Icon Movie Update: స్టైలిష్ స్టార్‌తో బేబమ్మ, బుట్టబొమ్మ..పుష్ప తర్వాత సెట్స్ పైకి వెళ్లనున్న ‘ఐకాన్’
పుష్ప సినిమాతో బిజీగా ఉన్న స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ నెక్ట్స్ ప్రాజెక్ట్ `ఐకాన్`. ఈ సినిమాలో అమ్మూ, బేబమ్మ బన్నీతో రొమాన్స్ చేయబోతున్నారు.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో `ఐకాన్` మూవీ తెరకెక్కనుంది. ప్రస్తుతం బన్నీ `పుష్ప` చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగ్ పూర్తైన వెంటనే ‘ఐకాన్’కి డేట్స్ కేటాయించనున్నాడు. వాస్తవానికి పుష్పకన్నా ముందుగానే ‘ఐకాన్’ సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ సుకుమార్ జోరుతో ముందుగా పుష్ప సెట్స్ పైకి వెళ్లింది. దీంతో వేణు శ్రీరామ్ కొన్నిరోజులు ఆగక తప్పలేదు. ఇంతలో వకీల్ సాబ్ సినిమాతో వేణుశ్రీరామ్ సక్సెస్ అందుకోవడంతో అల్లు అర్జున్ కి, ప్రేక్షకులకి కూడా వేణుపై మరింత నమ్మకం పెరిగింది. ఇప్పుడా నమ్మకంతోనే వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో పడ్డారు.
#KrithiShetty and #PoojaHegde are the front runners for playing female lead in #AlluArjun's upcoming film #ICON. pic.twitter.com/ekWlAd1ORN
— Manobala Vijayabalan (@ManobalaV) September 7, 2021
ఇప్పటికే దర్శకుడు వేణు ప్రీ ప్రొడక్షన్ పూర్తి చేస్తూనే నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా హీరోయిన్స్ గా ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి, బుట్టబొమ్మ పూజాహెగ్డే ఫైనల్ అయ్యారు. ఈ మధ్యనే వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరెకక్కిన ‘ఉప్పెన’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందం, నటనతో మెప్పించిన కృతి.. వరుస ఆఫర్లు అందుకుంటోంది. ఏకంగా బన్నీతో ‘ఐకాన్’లో నటించే ఛాన్స్ కొట్టేసింది.
Also read: ‘చెత్త’ నామినేషన్లు.. పాయిఖానాలు, చిప్పలు కడుగుతా కానీ.. ప్రియ, రవిలపై లోబో ఫైర్!
ఇక అల్లు అర్జున్ సాధారణంగా ఓ హీరోయిన్‌తో రెండోసారి కలసి నటించడం జరగలేదు. ఇప్పటి వరకూ సమంత, కాజల్ అగర్వాల్, శ్రుతి హాసన్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్స్‌తో బన్నీ మరోసారి నటించలేదు. అలాంటిది పూజాతో ఏకంగా మూడోసారి నటించడం హాట్ టాపిక్ అవుతోంది. తొలిసారి `దువ్వాడ జగన్నాథం`లో నటించిన ఈ జోడీ.. `అల వైకుంఠపురములో` మరోసారి కలసి పనిచేశారు. తాజాగా వేణుశ్రీరామ్ సినిమాలోనూ పూజాని హీరోయిన్‌గా తీసుకోవడంతో ముచ్చటగా మూడోసారి ఆన్ స్క్రీన్ పై ఈ జోడీని చూడబోతున్నారు ప్రేక్షకులు.
Also Read: విరిసిన గులాబీలా కనిపిస్తోన్న అమలాపాల్
Also Read: వైరల్ అవుతున్న రాశీఖన్నా బ్యాక్ లెస్ అందాలు
ALso Reda:టోపీ పెట్టిన వకీల్ సాబ్ బ్యూటీ..వైరల్ అవుతున్న పిక్స్
Also read: సరయు vs సన్నీ.. మళ్లీ మళ్లీ తప్పులు చేస్తానంటూ హీట్ పెంచిన భామ, నామినేషన్లలో రచ్చ!