Janaki Kalaganaledu December 30th: డబ్బుతో ఉడాయించిన చరణ్- రామా, జానకిలని దోషులని చేసిన మల్లిక
జానకి ఐపీఎస్ పుస్తకం పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
రామా రూ.20 లక్షలు అప్పు చేసిన విషయం ఇంట్లో తెలిసిపోతుంది. దీంతో అందరూ నానామాటలు అంటారు. అఖిల్ ఉద్యోగం కోసం అప్పు చేసినట్టు రామా చెప్తాడు.
రామా: నా ఫ్రెండ్ చరణ్ బెంగళూరులో మంచి స్థాయిలో స్థిరపడ్డాడు. ఇక్కడ ఒక కంపెనీ పెడుతున్నాడు. తమ్ముడి చదువు తగ్గ ఉద్యోగం కోసం మూడు నెలల గడువు మీద 20లక్షలు పెట్టుబడి పెట్టడం వాళ్ళ కంపెనీలో ఏదో రూల్ అంట. అఖిల్ తో పాటు మరో నలుగురు దగ్గర కూడా తీసుకున్నారు. మూడు నెలల్లో ఆ డబ్బులు తిరిగిస్తారు. నా ద్వారా ఉద్యోగం వచ్చిందని తెలిస్తే అఖిల్ బాధపడతాడని చెప్పలేదు
అఖిల్: నువ్వు సూపర్ అన్నయ్య, అమాయకుడివి అనుకున్న ఇంత తెలివి ఎప్పుడు వచ్చింది. ఇది కూడా వదిన ట్రైనింగ్ ఇచ్చిందా? నా టాలెంట్ మీద ఉద్యోగం ఇస్తున్నట్టు ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు మీరు చేసిన తప్పు నా మీదకి తోసేసి మీరు స్వచ్చమైన మనసులో ఉన్నారని ప్రూవ్ చేసుకుంటున్నారా
జానకి: అఖిల్ ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు నిజంగా నీ జాబ్ కోసం అప్పు చేశారు చెప్తే ఫీల్ అవుతావని ఇలా చేశారు
మల్లిక: భాస్కర్ గారు ఇంటికి రాకపోతే ఈ నిజం బయటపడకపోతే మీరు చెప్పేవాళ్ళు కదా
రామా: నిజంగా అఖిల్ ఉద్యోగం కోసమే అప్పు చేశాను ఇప్పుడే వెళ్ళి చరణ్ ని తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను అని అంటాడు.
Also Read: తులసిని నోటికొచ్చినట్టు తిట్టిన నందు- అడ్డుగా నిలబడిన సామ్రాట్, శ్రుతి సేఫ్
అఖిల్, విష్ణు, గోవిందరాజులు రామా వెంట చరణ్ దగ్గరకి బయల్దేరతారు. జెస్సి గదిలోకి వెళ్ళగానే మల్లిక వెళ్ళి జానకి వాళ్ళ గురించి చెడుగా చెప్పేందుకు చూస్తుంది. జానకి వాళ్ళు స్వార్థం చూసుకునే వాళ్ళు కాదని జెస్సి సపోర్ట్ గా మాట్లాడుతుంది. కానీ వాళ్ళని నమ్మి ఇలా ఉమ్మడి కుటుంబంతో ఉంటే చిప్పే గతి. అఖిల్ ని తీసుకుని బయటకి వెళ్ళి సెటిల్ అవ్వండి, అప్పుడు కానీ మీ జీవితాలు బాగుపడవు అని నూరిపోస్తుంది. జెస్సి మాత్రం రామా వాళ్ళ మీద నమ్మకం ఉందని, అందరూ కలిసి ఉండటానికే ఇష్టపడతాను అని చెప్తుంది.
రామా వాళ్ళు చరణ్ ఆఫీసుకి వస్తారు కానీ అదంతా ఖాళీగా ఉంటుంది. అక్కడి వాచ్ మెన్ ని విషయం అడిగితే ఆఫీసు కోసం వారం రోజులు మాత్రమే తీసుకున్నారని చెప్తాడు. అదంతా విని షాక్ అవుతారు. చరణ్ కి రామా ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. డబ్బులు తీసుకుని ఊరు వదిలి వెళ్లిపోయినట్టు అర్థం అయిపోతుంది. ఇప్పుడు ఏంటి పరిస్థితి ఏం సమాధానం చెప్పాలి అని గోవిందరాజులు టెన్షన్ పడతాడు. అందరూ దిగాలుగా ఇంటికి వస్తారు. చరణ్ మోసం చేసి వెళ్లిపోయాడని గోవిందరాజులు చెప్పేసరికి ఇంట్లో వాళ్ళు అందరూ షాక్ అవుతారు. అది విని మల్లిక నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది.
Also Read: షాకిచ్చిన భ్రమరాంబిక, బిక్కమొహం వేసిన అభిమన్యు- ప్రేమపక్షుల విహారయాత్ర అధ్బుతం
ఇదంతా జానకి ప్లాన్ చేసి ఇలా నాటకం ఆడుతున్నారని మల్లిక అంటుంది. జానకి ఎంత చెప్పినా కూడా నమ్మకుండా అవమానకరంగా మాట్లాడుతుంది. బావగారు స్నేహితుడికి డబ్బు ఇస్తే అందుకు సంబంధించిన కాగితాలు ఉన్నాయా అని మల్లిక నిలదీస్తుంది. అఖిల్ కూడా మల్లికకి సపోర్ట్ చేస్తాడు. రామా మాటలు నమ్మడం లేదని అంటాడు.