Buchi Babu Sana: 'పుష్ప2'లో బుచ్చిబాబు ఇన్వాల్వ్మెంట్ - అంత లేదంటున్న దర్శకుడు!
'ఉప్పెన' సినిమా తరువాత ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. ఎన్టీఆర్ కి నేరేషన్ కూడా ఇచ్చారు.
దర్శకుడు సుకుమార్(Sukumar), బుచ్చిబాబు సానా(Buchi Babu Sana) కూర్చొని కథ డిస్కషన్స్ చేస్తున్నట్లుగా ఓ ఫొటో బయటకొచ్చింది. ఇది చూసిన వారంతా.. 'పుష్ప2'(Pushpa2) స్క్రిప్ట్ విషయంలో సుకుమార్.. బుచ్చిబాబు హెల్ప్ తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు స్వయంగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టారు.
Is Buchi Babu Getting Involved In Pushpa 2: ''ఈ ఫొటో నేను తరువాత చేయబోయే నాసినిమా కథ డిస్కషన్ సందర్భంలోది. మా గురువు గారు సుకుమార్ సార్ నా కోసం నా సినిమా కథ కోసం హెల్ప్ చేయడానికి వచ్చారు. సుకుమార్ సార్ సినిమా కథలో కూర్చుని డిస్కషన్ చేసేంత స్థాయి నాకు లేదు.. రాదు. ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప, ఆయనకి ఇచ్చేంత లేదు'' అంటూ రాసుకొచ్చారు. దీంతో 'పుష్ప2' స్క్రిప్ట్ విషయంలో బుచ్చిబాబు ప్రమేయం లేదని తెలుస్తోంది.
'ఉప్పెన' సినిమా తరువాత ఎన్టీఆర్(NTR) తో ఓ సినిమా చేయాలనుకున్నారు బుచ్చిబాబు. ఎన్టీఆర్ కి నేరేషన్ కూడా ఇచ్చారు. కానీ ఇంకా స్క్రిప్ట్ లాక్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ విషయంలో ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ గా లేకపోవడంతో బుచ్చిబాబు దానిపై వర్క్ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్ లో హెల్ప్ చేయమనే బుచ్చిబాబు.. తన గురువు సుకుమార్ ని అడిగినట్లు తెలుస్తోంది. సుకుమార్ రంగంలోకి దిగారు కాబట్టి ఎన్టీఆర్ స్క్రిప్ట్ లాక్ అయ్యే ఛాన్స్ ఉంది. కొరటాల శివతో ఎన్టీఆర్ సినిమా పూర్తయిన తరువాత బుచ్చిబాబుతో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read : రెమ్యూనరేషన్ తగ్గించుకోవడానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ రెడీ!
Also Read : 'F3'లో ఓవర్ యాక్షన్ చేశారు, 'అంటే సుందరానికీ' సాగదీశారు - తమ్మారెడ్డి కామెంట్స్
ఈ photo నేను తరువాత చేయబోయే నాసినిమాకథ Discussion సందర్భంలోది మాగురువుగారు@aryasukku సుకుమార్ Sir నా కోసం నా సినిమా కథ కోసం Help చేయడానికి వచ్చారు. సుకుమార్ Sir సినిమా కథలో కూర్చుని Discussion చేసేంత స్థాయి నాకు లేదు రాదు.ఆయన నుంచి నేర్చుకోవడం తీసుకోవడమే తప్ప , ఆయనకి ఇచ్చేంత లేదు pic.twitter.com/KN7qmbLg6X
— BuchiBabuSana (@BuchiBabuSana) July 28, 2022