News
News
వీడియోలు ఆటలు
X

Janaki Kalaganaledu April 1st: రౌడీ దుమ్ముదులిపిన జానకి- జ్ఞానంబకి పెద్దకోడలు మీద చాడీలు చెప్పిన పెట్రోల్ మల్లిక

జానకి కానిస్టేబుల్ కావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 
Share:

జ్ఞానంబ జానకికి చిన్న పిల్లల ఫోటో ఇవ్వడం చూసి కుళ్ళుకుంటుంది. జానకి కంటే ముందు తనే నెల తప్పాలని మల్లిక దేవుడిని కోరుకుంటుంది. అటు జానకి పిల్లల ఫోటోలు గదిలో అతికించుకుని మురిసిపోతుంది. అది చూసి నా లక్ష్యం ఎప్పటికీ గుర్తుండేలా కళ్ళేదుట కనిపించేలా ఫోటో అతికించానని జానకి అంటుంటే తన ఐపీఎస్ లక్ష్యమనుకుని రామ అనుకుంటాడు. జానకి పిల్లలు కనడం గురించి మాట్లాడుతుంటే రామ మాత్రం చదువు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఈ క్షణంలోనే మీ లక్ష్యం నెరవేరితే ఏం చేస్తారని రామ అంటే అంతకి మించి ఇంకేముంటుందని సంబరపడుతుంది. కాసేపటికి జానకి పిల్లల గురించి మాట్లాడుతున్న విషయం రామకి అర్థమవుతుంది.

Also Read; పెళ్లి చూపుల్లో దివ్యని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్న విక్రమ్- షాక్‌లో తులసి ఫ్యామిలీ

తనకి పాప కావాలని రామ అంటే కుదరదు తనకి బాబు కావాలని అంటుంది. పొద్దున్నే రామ స్వీట్ బండి రెడీ చేసుకుంటూ మీరు కానిస్టేబుల్ అయిన తర్వాత తనకి ఎక్కువ మంది సెల్యూట్ కొడుతున్నారని చెప్తాడు. అప్పుడే ఇద్దరు ఆడవాళ్ళు జానకి దగ్గరకి వస్తారు. తన కూతురిని కొంతమంది కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారని చెప్పి బాధపడుతుంది. వాళ్ళ దెబ్బకి చదవడం మానేసిందని కాలేజీకి కూడా వెళ్ళడం లేదని ఏడుస్తుంది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వవచ్చు కదా అని రామ అంటే పరువు పోతుందని అంటుంది. పోలీసుల మీద తనకి నమ్మకం లేదని ఆడపిల్ల తల్లి చెప్తుంది. మగతోడు లేని కుటుంబమని అంత ధైర్యం చేయలేనని అనేసరికి సరే తను చూసుకుంటానని జానకి వాళ్ళకి చెప్తుంది. ఆడపిల్లలు ధైర్యంగా ఉండాలి ఇంకా జీవితం చాలా ఉంది అప్పుడే భయపడితే ఎలా కుర్రాళ్లను నాకు చూపించు నేను చెప్తా వాళ్ళ సంగతని స్వాతిని వెంటబెట్టుకుని వెళ్తుంది. రామ వస్తానంటే వద్దు జీవితంలో తోడు ఉంటే చాలు ఉద్యోగం సంగతి తాను చూసుకుంటానని చెప్తుంది.

జ్ఞానంబ దంపతులు గుడికి వెళ్ళడానికి బయల్దేరుతుంటే మల్లిక వచ్చి మాట్లాడుతుంది. ఎప్పుడు పాడే పాటగా ఎప్పటికప్పుడు ట్యూన్ లు మార్చి పాడుతుంది మల్లిక అని గోవిందరాజులు సెటైర్ వేస్తాడు. ఏంటో చెప్పమని జ్ఞానంబ అడుగుతుంది. ఈ ఇంటికి పెద్ద మీరు మీ పెద్దరికాన్ని నిలబెట్టలేదు. ఇందాక కామేశ్వరి ఆంటీ వచ్చింది. వాళ్ళ అమ్మాయిని ఎవరో పోకిరి కుర్రాళ్ళు ఏడిపిస్తున్నారంట మీకు చెప్పుకుంటే జానకికి చెప్పి ఏదో ఒక సాయం చేస్తారని వచ్చారు కానీ ఇంతేనా దానికి అత్తయ్య దాకా ఎందుకు నేను చూసుకుంటానులే అని చెప్పిందని జానకి మీద చాడీలు చెప్తుంది. మీరు జానకికి గట్టిగా వార్నింగ్ ఇవ్వకపోతే మేము కూడా ఇలాగే మాట్లాడతామని అంటుంది. సమస్యని పరిష్కరించాల్సింది జానకి కాదు పోలీస్ స్టేషన్ లో ఎస్సై, ఇంట్లో అత్తయ్య అవేమీ పట్టించుకొకపోతే చిక్కుల్లో పడేది జానకి కాదు ఈ ఇంటి పరువు అని బాగా ఎక్కిస్తుంది.

