Bhavadeeyudu Bhagat Singh: భీమ్లానాయక్, హరిహరవీరమల్లు.. ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’.. పవన్ మూవీ టైటిల్స్ మామూలుగా లేవుగా!
వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..తన ప్రాజెక్టుల అప్ డేట్స్ తో అభిమానుల్ని అలరిస్తున్నాడు. తాజాగా పవన్-హరీశ్ శంకర్ మూవీ టైటిల్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్బంగా కొత్త ప్రాజెక్ట్ కి సంబంధంచి హరీశ్ శంకర్ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ బైక్ పై కూర్చుని బ్యారెల్ గన్‌ను లోడ్ చేస్తున్న ప్రీ లుక్‌ను విడుదల చేశారు. ఈ లుక్‌లో ఫుల్లీ లోడెడ్ అంటూ మరోసారి ఎంటర్‌టైన్మెంట్‌కు సిద్ధంగా ఉండండి అంటూ హరీష్ శంకర్ పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ‘భవదీయుడు భగత్ సింగ్’ అని చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే పవన్-హరీశ్ కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఏ రేంజ్‌లో హిట్టైందో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ ఆ మానియా కొనసాగుతూనే ఉంది. ‘‘నాక్కొంచెం తిక్కుంది.. దానికో లెక్కుంది’’ అనే డైలాగ్స్ మారుమోగుతూనే ఉన్నాయి. పైగా ఈసారి ఫుల్లీ లోడెడ్ అనే ఫస్ట్ లుక్ పోస్టర్ క్యాప్షన్ చూసి మరోసారి మ్యాజిక్ రిపీట్ అని ఫిక్సైపోయారు పవన్ అభిమానులు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. టైటిల్ కూడా పవర్ ఫుల్‌గా ఉండాలనే ఉద్దేశంతో 'భవదీయుడు భగత్ సింగ్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఇందులో పవన్ డ్యుయెల్ రోల్ చేయనున్నాడని టాక్.
Also Read: బిగ్ బాస్ హౌస్‌లో నామినేషన్లు మొదలు.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమేనా?
పవర్ స్టార్ ఇమేజ్‌కు సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే రెగ్యులర్ గా పవన్ ప్రసంగాల్లో ఎక్కువగా భగత్ సింగ్ పేరు వినిపిస్తూ ఉంటుంది. గతంలో ’సంచారి’ అనే టైటిల్ మీద కూడా ప్రచారం జరిగింది. ఈ రెండింటిలో అభిమానులు ఎక్కువ ఓటేస్తున్నది మాత్రం ‘భవదీయుడు భగత్ సింగ్' అనే చెప్పాలి. అయితే ఇందులో భగత్ సింగ్ తీసేసి భవదీయుడు అని మాత్రమే ఉంచాలా…లేదా భగసింగ్‌తో కలపి ఉంచాలా అనే చర్చలు కూడా జరుగుతున్నాయట. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు.
ALso Read: ‘బిగ్ బాస్ 5’ అరుదైన రికార్డ్.. దేశంలో 2 స్థానంలో తెలుగు రియాల్టీ షో
ఇప్పటికే అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ భీమ్లానాయక్ లో నటిస్తున్నాడు. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో హరిహరవీరమల్లు సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇప్పుడు హరీశ్ శంకర్ మూవీ సందడి మొదలైంది. ఈ మూడు పూర్తయ్యాక సురేందర్ రెడ్డితో మూవీకి కమిటయ్యాడు.. . 'యథా కాలమ్.. తథా వ్యవహారమ్' అంటూ సంస్కృతంలోని లైన్స్ తో పవన్ పుట్టిన రోజున స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశాడు సురేందర్ రెడ్డి. ఈ నాలుగు సినిమాల తర్వాత మరో ఇద్దరు కొత్త దర్శకులకు ఛాన్సివ్వనున్నాడట పవర్ స్టార్.
Also read: బిగ్ బాస్ హౌస్‌లో 19 మంది కంటెస్టెంట్లు.. సరయు తిట్లకు నాగ్ ఫిదా!