News
News
X

Intinti Gruhalakshmi July 2nd: ఇంటింటి గృహలక్ష్మి జులై 2 - తులసి స్కెచ్, రోడ్డు మీద పరుగులు పెట్టిన లాస్య, భాగ్య

తన దగ్గర నుంచి కాజేసిన రూ.20 లక్షలని ఎలాగైనా తిరిగి తీసుకోవాలని తులసి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగా లాస్య , భాగ్యలను రోడ్డు మీద పరుగులు పెట్టించిందో నేటి ఎపిసోడ్ లో చూద్దాం.

FOLLOW US: 

బ్యాంక్ బ్రోకర్ గురించి సమాచారం ఇవ్వడానికి ఎవరో వ్యక్తి ఫోన్ చేసినట్టు దివ్య తన తల్లికి  ఫోన్ ఇస్తుంది. ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని భాగ్య తెగ ఉబలాటపడుతుంది కానీ దివ్య వాళ్ళు చెప్పకుండా ఉడికిస్తారు. పక్కకి వెళ్ళిన  తులసి భాగ్యకి వినపడేలాగా కావాలనే గట్టిగా మాట్లాడుతుంది. తులసి ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలని భాగ్య చాటుగా వినేందుకు ప్రయత్నిస్తుంది. బ్యాంక్ బ్రోకర్ ఎక్కడ ఉన్నాడో తెలిసినట్టు తులసి బిల్డప్ కొడుతుంది. ఇదంతా చాటుగా విన్న భాగ్య ఈ విషయాన్ని ఎలాగైనా లాస్యకి చెప్పాలని అనుకుంటుంది. వెంటనే భాగ్య లాస్యకి ఫోన్ చేస్తుంది. 

తులసికి మన పిలక దొరికిపోయింది. రంజిత్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోయింది. తులసక్క మనుషులు ఆ రంజిత్ ని చొక్కపట్టుకుని లాక్కొస్తారు. వాడు మన పేర్లు చెప్పేస్తాడు అంటూ లాస్యని భయపెట్టేస్తుంది. పోలీసులు మన చేతులకి బేడీలు వేసి అరెస్ట్ చేస్తారంటూ ఏడుస్తుంది భాగ్య. ఆ మాటలన్నీ తులసి అండ్ కో బ్యాచ్ వింటూ ఉంటారు. తులసి కంటే ముందే మనం వెళ్ళి రంజిత్‌ను పట్టుకుందామని లాస్యకు చెప్తుంది. లాస్య టెన్షన్ పడుతుంటే ఏమైందని అడుగుతాడు. ఏదో ఆఫీసు విషయం అని లాస్య కవర్ చేస్తుంది. ఇక సీన్ కట్ చేస్తే తులసిని దివ్య, అంకిత తెగ పొగిడేస్తారు. 

మావయ్యకి మందులు ఇవ్వాలని తులసి ఇంట్లోకి వెళ్తుండగా మ్యూజిక్ లవర్స్ కోసం పాటల పోటీ పెడుతున్నారని పేపర్తో పాటు వచ్చిన పాంప్లేట్ తులసి కంట పడుతుంది. అది చూసి వెంటనే శ్రుతికి కాల్ చేసి చెప్తుంది. ప్రేమ్ అందులో పాల్గొని గెలిస్తే ఆల్బమ్ కి కావలసిన డబ్బు వస్తుందని అంటుంది. సరే ప్రేమ్ కి చెప్తానని శృతి అంటుంది. ఇక ప్రేమ్ పని చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ప్రేమ్ కి ఒక ఆఫర్ ఇస్తాడు. సబ్ ట్రాక్ కోసం గిటార్ ప్లే చేయాలని అంటాడు. కానీ ప్రేమ్ అంతగా ఇంటరెస్ట్ చూపించకపోవడం గమనించిన  డైరెక్టర్ అనుభవం ఇలాగే వస్తుందని నచ్చచెబుతాడు. అందుకోసం గిటార్ ప్లే చేయమని చెప్తాడు. ప్రేమ్ సరిగా ప్లే చేయకపోవడంతో డైరెక్టర్ కొప్పడతాడు. దీంతో ప్రేమ్ బాధగా బయటకి వెళ్ళిపోతాడు. 