Also Read: స్వప్నకి చుక్కలు చూపించిన కనకం- కావ్యని ఎత్తుకుని ప్రదక్షిణలు చేసిన రాజ్

మన పరువుకి మచ్చ పడకుండా కాపాడాలని ఆ దేవుడికి దణ్ణం పెట్టుకుందామని చెప్పి గోవిందరాజులు భార్యని తీసుకుని గుడికి వెళ్లిపోతారు. తన పాచిక పారలేదని మల్లిక తిట్టుకుంటుంది. జానకి స్వాతిని బస్టాప్ కి తీసుకొచ్చి వెళ్ళమని చెప్తుంది. స్వాతి వెళ్ళి బస్టాప్ లో నిలబడేందుకు భయపడుతుంటే జానకి సత్యభామ, దుర్గామాత అని కాసేపు తనని మోటివేట్ చేస్తుంది. వాడి వస్తే లాగి చెంప పగలగొట్టు చెప్పు తీసి చూపించి దెబ్బకి పారిపోతాడని అంటుంది. దీంతో స్వాతి వెళ్ళి బస్టాప్ లో నిలబడుతుంది ఆ ఆకతాయి వచ్చి తనని ఏడిపిస్తాడు. జానకి ఇచ్చిన ధైర్యంతో స్వాతి అతన్ని కొడుతుంది. తర్వాత వాడు స్వాతి మీదకి చెయ్యి ఎత్తబోతుంటే జానకి వచ్చి ఆపుతుంది. వాడిని రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తుంది.

Published at : 01 Apr 2023 10:30 AM (IST) Tags: janaki kalaganaledu serial today episode Janaki Kalaganaledu Serial Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial April 1st Update

సంబంధిత కథనాలు

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Varun Tej Engagement: ఘనంగా వరుణ్ తేజ్, లావణ్య నిశ్చితార్థం - వేడుకలో మెగా, అల్లు ఫ్యామిలీల సందడి

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Hitler Movie: ‘హిట్లర్’ మూవీని ముందు ఆ హీరోతో అనుకున్నాం - కుట్ర జరిగింది: రైటర్ మరుధూరి రాజా

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Ayesha Shroff: రూ.58 లక్షలు మోసపోయిన హీరో తల్లి, కిక్ బాక్సర్ అరెస్ట్ - ఇంతకీ ఏమైంది?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

Maya Petika Movie: పాయల్ రాజ్ పుత్ ‘మాయా పేటిక’ వచ్చేస్తుంది - విడుదల ఎప్పుడంటే?

Punch Prasad: ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్‌కు ఏమైంది? రెండు కిడ్నీలు పాడవ్వడానికి కారణం అదేనా?

Punch Prasad: ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్‌కు ఏమైంది? రెండు కిడ్నీలు పాడవ్వడానికి కారణం అదేనా?

టాప్ స్టోరీస్

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

KCR Good News: దివ్యాంగులకు సీఎం కేసీఆర్ తీపి కబురు - వచ్చే నెల నుంచే అమలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Varun Tej, Lavanya Engagement: తన ‘లవ్’తో వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్ - ఇవిగో ఫొటోలు

Apsara Murder Case Update : అప్సర హత్య వెనుక ఇన్ని కోణాలున్నాయా ? - మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన సంచలన విషయాలు !

Apsara Murder Case Update :  అప్సర హత్య  వెనుక ఇన్ని కోణాలున్నాయా ? -  మర్డర్ మిస్టరీలో పోలీసులు చెప్పిన  సంచలన విషయాలు !

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!

TSRTC Services: 'గ్రూప్-1' ప్రిలిమిన‌రీ ప‌రీక్షకు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు!