Jabardasth Prasad Health: నడవలేని స్థితిలో ‘జబర్దస్త్’ పంచ్ ప్రసాద్, గుండె బరువెక్కిస్తున్న వీడియో
ఎప్పుడూ కామెడీ షో లు చేస్తూ అందరికీ వినోదాన్ని పంచే పంచ్ ప్రసాద్ ను గత కొంత కాలం గా కిడ్నీ సంబంధిత సమస్య వేధిస్తూ ఉంది. అయినా సరే ప్రోగ్రాం లలో యాక్టివ్ గా ఉంటూ కామెడీ చేస్తున్నాడు.
జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ కామెడీ షో లు చూసే వారికి పంచ్ ప్రసాద్ గురించి తెలిసే ఉంటుంది. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, గెటప్ శ్రీను లాంటి కమెడియన్ లకు కూడా తన స్టైల్ లో పంచ్ లు వేస్తూ అందర్నీ ఆకట్టుకున్నాడు ప్రసాద్. ఆయన వేసే పంచులకు ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఎప్పుడూ కామెడీ షోలు చేస్తూ అందరికీ వినోదాన్ని పంచే పంచ్ ప్రసాద్ ను గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్య వేధిస్తూ ఉంది. అయినా సరే ప్రోగ్రాంలలో యాక్టివ్ గా ఉంటూ కామెడీ చేస్తున్నాడు. ప్రసాద్ ప్రతి వారం డయాలసిస్ చేయించుకుంటాడు. ఆ నొప్పిని కూడా బయటకు తెలియకుండా నలుగురిని నవ్వించడం పంచ్ ప్రసాద్ ప్రత్యేకత.
పంచ్ ప్రసాద్ కు ఇప్పుడు మళ్లీ కిడ్నీ ల సమస్య ఎక్కువైంది. దీనివల్ల ఏకంగా నడవలేని స్థితి కి వెళ్ళిపోయాడు. ఎంతలా అంటే తన పనులు కూడా తాను చేసుకోలేని దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ప్రసాద్. ప్రస్తుతం ఆయన్ను ఆయన భార్యే దగ్గరుండి చూసుకుంటోంది. జబర్దస్త్ కమెడియన్ నూకరాజు, అసియా ఇటీవల పంచ్ ప్రసాద్ ఇంటికి వెళ్లారు. యుట్యూబ్ ఛానెల్ ద్వారా ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో వీడియోలో వివరించారు. పంచ్ ప్రసాద్ అనారోగ్యం గురించి ఎవరికీ తెలియలేదు. ఇప్పుడు నూకరాజు వీడియో తీసి దాన్ని యుట్యూబ్ లో అప్లోడ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వీడియోలో ప్రసాద్ భార్య చెప్పిన వివరాల ప్రకారం.. ఇటీవల షూటింగ్ నుంచి ఇంటికి వచ్చిన ప్రసాద్.. జ్వరం, నడుము నొప్పితో చాలా బాధపడ్డాడని తెలిపారు. నడవడానికి కూడా ఇబ్బంది పడ్డాడని చెప్పారు. ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ లకు చూపించినా.. అలా ఎందుకు జరిగిందో చెప్పలేకపోయారని, పరీక్షలు చేసిన తర్వాత నడుము వెనుక వైపు కుడికాలి వరకు చీము పట్టేసినట్లు తెలిసిందని ప్రసాద్ భార్య తెలిపారు.
ప్రసాద్ కి ఇష్టం లేకపోయినా సరే ఈ మొత్తాన్ని షూట్ చేసి యూట్యూబ్ ఛానెల్ లో అప్లోడ్ చేసినట్లు నూకరాజు చెప్పాడు. రెండు కిడ్నీలు పాడైపోవడంతో కాళ్ళు వాచిపోయి నడవలేని స్థితిలో ప్రసాద్ ఉన్నాడని, పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నామని అన్నాడు. అభిమానులు కూడా ప్రసాద్ కి సపోర్ట్ చేయాలని కోరాడు. గతంలో కూడా ప్రసాద్ కి ఈ సమస్య రావడంతో తోటి జబర్దస్త్ ఆర్టిస్ట్ లు ప్రసాద్ కు సాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి మరీ దారుణంగా మారడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదేమైనా ఎప్పుడూ నవ్వుతూ తన పంచ్ లతో అందరినీ నవ్వించే పంచ్ ప్రసాద్ కు ఇలా జరగడం బాధాకరమనే చెప్పాలి. ఈ వీడియో చూస్తున్న అభిమానులు ప్రసాద్ అన్నా త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అందరూ కోరుకుంటున్నట్టుగానే పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకొని మళ్ళీ కామెడీ షో లలో పాల్గొని అందర్నీ నవ్విస్తూ ఉండాలని ఆశిద్దాం.
Read Also: అందం, అభినయమే కాదు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ నయనతార, 39వ వసంతంలోకి లేడీ సూపర్ స్టార్!