Janaki Kalaganaledu April 6th: మధుతో మనోహర్ డీల్- జానకిని ఉద్యోగం మానేయమని చెప్తానన్న జ్ఞానంబ
జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
![Janaki Kalaganaledu April 6th: మధుతో మనోహర్ డీల్- జానకిని ఉద్యోగం మానేయమని చెప్తానన్న జ్ఞానంబ Janaki Kalaganaledu Serial April 6th Episode 546 Written Update Today Episode Janaki Kalaganaledu April 6th: మధుతో మనోహర్ డీల్- జానకిని ఉద్యోగం మానేయమని చెప్తానన్న జ్ఞానంబ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/04/06/5ba44395d250cb614785164ba81fd3a81680757956341521_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బిల్డర్ మధు హత్య చేయడం జానకి ఎస్సై మనోహర్ కి చెప్తుంది. ఈ హత్య విషయం బయట ఎవరికి చెప్పొద్దని పేరు ఎక్కడ బయట పెట్టొద్దని చెప్తాడు. జ్ఞానంబ, రామ బాబుని పోలియో డ్రాప్స్ వేయించడానికి తీసుకొస్తారు. అదే హాస్పిటల్ కి జానకి గాయపడిన వ్యక్తిని తీసుకుని వస్తుంది. జానకిని చూసి జ్ఞానంబ కంగారుపడుతుంది. రామ కంగారుగా ఏమైందని అడుగుతాడు. ఏదో యాక్సిడెంట్ కేసని జానకి అబద్ధం చెప్తుంది. అతన్ని ముట్టుకోవడం ఎందుకని వెళ్ళి చేతులు కడుక్కోమని చెప్పేసి వెళ్లిపోతారు. మనోహర్ బిల్డర్ మధుకి ఫోన్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు. అయినా మనోహర్ మళ్ళీ చేసేసరికి చేసేదేమి లేక లిఫ్ట్ చేస్తాడు. రక్తపు మరకలు మిగలకుండా చేతులు క్లీన్ చేసుకున్నారా అని మనోహర్ అనేసరికి మధు షాక్ అవుతాడు.
Also Read: ట్రయల్ రూమ్‌లో విక్రమ్, దివ్య సరసాలు - నందు, తులసిని చూసి రగిలిపోతున్న లాస్య
మీరు మర్డర్ చేయడం మా లేడి కానిస్టేబుల్ లైవ్ లో చూసేసిందని చెప్పేసరికి మధు నోట్లో నుంచి ఒక్కటే మాట వస్తుంది. ఎంత కావాలని అంటే రూ.50 లక్షలు కావాలని డిమాండ్ చేస్తాడు. అతని భార్యాబిడ్డలు వచ్చి ఏడుస్తూ ఉండటంతో జానకి వాళ్ళకి ధైర్యం చెప్తుంది. అప్పుడే ఎస్సై మనోహర్ హాస్పిటల్ కి వస్తాడు. డాక్టర్ వచ్చి అతను చనిపోయాడని చెప్పేసరికి మనోహర్ మనసులో సంతోషపడతాడు. బతికి ఉంటే నా డీల్ కి అడ్డం వచ్చేవాడని అనుకుంటాడు. జానకిని స్టేషన్ కి వెళ్లిపొమ్మని చెప్తాడు. రామ వచ్చి ఏమైందని అడిగేసరికి జానకి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. చంపిన వాడిని కళ్ళారా చూశానని, పొరపాటున కూడా నిందితుడి పేరు బయటకి చెప్పొద్దని ఎస్సై ఆర్డర్ వేశాడని చెప్తుంది. ఎలాగైనా అతడిని పట్టుకుని శిక్ష పడేలా చేస్తానని అంటుంది. ఎస్సై కోపరేట్ చేస్తే సరి లేకపోతే ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుందని బాధపడుతుంది.
Also Read: కావ్యని పుట్టింటికి తీసుకెళ్తానన్న రాజ్- నడిరోడ్డు మీద స్వప్న, తప్పించుకున్న రాహుల్
జానకి చేతులకు రక్తం చూసి జ్ఞానంబ పదే పదే తలుచుకుని భయపడుతుంది. ఈ పోలీస్ ఉద్యోగం వద్దు జానకిని వెంటనే మానేయమని జ్ఞానంబ చెప్తుంది. తనని ఇలాగే వదిలేస్తే మనసు రాయిలా మారుతుంది, బంధాలకు దూరమవుతుంది. జీవన యంత్రంగా మారిపోతుంది. జానకి అలా మారడానికి వీల్లేదు. తనని దూరం చేసుకోవడానికి నేను సిధ్దంగా లేనని భయపడుతుంది. గోవిందరాజులు భార్యకి సర్ది చెప్పడానికి చూస్తాడు. చేతికి రక్తంతో కనిపించినప్పుడు తన కళ్ళలో బాధ కనిపించిందా మొండితనం కనిపించిందా అని అడుగుతాడు. బాధ కనిపించదని చెప్తుంది. అది జానకి మనసు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న తన మనస్తత్వం మారదని అంటాడు. ఇప్పటికే మన కుటుంబ పరిస్థితుల వల్ల కాళ్ళకి సంకెళ్ళు పడ్డాయి తనని ఇంకా వెనక్కి లాగొద్దు మనం అందరం తలెత్తుకునేలా చేస్తుంది. దయచేసి నీ భయాన్ని నీలోనే దాచుకో బయటపెట్టకని సలహా ఇస్తాడు. ఇంకెప్పుడు ఇలా ఆలోచించనని చెప్తుంది. స్టేషన్ లో జానకి మధు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటే మనోహర్ వచ్చి అడుగుతాడు. నేను చేయమని చెప్పలేదు కదా అని మనోహర్ అంటే ఇది నా డ్యూటీ అది ఒకరు చెప్పాల్సిన పని లేదని అంటుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)