By: ABP Desam | Updated at : 01 Apr 2023 09:51 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
విక్రమ్ హాస్పిటల్ లో స్టాఫ్ కి చెక్స్ ఇస్తూ ఉంటాడు. నర్స్ చెక్స్ ఇస్తున్నారని తీసుకోమని చెప్పడంతో దివ్య విక్రమ్ ఉన్న క్యాబిన్ కి వస్తుంది. అక్కడ తనని చూసి షాక్ అవుతుంది. నందు పని చేసుకుంటుంటే లాస్య వచ్చి దివ్యకి మంచి సంబంధం తీసుకొచ్చానని చెప్తుంది. ఈసారి మూడో పెళ్లి వాడిని తీసుకొచ్చావా? నీ రేంజ్ అదే కదా అలాంటి సంబంధాలు కదా తీసుకొచ్చేదని నందు వెటకారంగా అంటాడు. ముందు సంబంధం గురించి చెప్పమని పరంధామయ్య అడుగుతాడు. మంచి కోటీశ్వరుడు నాలుగు తరాలు తిన్నా కూర్చుని తరగని ఆస్తి ఉంది దివ్య పని చేస్తున్న హాస్పిటల్ తనదేనని లాస్య చెప్తుంది. మన స్థాయి గుర్తించుకోవాలని పరంధామయ్య చెప్తాడు.
రాజ్యలక్ష్మిని వెళ్ళి సంబంధం గురించి అడిగానని ఒకే కూడా అనేశారని చెప్పేసరికి తులసి సంతోష పడుతుంది. ఒక అబద్ధం కూడా చెప్పకుండా పెళ్లి ఒకే చేయించానని చెప్తుంది.
నందు: సరే అబ్బాయి ఏం చదువుకున్నాడు
లాస్య: కుర్రాడు పెద్దగా చదువుకోలేదు
నందు: అయితే ఈ సంబంధం కుదరదు
Also Read: స్వప్నకి చుక్కలు చూపించిన కనకం- కావ్యని ఎత్తుకుని ప్రదక్షిణలు చేసిన రాజ్
అటు రెస్టారెంట్లో దివ్య విక్రమ్ ని నిలదీస్తుంది.
దివ్య: నమ్మకద్రోహం అంతే ఏంటో విన్నాను కానీ ఇప్పుడు తెలుసుకున్నాను
విక్రమ్: ఒక్కసారి నేను చెప్పేది వినండి దివ్య
దివ్య: ఇన్నాళ్ళూ మీరు చెప్పింది విన్నా ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉందని అనుకున్నా కానీ అదంతా నా భ్రమ. చేయాల్సిన మోసం ఏమైనా మిగిలిపోయిందా
విక్రమ్; మీతో జీవితం పంచుకోవాలని ఆశపడ్డాను కానీ జీవితంతో ఆడుకోవాలని అనుకోలేదు
దివ్య: మాయమాటలతో నా చుట్టూ తిరుగుతూ నా మనసుని ఎంత గాయపరిచారు వెళ్లిపోండి నా ముందు నుంచి వెళ్లిపోండి
విక్రమ్: వెళ్లిపోవడానికి కాదు మీ చుట్టూ తిరిగింది. నేను నిజాయితీగానే ఉన్నాను
దివ్య: మీరు రాజ్యలక్ష్మి కొడుకని ఎందుకు దాచి పెట్టారు
విక్రమ్: మా వాళ్ళ గురించి ఎప్పుడు అడగలేదు, నేను కూడా మీ విషయాలు అడగలేదు. మన పరిచయాలు కుటుంబ విషయాలు దాకా వెళ్లలేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు తప్పు పడుతున్నారు
దివ్య: చాలా తెలివిగా సమాధానం చెప్తున్నారు మీ పని వాడిని హాస్పిటల్ కి తీసుకొచ్చి నటించలేదా
విక్రమ్: అది మీకు దగ్గరవడం కోసం చేసిన పని నేను హాస్పిటల్ ఓనర్ అని చెప్పి దగ్గర అవడానికి ప్రయత్నిస్తే మీరు రానిస్తారా? ఆస్తులు, అంతస్తులు అన్నింటికీ దూరంగా మీరు నన్ను ప్రేమించాలని ఆశపడ్డాను అది నిజాయితీ కాదా అందులో నా మంచితనం కనిపించడం లేదా. మీకు నాలో ప్రేమ కనిపిస్తే పిలవండి వెనక్కి వస్తాను మోసం కనిపిస్తే కారు ఎక్కి వెళ్లిపోతాను జీవితంలో నా మొహం మీకు చూపించను అనేసి వెళ్లిపోతుంటే దివ్య కాసేపు ఆలోచించి విక్రమ్ అని గట్టిగా పిలుస్తుంది. ఇద్దరూ కౌగలించుకుంటారు. ఆ సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది.
