News
News
X

Bigg Boss 5 Telugu: ‘బిగ్ బాస్ 5’ అరుదైన రికార్డ్.. దేశంలో 2 స్థానంలో తెలుగు రియాల్టీ షో

ఊరించి ఊరించి ప్రారంభమైన తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ట్రెండింగ్ లో ఉంది. ఏకంగా దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది ఈ తెలుగు రియాల్టీ షో.

FOLLOW US: 

బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న బిగ్ బాస్ రియాల్టీ షో సందడి మామూలుగా లేదు. అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైన షో నాగార్జున ఎంట్రీ నుంచి హౌస్ లో లైట్స్ ఆఫ్ చేసేవరకూ ఓ రేంజ్ లో సాగింది. మాస్,  క్లాస్,  ఓల్డ్ ఇలా అన్ని రకాల పాటల డాన్స్ లతో నాగ్ ఎంట్రీకి ఫిదా అయిపోయారు. ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన నాగ్ అక్కడ కాసేపు తిరుగుతూ ఇంటి వివరాలు వెల్లడించాడు. ఆ తర్వాత మళ్లీ స్టేజ్ పైకి వచ్చి కంటెస్టేంట్స్ ను ఆహ్వానించాడు. ఈ షోకు ఊహించని క్రేజ్ వచ్చింది. జాతీయ స్థాయిలో ఈ షో 2వ స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. అంటే మన తెలుగు కార్యక్రమం.. హిందీ షోలకు గట్టి పోటీ ఇస్తుందన్నమాట. ఈ నేపథ్యంలో ‘స్టార్ మా’కు టీఆర్పీ అమాంతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.  

షో విషయానికొస్తే మొదటి కంటెస్టెంట్‌గా పలు సినిమాల్లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన, యూట్యూబ్‌లో సందడి చేసే సిరి హన్మంతు. ఈమె హౌస్‌లో అడుగుపెట్టబోతోందని ఆరు నెలలుగా ప్రచారం జరుగుతున్నట్టే నిజమైంది. కొందరు పాటలతో ఎంట్రీ ఇస్తే మరికొందరు డాన్సులతో సందడి చేశారు. తమని తాము పరిచయం చేసుకుని మొత్తం 19 మంది కంటిస్టెంట్స్ లోపలకు అడుగుపెట్టారు. ‘బిగ్ బాస్’ హౌస్ అంటేనే టాస్కుల మయం. అయితే ఎంట్రీ ఇచ్చిన వెంటనే టాస్కులు పెట్టి కంటిస్టెంట్స్ , ఆడియన్స్ ఉత్సాహాన్ని నింపాడు బిగ్ బాస్. హౌస్ లో రెండు సింగిల్ బెడ్స్‌ను లాక్ చేసిన బిగ్ బాస్ ఒకదాన్ని అన్ లాక్ చేయడం కోసం టాస్క్ పెట్టారు. నాలుగు విడతల్లో జరిగిన టాస్కుల్లో నలుగురు కంటెస్టెంట్స్ విజేతలుగా నిలువగా.. వారికి మరో టాస్క్ ఇచ్చి ఫైనల్ విజేతను ప్రకటించారు. ఫైనల్ విజేతగా విశ్వ నిలిచినప్పటికీ ఆ సింగిల్ బెడ్‌ను ట్రాన్స్ జెండర్ ప్రియాంకకు ఇచ్చేశాడు.

Also Read: బిగ్ బాస్ హౌస్‌లో 19 మంది కంటెస్టెంట్లు.. సరయు తిట్లకు నాగ్ ఫిదా!

సిరి హన్మంతు,  వీజే సన్నీ, లహరి, శ్రీరామ చంద్ర, అనీ మాస్టర్, లోబో, ప్రియా, మోడల్ జెస్సీ, ట్రాన్స్ జెండర్, ప్రియాంక, షన్ముఖ్ జశ్వంత్, హమీద, నటరాజ్ మాస్టర్, 7 ఆర్ట్స్ సరయు, విశ్వ, ఉమాదేవి, మానస్, ఆర్జే కాజల్ , శ్వేత, యాంకర్ రవితో కలసి మొత్తం 19 మందితో హౌస్ కళకళలాడిపోతోంది. మొదటి వారం నుంచే ఒకొక్కరు చొప్పున ఎలిమినేటైపోతూ ఉంటారు. ఇక బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓ ఐదారుగురు మినహా మిగిలిన వారంతా ప్రేక్షకులకు కొత్తే అన్నట్టుంది. యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్ వీరిద్దరిలో ఎవరో ఒకరు ఈ సీజన్ విజేతలుగా  నిలుస్తారని అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోయింది. మరి మొదటి వారం ఎలిమినేట్ అయ్యేదెవరో చూద్దాం.

