News
News
X

Janaki Kalaganaledu September 23rd: నాటకం మొదలుపెట్టిన అఖిల్- జెస్సిని చూసి ఆగ్రహించిన జ్ఞానంబ,క్షమాపణ చెప్పిన పీటర్

అఖిల్ జెస్సీల పెళ్లి చేసుకుని తీసుకొస్తుంది జానకి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..

FOLLOW US: 

బయటకి మాత్రమే మనం భార్యభర్తలం ఈ నాలుగు గోడల మధ్య నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని అఖిల్ జెస్సి తెగేసి చెప్తుంది. నువ్వు కూడా సంబంధం లేదని అటు మా అమ్మ కూడా సంబంధం లేదని అంటే నేను ఎందుకు బతకడం అని మళ్ళీ డ్రామా మొదలుపెడతాడు. కానీ జెస్సి మాత్రం చాలు ఇక ఆపు అని అంటుంది. ఏడుస్తూ నటిస్తాడు.. ఇంకా నీ కన్నీళ్లతో నన్ను ఏమార్చాలని చూడకు అని అంటుంది. నిజాయితీగా వచ్చిన కన్నీళ్ళు కూడా నమ్మవా అని అడుగుతాడు. నీ మీద నాకు నమ్మకం పోయిందని జెస్సి అంటే మా అమ్మకి భయపడి నేను అలా బిహేవ్ చేశాను తప్ప నీ మీద ప్రేమ లేక కాదు ఇంకెప్పుడు అలా చెయ్యను నన్ను క్షమించు అని అఖిల్ ఏడుస్తాడు. నా మీద నమ్మకం లేదా కావాలంటే నీ కాళ్ళు పట్టుకుని చెప్పనా అని అఖిల్ అనేసరికి జెస్సి కరిగిపోతుంది. నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అని అఖిల్ ఏడుస్తున్నట్టు నటిస్తాడు.

జ్ఞానంబ జానకి షరతుల్లో ఒకటి కొట్టేసిన దాని గురించి ఆలోచిస్తుంది. ఎంత పెద్ద తప్పు చేశాను అని జ్ఞానంబ అనుకుంటూ వెళ్ళి దాన్ని మళ్ళీ చెరిపేయడానికి చూస్తుంది కానీ అది చెరిగిపోదు. అది చెరిగిపోదు జ్ఞానం అని గోవిందరాజులు అంటాడు. జానకి ఎన్నో సార్లు మన కుటుంబాన్ని కాపాడింది కానీ నువ్వు తన మీద కోపం తెచ్చుకున్నావ్, మన కోసం ఎన్ని మాటలు అయినా భరిస్తుందని గోవిందరాజులు చెప్తుంటే దూరం నుంచి రామా వింటాడు. అవునండి జానకిని తొందరపడి మాట అన్నాను కానీ అదేమీ మనసులో పెట్టుకోకుండా ఈ ఇంటి పరువు గుమ్మం దాటకుండా చేసింది నా కోడలు చాలా గొప్పది అని జ్ఞానంబ అంటుంది.

Also Read: తల్లిదండ్రులను చూసిన కార్తీక్,దీపను చూసిన ఆనందరావు - మాయా ప్రపంచంలో మోనిత వెలిగిస్తోన్న 'కార్తీకదీపం'

జానకిని నువ్వు అపార్థం చేసుకోకు ఇలాంటివి జరిగితే తన వైపు కూడా ఆలోచించు అని చెప్తాడు. నిజమే కానీ తన బాధ్యత నాకు సంతృప్తి ఇవ్వలేదని అంటుంది. బాధ్యత అంటే ఒకటి పట్టించుకుని ఇంకొకటి వదిలేయడం కాదు ఇటు ఇంటి సమస్యని పట్టించుకుని అటు తన ఆశయాన్ని వదిలేసింది. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడింది కానీ తన ఆశయం కోసం ఎంతో ముఖ్యమైన పరీక్ష వదిలేసింది. తన మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని ఎలా నిలబెడుతుంది, ఈ సమస్యని పరిష్కరించడానికి తను చాలా ఇబ్బంది పడింది ఇక పోలీస్ ఉద్యోగాన్ని ఎలా నిర్వర్తిస్తుంది అదే నా బాధ అని జ్ఞానంబ అంటుంది.

