుని రామ పొంగిపోతూ సేవ చేస్తాడు. మీ ఇద్దరూ నా ఇగో మీద మామూలుగా దెబ్బకొట్టలేదు మీకు రివర్స్ సినిమా చూపిస్తానని అనుకుంటాడు. షూ లేస్ కట్టినందుకు మనోహర్ డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు జానకి అక్కడికి వచ్చిన ముష్టివాడికి ఇచ్చేస్తుంది. గోవిందరాజులు, మలయాళం కలిసి వ్రతం కోసం ఇల్లంతా పూలతో అలంకరిస్తూ ఉంటారు. జానకి ఇంకా రాలేదేంటని జ్ఞానంబ అనుకుంటూ ఉంటుంది. సందట్లో సడేమియా అని మల్లిక జానకిని ఇరికించేందుకు ట్రై చేస్తుంది. అప్పుడే రామ వస్తాడు. జానకి ఎక్కడని జ్ఞానంబ కోపంగా అడుగుతుంది.
Casting Couch: రాత్రికి కాఫీకి వెళ్దాం రమ్మంది, అనుమానం వచ్చి.. - క్యాస్టింగ్ కౌచ్‌పై ‘రేసు గుర్రం’ రవి కిషన్
Desamuduru Re-release: అదిరిపోనున్న ఐకాన్ స్టార్ బర్త్ డే, రీరిలీజ్ కు రెడీ అవుతున్న బ్లాక్ బస్టర్ మూవీ!
Movies Release in OTT: ఈ వారం ఓటీటీలదే హవా - ‘అవతార్ 2’తోపాటు 30 సినిమాలు రిలీజ్!
Ram Pothineni: దసరా రేసులో రామ్, బోయపాటి - పాన్ ఇండియా మాస్ మోతకు రెడీ!
BRS - Keerthi Suresh: నేనేమీ గుజరాత్ నుంచి రాలేదు కదా - కీర్తి సురేష్ కామెంట్స్‌ను వాడేసుకుంటున్న బీఆర్ఎస్
Rahul Gandhi Notice: అధికారిక నివాసం ఖాళీ చేయండి - రాహుల్ గాంధీకి నోటీసులు
Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన
Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!
KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్ తర్వాత మూడో కెప్టెన్!