Also Read: తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు...ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా

Also Read: ఈ ఐదు రాశులవారికి భలేమంచి రోజు… ఆ మూడు రాశుల వారు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి

Also Read: ఈ వారం మూడు రాశులవారికి చాలా ప్రత్యేకం.. మిగిలిన రాశుల వారికి ఈ వారం ఎలా ఉందో చూడండి..

Published at : 06 Sep 2021 10:44 AM (IST) Tags: Bigg Boss Telugu season 5 Bigg Boss 5 Telugu rare record Telugu reality show Trending 2nd position India

సంబంధిత కథనాలు

Happy Birthday Shankar : శంకర్ - పాన్ ఇండియా పదానికి టార్చ్ బేరర్, భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్

Happy Birthday Shankar : శంకర్ - పాన్ ఇండియా పదానికి టార్చ్ బేరర్, భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్

Actor Nasser Injured: షూటింగులో గాయపడ్డ సీనియర్ నటుడు నాజర్!

Actor Nasser Injured: షూటింగులో గాయపడ్డ సీనియర్ నటుడు నాజర్!

Sitaramam: క్లాసిక్ హిట్ మిస్ చేసుకున్న హీరోలు - ఇప్పుడు ఫీలై ఏం లాభం!

Sitaramam: క్లాసిక్ హిట్ మిస్ చేసుకున్న హీరోలు - ఇప్పుడు ఫీలై ఏం లాభం!

వారే లేకపోతే కశ్మీర్ పాక్ వశమయ్యేది - త్వరలో ‘ఆర్ఎస్ఎస్‌’పై సినిమా, వెబ్ సీరిస్: విజయేంద్ర ప్రసాద్

వారే లేకపోతే కశ్మీర్ పాక్ వశమయ్యేది - త్వరలో ‘ఆర్ఎస్ఎస్‌’పై సినిమా, వెబ్ సీరిస్: విజయేంద్ర ప్రసాద్

Vijay Devarakonda: రౌడీ ఇంట్లో స్పెషల్ పూజలు - తల్లి ప్రేమను చూపిస్తూ విజయ్ ట్వీట్!

Vijay Devarakonda: రౌడీ ఇంట్లో స్పెషల్ పూజలు - తల్లి ప్రేమను చూపిస్తూ విజయ్ ట్వీట్!

టాప్ స్టోరీస్

YSRCP Vs Janasena : వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

YSRCP Vs Janasena :  వైఎస్ఆర్‌సీపీ నేతలది బ్రిటిష్ డీఎన్‌ఏ - కులాల మధ్య చిచ్చు పెట్టడమే వారి రాజకీయమన్న జనసేన !

Munugode Bypoll : రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల దండయాత్ర - మునుగోడు ముందు మునిగిపోతున్న టీ కాంగ్రెస్ !

Munugode Bypoll : రేవంత్ టార్గెట్‌గా సీనియర్ల దండయాత్ర - మునుగోడు ముందు మునిగిపోతున్న టీ కాంగ్రెస్ !

Tendulkar On Vinod Kambli: దిగజారిన కాంబ్లీ ఆర్థిక పరిస్థితి! పని కోసం సచిన్ ఫ్రెండ్ వేడుకోలు!

Tendulkar On Vinod Kambli: దిగజారిన కాంబ్లీ ఆర్థిక పరిస్థితి! పని కోసం సచిన్ ఫ్రెండ్ వేడుకోలు!

Semi Bullet Train : హైదరాబాద్ - బెంగళూరు మధ్య సెమీ హైస్పీడ్ రైలు - ఎన్ని గంటల్లో వెళ్లొచ్చంటే ?

Semi Bullet Train :  హైదరాబాద్ - బెంగళూరు మధ్య సెమీ హైస్పీడ్ రైలు -  ఎన్ని గంటల్లో వెళ్లొచ్చంటే ?