రామా దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. అఖిల్ విషయంలో జానకి గారు గెలిచారు కానీ అమ్మ ఇచ్చిన బాధ్యత విషయంలో ఓడిపోయారు అని అనుకుంటారు. కోడలిగా నేను బాధ్యత సరిగా చేయలేకపోయాను అని మావయ్య గారికి చెప్పడం నేను కూడా విన్నాను అని చెప్తుంది. జ్ఞానంబ తులసి కోట దగ్గర పూజ చేసుకుంటూ ఉంటుంటే అప్పుడే జెస్సి నైట్ డ్రెస్ లో ఉండి నిద్ర లేచి వస్తుంది అది చూసి మల్లిక నోరెళ్ళబెడుతుంది. ఈ జెస్సిని అడ్డు పెట్టుకుని జానకిని తిట్టించాలని మల్లిక అనుకుంటుంది. వెంటనే పోలేరమ్మకి ఈ విషయం చెప్పాలి అని వెళ్ళి అత్తయ్యగారు మన ఇంటి ఆచారాలు తెలియని అమ్మాయిని జానకి మన ఇంటికి తీసుకొచ్చిందని మల్లిక చెప్తుంది.

Also Read: మాటలతో వసు మనసుకి మరో గాయం చేసిన రిషి, బయటపడిన దేవయాని-సాక్షి కుట్ర!

జెస్సి మగరాయుడిలాగా బట్టలు వేసుకుని ఇంట్లో ఉందని చెప్తుంది. జ్ఞానంబ వచ్చి జెస్సిని చూసి జానకి అని గట్టిగా పిలుస్తుంది. పద్ధతులు నిలబెట్టాలని కొత్తగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టిన వాళ్ళకి చెప్పు, కట్టుబాట్లు నిక్కచ్చిగా పాటించే ఈ ఇంట్లో ఇలాంటి బట్టలు వేసుకుని సంప్రదాయాన్ని మంటగలపొద్దని చెప్పు అని గట్టిగా చెప్తుంది. జెస్సిని తీసుకుని జానకి గదిలోకి వెళ్తుంది. నీకు కాలేజీలో ఈ ఇంటి పద్దతులు మార్చుకుంటాను అని చెప్పాను కదా మార్చుకుంటా అని చెప్పి ఇలాంటివి ఎందుకు వేసుకున్నావ్ అని అడుగుతుంది. కట్టుబట్టలతో ఇక్కడికి వచ్చాను చేసేది లేక అఖిల్ బట్టలు వేసుకున్న అని చెప్తుంది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా నువ్వు ఈ ఇంటి ఆచారాలు పాటించి తీరాలి అని జానకి సర్ది చెప్తుంది.

ఇంట్లో అందరూ వచ్చి భోజనానికి కూర్చుంటారు. అఖిల్, జెస్సీలు రావడం చూసి జ్ఞానంబ వెళ్లిపోతుంటే గోవిందరాజులు ఆపుతాడు కానీ తనౌ వెళ్ళిపోతుంది. అప్పుడే మేరీ, పీటర్ ఇంటికి వస్తారు. మా అమ్మాయిని మీ ఇంటి కోడలిగా చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని మేరీ అంటుంది. మీరిద్దరి వల్లే అఖిల్ తో జెస్సి పెళ్లి జరిగిందని పీటర్ అంటాడు. కూతురి భవిష్యత్ ఏమవుతుందో అని భయపడి మీతో కఠినంగా మాట్లాడాను క్షమించమని పీటర్ జ్ఞానంబని అడుగుతాడు. మా ఆనవాయితీ ప్రకారం మా ఇంట్లో పెళ్లి జరిగితే నాన్ వెజ్ తో విందు ఏర్పాటు చేస్తామని పీటర్ చెప్తాడు.

Published at : 23 Sep 2022 10:48 AM (IST) Tags: Janaki Kalaganaledu Serial Today Episode Written Update Janaki Kalaganaledu Serial Janaki Kalaganaledu Serial Today Janaki Kalaganaledu September 23rd

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేషన్ - నేహా చౌదరి అవుట్?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Ravi Teja: రవితేజ 'ధమాకా' సినిమాలో కామెడీ స్కిట్స్ - హైపర్ ఆది రాశారా?

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Sonal Chauhan Interview : నాగార్జునతో మాట్లాడాక ఆయనదీ నా వయసే అని...

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

Prabhas: ఫ్యాన్ మేడ్ వీడియో - ప్రభాస్ ఎమోషన్ ని టచ్ చేశారు!

టాప్ స్టోరీస్

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Chittoor Fire Accident: రేణిగుంటలో భారీ అగ్ని ప్రమాదం, ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురు మృతి - డాక్టర్ సజీవదహనం

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Pawan Politics : పవన్ లక్ష్యం అసెంబ్లీలో అడుగు పెట్టడమా  .. అధికారమా? పార్ట్‌టైమ్ పాలిటిక్స్‌తో సాధించేదేంటి ?

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Jinping House Arrest: షాకింగ్! గృహ నిర్బంధంలో చైనా అధ్యక్షుడు- సైన్యం చేతిలోకి దేశం!

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ

Bathukamma 2022 : తెలంగాణలో బతుకమ్మ వేడుకలు షురూ, నేడు ఎంగిలి పూల బతుకమ్మ