HBD Victory Venkatesh : వయసుతో పాటు మారిన కథానాయకుడు, ప్రయోగాలకు భరోసా ఇచ్చిన 'విక్టరీ'
తెలుగు చిత్రసీమలోని అగ్ర కథానాయకులలో 'విక్టరీ' వెంకటేష్‌ది ప్రత్యేకమైన పంథా. ఓ ఇమేజ్, ఓ జానర్‌కు చిక్కుకొని నటుడు. ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా...
తెలుగు చిత్ర పరిశ్రమలో అజాత శత్రువు 'విక్టరీ' వెంకటేష్ (Venkatesh Daggubati). మూవీ మొఘల్, ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు వారసుడిగా చిత్రసీమలోకి కథానాయకుడిగా వచ్చినప్పటికీ, అనతి కాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోగా స్టేటస్ అందుకున్నారు. స్టార్ హీరోల్లో వెంకటేష్ పంథా ప్రత్యేకమైనది. ఓ ఇమేజ్, ఓ జానర్‌కు చిక్కుకొని నటుడు ఆయన.
వెంకటేష్‌కు క్లాస్ హీరో అనే ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలాగని, ఆయన మాస్ సినిమాలు చేయలేదని కాదు. చేశారు. 'ధర్మ చక్రం' చిత్రంలో న్యాయవాదిగా చేసే సన్నివేశాల్లో వెంకటేష్ నటనలో డిఫరెంట్ మాసిజం ఉంటుంది. 'లక్ష్మీ', 'తులసి' సినిమాల్లో ఫైట్స్ చేస్తే ఫ్యాన్స్ & ప్రేక్షకులు ఊగిపోయారు. అయితే... 'పవిత్ర బంధం', 'ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు', 'సంక్రాంతి' వంటి సినిమాలు ఆయనకు ఎక్కువ ఫ్యామిలీ ఇమేజ్ తీసుకు వచ్చాయి.
పదేళ్ళలో వెంకీలో ఎంత మార్పు?
వెంకటేష్ కెరీర్ అంతా ఓ ఎత్తు... లాస్ట్ టెన్ ఇయర్స్ మరో ఎత్తు. పదేళ్ళలో ఆయన కథల ఎంపికలో చాలా మార్పు వచ్చింది. క్యారెక్టర్ల పరంగా కూడా గతంతో పోలిస్తే చాలా వ్యత్యాసం చూపిస్తున్నారు. ట్రెండ్ పట్టుకుని మరీ సినిమాలు చేస్తున్నారు. కాలంతో, పెరుగుతున్న వయసుతో పాటు మారుతున్నారు.
గత పదేళ్ళలో వెంకటేష్ చేసిన సినిమాలు చూస్తే... ఎక్కువ మల్టీస్టారర్ సినిమాలు కనబడతాయి. వయసురీత్యా ఇప్పుడు వెంకటేష్ యంగ్ రోల్స్ చేయలేరు. క్యారెక్టర్లు యంగ్ అయినా, అటువంటి రోల్స్ ఉన్నా... యువ హీరోలను తీసుకుంటున్నారు. లవ్ సీన్స్, డ్యూయెట్స్ ఉండాలని కోరుకోవడం లేదు. ఫ్యామిలీ మ్యాన్‌గా స్క్రీన్ మీద కనిపించడానికి ఎటువంటి మొహమాటాలు పెట్టుకోలేదు.
'దృశ్యం', 'గోపాల గోపాల', 'ఎఫ్ 2', 'ఎఫ్ 3' సినిమాల్లో పెళ్ళైన పురుషుడిగా వెంకటేష్ కనిపించారు. 'మసాలా', 'గురు', 'వెంకీ మామ' సినిమాల్లో వయసు తగ్గ పాత్రలు పోషించారు. 'గురు'లో కొంత వరకు, 'నారప్ప'లో అయితే పూర్తిగా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో కనిపించారు. వెంకటేష్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ అన్ని వర్గాలు, అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హీరోలందరి అభిమానులను కూడా! మరీ ముఖ్యంగా దర్శక నిర్మాతలను. కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి వెంకటేష్ ఉన్నాడనే భరోసా ఆయన ఇస్తున్నారు. ఆయన లాస్ట్ టెన్ ఇయర్స్ ట్రాక్ రికార్డ్ చూసి... ఆయన్ను దృష్టిలో పెట్టుకుని కొందరు కథలు రాస్తున్నారు.
మల్టీస్టారర్ సినిమాలు చేశారని కాదు... ముందు నుంచి వెంకటేష్‌కు ప్రేక్షకులు అందరిలో పాజిటివ్ ఇమేజ్ ఉంది. ఆయన వివాదరహితుడు. ఎప్పుడూ ఎటువంటి కాంట్రావర్సీలో ఆయన పేరు లేదు. ఎవరినీ పల్లెత్తు మాట అనడం ఉండదు. ఆ మంచి లక్షణమే అందరిలో ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది.
వెంకటేష్‌ది క్లీన్ ఇమేజ్...
ఆయన సిరీస్ ఏమో బోల్డ్!
ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందడుగు వేసే వెంకటేష్... డిజిటల్ స్క్రీన్ మీద అడుగు పెట్టే విషయంలో కూడా ముందు ఉన్నారు. అన్నయ్య సురేష్ బాబు కుమారుడు రానాతో కలిసి 'రానా నాయుడు' అని ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఇది బోల్డ్ సిరీస్. బోల్డ్ అంటే మరోలా ఊహించుకోవద్దు. మాటల్లో సెన్సార్ డైలాగులు ఉంటాయని రానా తెలిపారు. థియేటర్లలో అయితే బీప్ సౌండ్ వేయడమో? లేదంటే ఆ మాటలకు కత్తెర పడటమో? తప్పకుండా జరిగేది. ఓటీటీలో విడుదల అయ్యే సిరీస్ కదా! అటువంటి సెన్సార్ కత్తెరలు ఉండవు.
ఓటీటీలో బోల్డ్ సిరీస్‌లు కామన్. స్కిన్ షో, డైలాగులు శృతి మించుతున్నాయని ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ విమర్శిస్తున్నారు. వాళ్ళు ఫ్యామిలీ అంతా చూసే క్లీన్ సిరీస్‌లు కోరుతున్నారు. వెంకటేష్‌కు అటువంటి ఇమేజ్ ఉంది. ఆయన బోల్డ్ సిరీస్ చేయడం అంటే ప్రయోగమే. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి రిస్క్ చేయడమే. రిస్క్ అనడం కంటే... ఈతరం ప్రేక్షకులకూ చేరువ కావడం కోసం ఆయన చేసే ప్రయత్నంగా దీనిని చూడాలేమో!?
Also Read : స్టార్ డైరెక్టర్స్ పరువు తీసిన 2022 - ఈ ఏడాది వీళ్ళ స్టార్ బాగోలేదనుకుంట!
కథానాయకుడిగా రిస్కులు చేయడం వెంకటేష్‌కు అలవాటు. కొన్నేళ్ళ నుంచి చేస్తున్నారు. ఆ రిస్కులే ఓ ఇమేజ్, ఓ జానర్‌కు పరిమితం కాకుండా చేశాయి. ఆయన నటనలో కొత్త కోణాన్ని వెలికి తీశాయి. ఎప్పుడూ ఇదే విధంగా కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులను వెంకటేష్ ఎంటర్‌టైన్ చేయాలని, 'విక్టరీ' కంటిన్యూ చేస్తూ విజయాలు అందుకోవాలని ఆశిస్తూ... ABP Desam తరఫున ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు.