Janaki Kalaganaledu December 14th: ఐపీఎస్ చదువుకోవడానికి ఒప్పుకున్న జానకి- జెస్సికి ఆరోగ్య పరిస్థితి జ్ఞానంబకి తెలిసిపోతుందా?
జానకి మళ్ళీ ఐపీఎస్ చదువుకోవడానికి ఒప్పుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
జ్ఞానంబ జెస్సీకి సీమంతం చేస్తున్న విషయం తన తండ్రి పీటర్ కి ఫోన్ చేసి చెప్తుంది. ఆ మాట విని చాలా సంతోషిస్తాడు. జెస్సి తన తండ్రితో సంతోషంగా మాట్లాడుతుంది. అదంతా చూసి మల్లిక తెగ కుళ్ళుకుంటుంది. సీమంతానికి కావాల్సిన ఏర్పాట్లు చెయ్యమని రామా, జానకికి పురమాయిస్తుంది. ‘జెస్సికి సీమంతం అంటే మల్లిక తట్టుకోలేదు, వచ్చిన ఆడవాళ్ళు ఓదార్పుగా పలకరిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు, అందుకే మీరు మీ మామగారి ఇంటికి వెళ్ళండి’ అని జ్ఞానంబ విష్ణుకి చెప్తుంది.
విష్ణు; మాకు బాధ ఉంది కాదని అనను అలాగని ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే ఎలా వెళ్లిపోతాను, నా తమ్ముడికి బిడ్డ పుడుతుంటే నాకు సంతోషమే కదా. నాకు ఆ అదృష్టాన్ని దూరం చేశాడు, నేను బాధపడి మిమ్మల్ని బాధపెట్టాలని అనుకోవడం లేదమ్మా
రామా: బాధ నుంచి ఇంత త్వరగా బయటకి రావడం చాలా సంతోషంగా ఉంది
విష్ణు: జరిగిందేదో జరిగిపోయింది ఈ శుభకార్యం ఘనంగా జరిపించాలి
ఇంట్లో వాళ్ళందరికీ పనులు చెప్తుంది జ్ఞానంబ. రామా జానకి పుస్తకాలు చూసి చాలా బాధపడతాడు. జానకి మళ్ళీ చదివితే తప్ప ప్రశాంతంగా ఉండలేను ఎలా తనని ఒప్పించాలా అని అనుకుంటాడు. జానకి సాధించిన పతకాలు అన్ని ఒకచోట పెడతాడు రామా. వాటిని చూసి జానకి ఎమోషనల్ అవుతుంది. తొందరపాటులో ఏదో ఒక మాట అన్నాను దాన్ని పట్టించుకుని మీరు ఇలా చెయ్యొద్దు క్షమించమని వెళ్ళి జానకిని కౌగలించుకుంటాడు. తన బాధ అర్థం చేసుకోమని రామా బతిమలాడతాడు. చదువుకుంటాను, కాలేజీకి వెళ్తాను అని చెప్తే తన గుండెల్లో భారం దిగిపోతుందని చాలా బాధగా అడుగుతాడు.
Also read: చెట్టెక్కి మామిడి కాయలు కోసిన తులసి- లాస్య కక్కుర్తి
జానకి కాలేజీకి వెళ్తాను అని ఒప్పుకుంటుంది. ఆ మాట విని రామా హ్యపీగా ఫీల్ అవుతాడు. వెంటనే జానకిని ఎత్తుకుని సంతోషంగా తిప్పేస్తాడు. చదువుకుంటాను, ఐపీఎస్ అవుతానని జానకి మళ్ళీ చెప్తుంది. సీమంతం అయిపోయిన తర్వాత నుంచి కాలేజీకి వెళ్తానని చెప్తుంది. జానకి మళ్ళీ తన ఐపీఎస్ పుస్తకాలు చూసి సంతోషిస్తుంది. అటు మల్లిక మాత్రం తన కడుపు పోయినట్టు నాటకం ఆడి సీమంతం చేసుకోలేకపోయానని ఏడుస్తుంది. మల్లిక సీమంతం పనులు చేస్తున్నట్టు బిల్డప్ కొడుతుంది. జ్ఞానంబ చికితని పిలిచి మల్లికని ఒక పక్కన కూర్చోబెట్టి ఏ పని చేయనివ్వకు, కదలనివ్వకు అని చెప్తుంది. సీమంతం వేడుకకి వచ్చిన ఒక ముసలావిడ మల్లిక దగ్గరకి వెళ్ళి దెప్పి పొడుస్తుంది.
Also read: 'ప్రేమయాత్ర'కి బయల్దేరిన వేద, యష్- ఫుల్ ఖుషీగా రెండు కుటుంబాలు
తరువాయి భాగంలో..
జానకికి డాక్టర్ ఫోన్ చేసి జెస్సి గురించి చెప్తుంది. తన కడుపులో ఉన్న బిడ్డ బతకడం చాలా కష్టమని అంటుంది. రిపోర్ట్స్ చూడామణి ఇంటికి పంపించినట్టు చెప్తుంది. నర్స్ జెస్సీ రిపోర్ట్ తీసుకుని వస్తే జ్ఞానంబ తనని వివరాలు అడుగుతుంది. రిపోర్ట్స్ తీసుకుని జెస్సి కడుపులో బిడ్డ ఎలా ఉందని అడుగుతుంది.