Janaki Kalaganaledu December 20th: జానకి గురించి అఖిల్ మనసులో విషం నింపుతున్న మల్లిక- తమ్ముడికి ఉద్యోగం చూసిన రామా
జానకి మళ్ళీ ఐపీఎస్ పుస్తకం పట్టడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
అఖిల్ సర్టిఫికెట్స్ ఫైల్ తీసుకుని బయటకి వెళ్లబోతుంటే మల్లిక ఆపుతుంది. జానకి గురించి చెడుగా చెప్తుంది. జానకి నీ గురించి ఎవరితో ఏం చెప్తే నీకు ఎందుకు? నీలాంటి మంచి వాడికి ఇలాంటి పరిస్థితి వచ్చినందుకు కుమిలిపోతున్నా అని నాటకం ఆడుతుంది. మీ పెద్ద వదిన ఎవరికి పడితే వాళ్ళకి నీ గురించి చెడుగా చెప్తుంటే తట్టుకోలేకపోతున్నా అని మొసలి కన్నీళ్ళు కారుస్తుంది.
మల్లిక: నిన్న జానకి వాళ్ళ బంధువులు ఎవరో ఇంటికి వచ్చారు. ఇంట్లో ఎవరెవరు ఏం పనులు చేస్తున్నారో అడిగారు. పెద్దన్నయ్య స్వీట్ షాపు పెట్టుకున్నాడని, రెండో వాడు బట్టలు కొట్టు అని చెప్పింది. కానీ మూడో వాడికి పెళ్లి అయ్యింది, రేపో మాపో బిడ్డ కూడా పుట్టబోతుంది కానీ బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు అని చెప్పింది అది విని నాకు చాలా బాధేసింది
అఖిల్: పెద్దవదిన అన్నయ్య ముందే కాకుండా బయట వాళ్ళ ముందు కూడా నన్ను బ్యాడ్ చేస్తుందన్న మాట
మల్లిక: ఏం ఆలోచిస్తున్నావ్ అఖిల్ నేను అబద్ధం చెప్పాను అనుకుంటున్నావా
అఖిల్: పెద్ద వదిన గురించి నాకు బాగా తెలుసు అన్నయ్య దగ్గర నన్ను చెడు చేయడం నేనే విన్నాను, ఇక బయట వాళ్ళ ముందు చెప్పదా
Also Read: పరాధాన్యంలో తులసి, సామ్రాట్- శ్రుతి, అంకిత రేషన్ బాధలు
మల్లిక: ఎక్కడికి వెళ్తున్నావ్
అఖిల్: అందరూ నన్ను పనికిరాని వాడిని అంటున్నారు అందుకే జాబ్ వెతుక్కోవడానికి వెళ్తున్నా
జానకి గురించి చెడుగా చెప్పినందుకు మల్లిక తెగ సంబరపడుతుంది. రామా జానకిని కాలేజీ దగ్గర దింపుతాడు. కానీ అఖిల్ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అఖిల్ జాబ్ ట్రై చేస్తాదులే కంగారుపడకండి అని జానకి ధైర్యం చెప్తుంది. రామా తిరిగి వెళ్లబోతుంటే రోడ్డు మీద తన చిన్న నాటి స్నేహితుడు చరణ్ ఎదురుపడతాడు. ఒక కొత్త కంపెనీ పెట్టబోతున్నా అని బాగా చదువుకున్న కుర్రోళ్లు కావాలని చరణ్ అడుగుతాడు. తన తమ్ముడు బాగా చదువుకున్నాడని ఉద్యోగం ఇవ్వమని రామా అడుగుతాడు. విజిటింగ్ కార్డ్ ఇచ్చి దీన్ని తీసుకుని అఖిల్ ని కలవమని చెప్తాడు.
Also Read: యష్ తో అట్లుంటది మరి, మనవడిని తెగ మెచ్చుకున్న రాజా, రాణి- బిక్కమొహం వేసిన వేద
జానకి పుస్తకం ముందు పెట్టుకుని పరధాన్యంగా ఉంటుంది. అప్పుడే కాలేజీ ప్రిన్సిపల్ వచ్చి తనని పలకరిస్తుంది. బాగా చదువుకుని నీ ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి రెండు నెలలు మాత్రమే ఉందని, చదువు మీద తప్ప వేరే వాటి మీద ఫోకస్ పెట్టొద్దని చెప్పి వెళ్ళిపోతుంది. అఖిల్ దిగాలుగా ఇంటికి వస్తాడు. ఉద్యోగం వచ్చిందా అని మల్లిక ఆత్రంగా అడుగుతుంది. నువ్వు చదివిన చదువుకి హైదరాబాద్ లో ఉద్యోగం వస్తుంది కానీ ఇక్కడేం వస్తుందని పుల్ల వేస్తుంది. జానకిలాగా కాదు నేను ఎప్పుడు నీ మంచి కోరుకుంటాను అని అంటుంది. నీకు అభ్యంతరం లేకపోతే మీ చిన్నన్నయ్య షాపులో పని చెయ్యి అని సలహా ఇస్తుంది. అది విని అఖిల్ మనసులోనే తిట్టుకుంటాడు.