అన్వేషించండి
Advertisement
Shiva Shankar Master: నడవలేడనుకున్న మనిషి.. కొరియోగ్రాఫర్ గా మారి..
శివశంకర్ మాస్టర్ కి చిన్నప్పుడు ప్రమాదం జరగడంతో ఆయన ఇంక లేచి నిలబడరేమోనని అంతా అనుకున్నారు. కానీ ఈరోజు కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేసి అవార్డులను సైతం అందుకున్నారు.
కరోనా వైరస్ చాలా మంది ప్రాణాలను బలితీసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ఎందరో మహానుభావులు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఇప్పుడు కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కూడా కరోనాతో పోరాడుతూ.. కన్నుమూశారు. హాస్పిట లో ట్రీట్మెంట్ పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1948 డిసెంబర్ 7న చెన్నైలో కల్యాణ సుందర్, కోమల అమ్మాళ్ దంపతులకు జన్మించారు శివశంకర్ మాస్టర్. ఆయన తండ్రి పండ్ల వ్యాపారం చేసేవారు. అయితే చిన్నతనంలో శివశంకర్ మాస్టర్ కి ఓ ప్రమాదం జరిగింది. ఆయన ఇంక లేచి నిలబడరేమోనని అంతా అనుకున్నారు.
కానీ ఈరోజు కొరియోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పని చేసి అవార్డులను సైతం అందుకున్నారు. శివశంకర్ మాస్టర్ కి ఏడాదిన్నర వయసు ఉండగా.. అతడి పెద్దమ్మ ఒళ్లో కూర్చోబెట్టుకొని ఆరు బయట ఉండగా.. అదే సమయంలో ఓ ఎద్దు తాడు తెంపుకొని రోడ్డుపైకి వచ్చిందట. అది తమ మీదకు ఎక్కడ వస్తుందోనని భయపడి ఆవిడ శివశంకర్ మాస్టర్ ను ఎత్తుకొని ఇంటిలోకి పరుగు తీసిందట. ఆ సమయంలో కాలు జారి పడ్డారు. ఆమెతో పాటు మాస్టర్ కూడా కిందపడిపోయారు. దీంతో ఆయన వెన్నెముకకు గాయమైంది. చాలా రోజులపాటు ఆయన జ్వరంతో బాధ పడుతుంటే.. తల్లితండ్రులు చూడలేక ఎన్నో హాస్పిటల్స్ కి తిప్పారట.
ఫైనల్ గా విదేశాల్లో చదువుకొని చెన్నై వచ్చిన నరసింహ అయ్యర్ అనే డాక్టర్ దగ్గరకి శివశంకర్ మాస్టర్ ని తీసుకెళ్లగా.. ఆయన పరీక్ష చేసే వెన్నెముక విరిగిపోయిందని చెప్పారు. దీంతో తల్లిదండ్రుల ఆందోళన మరింత ఎక్కువైంది. అప్పుడు ఆ డాక్టర్ శివ శంకర్ ను తన దగ్గరే వదిలేస్తే.. లేచి నడిచేలా చేస్తానని హామీ ఇచ్చారట. దీంతో డాక్టర్ దగ్గరే శివశంకర్ ని వదిలి వెళ్లిపోయారట. ఆ తరువాత దాదాపు ఎనిమిదేళ్లపాటు శివశంకర్ పడుకొనే ఉండేవారట. మెల్లగా గాయం నుంచి కోలుకున్నారు.
Also Read: కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ ఇకలేరు..
Also Read: బాలకృష్ణకు గాయం అవ్వడానికి కారణం ఏంటో చెప్పిన బోయపాటి శ్రీను! 'జై బాలయ్య' సాంగ్ తీసేటప్పుడు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ఆంధ్రప్రదేశ్
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion