News
News
X

Tammareddy Bharadwaj Comments: 'F3'లో ఓవర్ యాక్షన్ చేశారు, 'అంటే సుందరానికీ' సాగదీశారు - తమ్మారెడ్డి కామెంట్స్

Tammareddy Bharadwaj Sensational Comments On F3 Movie and Ante Sundaraniki Movies: 'ఎఫ్ 3', 'అంటే సుందరానికీ' సినిమాలపై ప్రముఖ దర్శక - నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

FOLLOW US: 

ఎటువంటి మొహమాటం లేకుండా నర్మగర్భంగా మనసులో మాట చెప్పే తెలుగు చలన చిత్ర ప్రముఖులలో తమ్మారెడ్డి భరద్వాజ (Bharadwaj Tammareddy) ఒకరు. సూటిగా, కుండ బద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాన్ని చెబుతారు. లేటెస్టుగా సొంత యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేసిన వీడియోలో 'ఎఫ్ 3', 'అంటే సుందరానికీ' సినిమాలపై ఆయన షాకింగ్ కామెంట్స్ చేశారు.
    
Tammareddy Bharadwaj on F3, Ante Sundaraniki : విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, సునీల్, మురళీ శర్మ, ప్రగతి, అన్నపూర్ణమ్మ, వై విజయ వంటి భారీ తారాగణంతో 'ఎఫ్ 3' రూపొందింది. ఈ సినిమా ఏవరేజ్ అని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. అంత భారీ తారాగణం ఉన్నందుకు సినిమా మినిమమ్ 100 కోట్లు కలెక్ట్ చేయాలని, రూ. 50 - రూ. 60 కోట్లు చేసిందని ఆయన అన్నారు. జంధ్యాల గారు, బాలచందర్ గారు పరిశ్రమకు రాక ముందు తెలుగులో గానీ, తమిళంలో గానీ కామెడీ విషయంలో కొంచెం ఓవర్ చేసేవారని, ఓవర్ యాక్టింగ్ చేసేవారని... 'ఎఫ్ 3'లో అటువంటి ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించిందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. కథ కూడా కొత్తది కాదని, నాలుగైదు సినిమాలు వచ్చాయన్నారు. స్క్రిప్ట్ విషయంలో కూడా క‌న్‌ఫ్యూజ‌న్‌ కనిపించిందని అన్నారు. కంగారుగా తీయడం వల్ల ఏవరేజ్ అయ్యిందన్నారు. లేదంటే వంద, రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందన్నారు. 

Reasons For Ante Sundaraniki Flop : 'అంటే సుందరానికీ' టాక్ బావున్నప్పటికీ... రెవెన్యూ రాలేదని తమ్మారెడ్డి తెలిపారు. కామెడీగా తీద్దామనుకున్నారో? లేదంటే సీరియస్‌గా తీద్దామనుకున్నారో? తనకు అర్థం కాలేదన్నారు. సినిమా సాగదీశారన్నారు. ప్రేక్షకులకు అది అర్థం అవుతుందని తెలిసి, నటుడు హర్ష చేత పతాక సన్నివేశాల్లో డైలాగ్ చూపించారన్నారు. సాధారణ కథను సాగదీసి, క‌న్‌ఫ్యూజ్‌ చేశారన్నారు. నాని లాంటి హీరో సినిమా రూ. 20 - 25 కోట్ల కంటే బిజినెస్ అవ్వదని తెలిసినప్పుడు రూ. 30 - 40 కోట్లు పెట్టి సినిమాలు ఎలా తీస్తున్నారో అర్థం కావడం లేదని తమ్మారెడ్డి ప్రశ్నించారు. నష్టాలు వస్తే ఎలా? అని మరో ప్రశ్న సాధించారు. ఒకవేళ బావుండి కలెక్షన్స్ వస్తే సంతోషం అన్నారు.

Also Read : ఆగస్టులో మహేష్ బాబు సినిమా సెట్స్ మీదకు వెళుతుందా? లేదా?

హీరోలు డేట్స్ ఇస్తే చాలు, వాళ్ళు ఒప్పుకొన్న కథలు చేస్తే చాలని నిర్మాతలు అనుకోవడం వల్ల సరైన సినిమాలు రావడం లేదని తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ చేశారు. ప్రేక్షకుడి కోసం ఆలోచించడం లేదని... థియేటర్లు వదిలేసి, ఓటీటీ - శాటిలైట్ కోసం ఆలోచించడం వల్ల ఫలితాలు బాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. హీరోలు, శాటిలైట్, ఓటీటీ కోసం సినిమాలు తీయకూడదని... థియేటర్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయాలన్నారు. 

Also Read : నేను వైఎస్సార్ అభిమానినే కానీ కమ్మ, కాపులను తిట్టలేదు - నితిన్ దర్శకుడు

Published at : 27 Jul 2022 01:59 PM (IST) Tags: F3 movie Tammareddy Bharadwaj Ante Sundariniki Movie Tammareddy On F3 Ante Sundariniki

సంబంధిత కథనాలు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Raju Srivastava Heart Attack : ఫేమస్ కమెడియన్ రాజు శ్రీవాత్సవకు హార్ట్ ఎటాక్ 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా 

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!

Bihar New CM: టీమ్ మారింది, కానీ కెప్టెన్ ఆయనే- బిహార్‌ సీఎంగా 8వ సారి నితీశ్ కుమార్ ప్రమాణం!