Dhanya Balakrishna: ఇంటి మధ్యలో కొబ్బరి చెట్టు - నటి ధన్య బాలకృష్ణ ఇల్లు చూస్తే వందేళ్లు వెనక్కి వెళ్తారు!
ధన్య బాలకృష్ణన్ హోమ్ టూర్ వీడియోకు మంచి ఆదరణ లభిస్తుంది. వాళ్ళ నానమ్మ గది, పాత రేడియో, చెక్క ఉయ్యాల ఇలా తన ఇంట్లో ఉన్న ఎన్నో ఏళ్ల క్రితం నటి యాంటిక్ వస్తువులన్నిటిని చూపించి ఆశ్చర్యపరిచిందీ బ్యూటీ.
సినిమాల్లో అలా కనిపించి మాయమయ్యే క్యార్టర్ల నుంచి హీరోయిన్ స్థాయికి ఎదిగిన నటి ధన్య బాలకృష్ణ. ