News
News
X

Bigg Boss Telugu Season 5: సరయు vs సన్నీ.. మళ్లీ మళ్లీ తప్పులు చేస్తానంటూ హీట్ పెంచిన భామ, నామినేషన్లలో రచ్చ!

ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది బిగ్ బాస్. ఆ మర్నాడే నామినేషన్ల ప్రక్రియ జరిగింది. ఇంకేముంది రచ్చ ఇక్కడి నుంచే మొదలు.

FOLLOW US: 
 
ఇంకా హౌజ్ లో అడుగుపెట్టామన్న ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే నామినేషన్ల హడావుడి మొదలైంది. వచ్చిన 24 గంటల్లో ఎవరేంటో ఎలా తెలుస్తుంది. తప్పదని కొందరు, తనతో కలవలేదని ఇంకొందరు, పలకరింపు బాలేదని మరికొందరు, సెటైర్స్ వేస్తున్నారని ఇంకొందరు ఇలా రకరకాల కారణాలతో నామినేట్ చేసుకున్నారు. హౌస్‌లో ఉన్న 19 మంది ఫొటోలతో చెత్త కవర్లను పెట్టిన బిగ్ బాస్... నామినేట్ చేయాలనుకున్న వారి కవర్ ను చెత్త తొట్టెలో వేయాలని చెప్పాడు. దీంతో కంటెస్టెంట్స్‌లు రకరకాల కారణాలతో ఒకర్నొకరు నామినేట్ చేసుకుని కవర్లను చెత్తతొట్టెలో పడేశారు.

వాస్తవానికి నామినేషన్ల సమయంలోనే మినీ వార్ ప్రారంభమైపోయింది. సన్నీ-సరయు-షణ్ముక్ మధ్య మాటల యుద్ధం జరిగింది. హౌస్ లోకి అడుగుపెట్టగానే టాస్కుల గురించి చెప్పడం నచ్చలేదని..తనకెవరూ చెప్పడం ఇష్టం ఉండదని షణ్ముక్ సన్నీని నామినేట్ చేశాడు. దానికి కౌంటర్ ఇచ్చిన సన్నీ..ఇప్పుడే కదా తెలిసింది ఇట్స్ ఓకే అన్నాడు. పైగా సింగిల్ బెడ్ కోసం అని తెలిసి లైట్ తీసుకున్నా అని షణ్ముక్  అనడంతో అది సింగిల్ బెడ్ అనేది ముఖ్యం కాదు టాస్క్ అని గుర్తుపెట్టుకోవాలన్నాడు. అదే సమయంలో సైన్యం, యుద్దం అంటూ పెద్ద పెద్ద డైలాగ్సే చెప్పాడు.  ‘మనం ఏం చేసినా సైన్యం ఉందని అనుకుంటాం కానీ.. ఇక్కడకి వచ్చిన తరువాత ప్రతి ఒక్కరికీ ఓ సైన్యం ఉంటుంది’ అని అన్నాడు. ‘ఏమో నాకైతే ఆ ఫీలింగ్ లేదు’ అని షణ్ముక్ అనడంతో..షణ్ముక్ ఫొటో ఉన్న కవర్‌ని చెత్త తొట్టెలో విసిరి కొట్టాడు సన్నీ.

Also Read:తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు... ప్రధాన నగరాల్లో ధరలు ఇలా

అంతకుముందు సరయుని నామినేట్ చేసిన సన్నీ.. సరయు తనని పిలిచే విధానం నచ్చలేదనడంతో ఆమె రియాక్టైంది. ఒకసారి చెబితే అర్థం చేసుకోవాలి కానీ మళ్లీ మళ్లీ తనని నచ్చని విధంగా పిలవడం సరికాదన్నాడు సన్నీ. అయితే ఒకసారి తప్పుచేస్తా మరోసారి కూడా తప్పుచేస్తా నేను మనిషిని అంది సరయు. మీరు ఏ మనిషో నాకు తెలియదన్న సన్నీ ఒకసారి చెప్పిన తర్వాత మరోసారి చేయరని అన్నాడు. మళ్లీ సరయు జ్ఞాని, దేవుడు అని మాట్లాడడంతో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా అంటూ కవర్ చెత్తబుట్టలోకి విసిరికొట్టాడు. మొత్తానికి మొదటివారం నామినేషన్ల ప్రక్రియలో సన్నీ-సరయు-షణ్ముక్ మధ్య వివాదం రేగింది. మరి మళ్లీ హౌజ్ లో మామూలుగా ఉంటారో వీళ్లు చేరో గ్రూప్ సభ్యుల్లా తయారవుతారో చూడాలి. ఏదేమైనా ఈ వారం నామినేషన్లలో యాంకర్ రవి, సీరియల్ నటుడు మానస్,  సరయు, ఆర్జే కాజల్, హమీద, జెస్సీ ఉన్నారు. మరి ఉండేదెవరో..వెళ్లేదెవరో వెయిట్ అండ్ సీ..