సీన్ కట్ చేస్తే లాస్య, భాగ్య రంజిత్ కోసమని బైక్ మీద వెళ్తుంటారు. వాళ్ళని తులసి, దివ్య, అంకిత ఆటోలో ఫాలో చేస్తారు. సడన్‌‌గా లాస్య వల్ల బైక్ ఆగిపోతుంది. ఇంత తిప్పలు పడే బదులు బావగారి కారు తీసుకురావొచ్చుగా అని భాగ్య అంటుంది. అప్పుడు నందు ఎక్కడికి, ఏమిటి అని అడిగితే ఏం చెప్పాలి అని లాస్య తిడుతుంది. బైక్ చేడిపోవడంతో లాస్య భాగ్య చేసేది ఏమి లేక తులసి కంటే ముందే మనం వెళ్ళి రంజిత్ ని తప్పించాలి అనుకుంటారు. వాడు ఉండేది దగ్గరేగా.. పరిగెత్తుకుంటూ వెళ్దాం అని లాస్య చెప్పడంతో భాగ్య బిక్క మొఖం వేస్తుంది. ఇద్దరు రోడ్డు మీద పరుగులు పెడుతుండటం కామిడీగా ఉంటుంది. అక్కడితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.  

తరువాయి భాగంలో.... 
భాగ్య, లాస్య ఒక ఇంట్లోకి వెళ్ళగానే అక్కడికి తులసి వాళ్ళు వస్తారు. వాళ్ళని చూసి లాస్య షాక్ అవుతుంది. రంజిత్ ఇప్పుడు తన దగ్గరే ఉన్నాడని, జరిగిందంత చెప్పాడని తులసి లాస్యని బెదిరిస్తుంది. నీ నందు ముందు నేను నోరు విప్పకుండా ఉండాలంటే 24 గంటల్లోపు నా అకౌంటు లో రూ.20 లక్షలు ఉండాలని తులసి డిమాండ్ చేస్తుంది.   

Published at : 02 Jul 2022 09:35 AM (IST) Tags: Telugu Serial kasthuri Intinti Gruhalakshmi Today Episode Intinti Gruhalakshmi July 2nd Episode Intinti Gruhalakshmi 674 Episode

సంబంధిత కథనాలు

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

Venkatesh: దేవుడిగా వెంకీ - విశ్వక్ సేన్ సినిమాకి బజ్ వస్తుందా?

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

SitaRamam: 'సీతారామం' కథ ఫస్ట్ విజయ్ దేవరకొండకి చెప్పా - హను రాఘవపూడి కామెంట్స్!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Rana-Miheeka: రానా మ్యారీడ్ లైఫ్‌పై రూమర్స్ - క్లారిటీ ఇచ్చిన అతడి భార్య!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Prabhas: 'సీతారామం' ఎఫెక్ట్ - ప్రభాస్ డైరెక్టర్‌ను టార్గెట్ చేసిన ఫ్యాన్స్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

Bimbisara: 'బింబిసార' రేర్ ఫీట్ - మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్!

టాప్ స్టోరీస్

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

కేవలం 12 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ - రియల్‌మీ కొత్త ఫోన్ లాంచ్‌కు రెడీ!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

రాఖీకి మీ సోదరికి మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా - అయితే ఈ ఆప్షన్లపై ఓ లుక్కేయండి!

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

Monkeypox: మంకీపాక్స్ వైరస్ రెండు కొత్త లక్షణాలు ఇవే, కనుగొన్న కొత్త అధ్యయనం

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?

108కు కాల్ చేయడానికి భయమెందుకు? ఈ రోజు ఎవరో, రేపు మీకే ఆ సమస్య వస్తే? ఈ రూల్స్ తెలుసా?