Hrithik Roshan on Kantara: ‘కాంతార’ సినిమా చూసిన హృతిక్ రోషన్ - చాలా నేర్చుకున్నానంటూ కామెంట్స్!
‘కాంతార’ సినిమాపై సూపర్ స్టార్ రజనీ కాంత్, హీరో ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు గతంలోనే ట్వీట్ చేశారు. తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘కాంతార’. ఈ సినిమా దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాతో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఈ సినిమా పై తమ అభిప్రాయాన్ని తెలుపుతూ రిషబ్ శెట్టిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. బాలీవుడ్ నుంచి కూడా ‘కాంతార’ విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. తాజాగా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ‘కాంతార’ సినిమా గురించి సోషల్ మీడియా ఓ పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు హృతిక్ పోస్ట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
‘కాంతార’ సినిమాపై సూపర్ స్టార్ రజనీ కాంత్, హీరో ప్రభాస్ లాంటి స్టార్ హీరోలు గతంలోనే ట్వీట్ చేశారు. తర్వాత పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా ఈ సినిమాను మెచ్చుకున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమా పై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘కాంతార’ సినిమాని చూసి తాను చాలా నేర్చుకున్నానని అన్నారు హృతిక్. దర్శకుడిగా రిషబ్ శెట్టి సినిమాని తీసిన విధానం చాలా బాగుందని పేర్కొన్నారు. కథ, దర్శకత్వం ఇలా ప్రతీ అంశం ఈ సినిమాలో అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. రిషబ్ శెట్టి నటన కూడా చాలా బాగుందన్నారు. ముఖ్యంగా చివరి పది నిమిషాల్లో రిషబ్ నటన తనకు గూస్ బంబ్స్ తెప్పించాయని అన్నారు. ‘కాంతార’ టీమ్ అందరికీ అభినందనలు తెలుపుతున్నానంటూ ట్వీట్ చేశారు హృతిక్. అయితే ఈ ట్వీట్ పై హృతిక్ అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హృతిక్ సౌత్ సినిమాల్లో కూడా పని చేయాలని కోరుతున్నారు. ఓ అభిమాని స్పందిస్తూ.. ‘బాలీవుడ్ మిమ్మల్ని నమ్మడం లేదు, టాలీవుడ్ కి రండి. ఇక్కడి దర్శకులు మీతో అద్భుతాలు సృష్టిస్తారు అని అంటున్నారు.
కాగా కర్ణాటక, కేరళలో ఉన్న ఆచారాలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో అచ్యుత్ కుమార్, ప్రమోద్ శెట్టి, సప్తమీ గౌడ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. హెంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత విజయ్ కిరగందూర్ నిర్మించారు. అజిత్ లోక్ నాథ్ ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. నిజానికి ఈ సినిమా కన్నడలో ముందు విడుదల చేశారు. అక్కడ అనూహ్య స్పందన రావడవంతో హిందీ, మలయాళం, తెలుగు, తమిళ భాషలలో డబ్బింగ్ వెర్షన్ లతో రెండు వారాల తర్వాత విడుదల చేశారు. ఈ సినిమా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటింది. కొన్ని వారాల పాటు బాలీవుడ్ సినిమాలకు ధీటైన పోటీ ఇచ్చింది. 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్లు వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. ప్రస్తుతం ‘కాంతార 2’ సినిమా పనులపై మూవీ టీమ్ ఫుల్ బిజీ గా ఉంది.
Learnt so much by watching #Kantara. The power of @shetty_rishab’s conviction makes the film extraordinary. Top notch storytelling, direction & acting. The peak climax transformation gave me goosebumps 🤯 Respect & kudos to the team 👏🏻
— Hrithik Roshan (@iHrithik) December 11, 2022
Also Read : వయసుతో పాటు మారిన కథానాయకుడు, ప్రయోగాలకు భరోసా ఇచ్చిన 'విక్టరీ'