News Reels

Also Read: తెలుగు రాష్ట్రాల్లో వానలే.. వానలు.. మరో రెండు రోజులు కూడా.. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్

Also Read: భీమ్లానాయక్, హరిహరవీరమల్లు.. ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ మూవీ టైటిల్స్ మామూలుగా లేవుగా!

Also read: డైరెక్టర్ శంకర్ కుమార్తె అదితిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్న సూర్య.. హీరో ఎవరో తెలుసా..!

Also read: ఏం గుర్తుపెట్టుకుంటాలేం అని ముఖ్యమైన సమాచారం మొత్తం మెయిల్, ఫోన్లలో భద్రపరుస్తున్నారా.. అయితే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే..!

Published at : 07 Sep 2021 08:00 AM (IST) Tags: Bigg Boss 5 Telugu Bigg Boss 5 anchor ravi Sarayu Hamida manas Jessie Shanmukh RJ Kajal Sunny

సంబంధిత కథనాలు

Freddy Review: ఓటీటీలో కొత్త సైకో కిల్లర్ - ‘ఫ్రెడ్డీ’ థ్రిల్స్ ఆకట్టుకుంటాయా?

Freddy Review: ఓటీటీలో కొత్త సైకో కిల్లర్ - ‘ఫ్రెడ్డీ’ థ్రిల్స్ ఆకట్టుకుంటాయా?

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Guppedantha Manasu December 2nd Update: అర్థరాత్రి వసుతో రిషి రొమాంటిక్ జర్నీ, సమాధానం చెప్పలేక తలొంచుకున్న గౌతమ్

Guppedantha Manasu December 2nd Update:  అర్థరాత్రి వసుతో రిషి రొమాంటిక్ జర్నీ, సమాధానం చెప్పలేక తలొంచుకున్న గౌతమ్

Janaki Kalaganaledu December 2nd: రామా, జానకి రొమాంటిక్ మూమెంట్- కోడలిని చూసి మురిసిన భానుమతి

Janaki Kalaganaledu December 2nd: రామా, జానకి రొమాంటిక్ మూమెంట్- కోడలిని చూసి మురిసిన భానుమతి

Karthika Deepam December 2nd Update: హమ్మయ్య దీప-కార్తీక్ కలసిపోయారు, సౌందర్య ఇంట్లో కోడలిగా మోనిత బిల్డప్

Karthika Deepam December 2nd Update: హమ్మయ్య దీప-కార్తీక్ కలసిపోయారు, సౌందర్య ఇంట్లో కోడలిగా మోనిత బిల్డప్

టాప్ స్టోరీస్

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

Gummanuru Jayaram: ఏపీ మంత్రి భార్యకు ఐటీ నోటీసులు! అవి ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడిదని ప్రశ్నలు - మంత్రి క్లారిటీ

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు

IT Raids In Telangana: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి నివాసం, ఆఫీసుల్లో ఐటీ రైడ్స్‌- సీన్‌లో 50 బృందాలు

Bhopal viral video: పెళ్లిలో భోజనం చేశాడని MBA విద్యార్థితో గిన్నెలు కడిగించారు!

Bhopal viral video: పెళ్లిలో భోజనం చేశాడని MBA విద్యార్థితో గిన్నెలు కడిగించారు!

Hurun India 500: అంబానీ ఫస్ట్‌, అదానీ లాస్ట్‌ - అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌

Hurun India 500: అంబానీ ఫస్ట్‌, అదానీ లాస్ట్‌ - అత్యంత విలువైన కంపెనీ రిలయన్స్‌