Also Read: చంటిపిల్లల ఫోటో చూసి మురిసిన జానకి- ప్రెగ్నెన్సీ గురించి మల్లికని అడిగిన జ్ఞానంబ
లాస్య: అబ్బాయికి చదువు లేదని సంబంధం రిజెక్ట్ చేస్తావా తులసి నీ అభిప్రాయం కూడా ఇదేనా తనకి తరగని ఆస్తి ఉంది ఇక చదువుతో పనేముంది
నందు: అనవసరంగా ఆవేశపడుతూ ఏదేదో మాట్లాడుతున్నావ్ కానీ నేను ఈ సంబంధం వద్దు అన్నది నువ్వు తీసుకొచ్చావని
లాస్య: రాజ్యలక్ష్మి కొడుకు విక్రమ్ మీద నీ కూతురు మనసు పడిందని చెప్తే నువ్వు ఒప్పుకోవా
తులసి: అలాంటిది ఏదైనా ఉంటే దివ్య నాతో నేరుగా చెప్తుంది
లాస్య: దివ్య కూడా పొరపాటు చేయలేదు తను ఇష్టపడిన విషయం తెలుసుకున్నా కాబట్టే రాజ్యలక్ష్మితో సంబంధం మాట్లాడాను అన్నప్పుడే దివ్య సంతోషంగా ఇంటికి వస్తుంది. నువ్వు దాచిన ఒక నిజం నేను చెప్పేశాను, అదే నువ్వు విక్రమ్ ప్రేమించుకున్న విషయం చెప్పాను
దివ్య: నా పర్సనల్ విషయాలు నేను మాట్లాడుకుంటా కదా మీరు ఎందుకు జోక్యం చేసుకున్నారు సోరి అమ్మా కావాలని నీ నుండి దాచాను అతని మనసులో నేను ఉన్నానో లేదో తెలుసుకోకుండా మీ ముందు బయట పడటం ఎందుకని ఆగాను సోరి అమ్మా నీ దగ్గర ఈ విషయం దాచాను
తులసి: అంతా సవ్యంగా జరుగుతుంది అది చాలు నా కూతురు అదృష్టవంతురాలు
Suma Adda Show Promo: పార్టీ అంటే పరిగెత్తుకొచ్చే బ్యాచ్ ఒకటి ఉంది, ఆ ముఠాకు మేస్త్రీని నేనే: రానా
Ruhani Sharma's HER Movie : నో పాలిటిక్స్, ఓన్లీ పోలీసింగ్ - రుహనీ శర్మ ఖాకీ సినిమా అప్డేట్ ఏంటంటే?
Balakrishna Movie Title : టైటిల్ కన్ఫర్మ్ - NBK 108లో బాలకృష్ణ క్యారెక్టర్ పేరే సినిమాకు, అది ఏమిటంటే?
రజనీకాంత్తో కమల్ హాసన్ సినిమా - నిర్మాతగా బాధ్యతలు!
Dheekshith Shetty : ధరణి ఫ్రెండ్ సూరిగాడికి తెలుగులో ఇంకో వెబ్ సిరీస్ - ఈసారి కాలేజీ పోరగాడిగా!
Tammineni Seetharam: సెక్యూరిటీ లేకపోతే బాబు బయటకే రాలేరు, కమాండోలను తీసేస్తే ఆయన ఫినిష్: తమ్మినేని సీతారాం
BRS Politics : కలిసి నడిచేందుకు వచ్చిన వారందర్నీ దూరం పెడుతున్న కేసీఆర్ - జాతీయ వ్యూహం మారిపోయిందా ?
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
Wrestlers Protest: పతకాలను గంగానదిలో పారేసి, ఇండియా గేట్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటున్న రెజ్లర్లు!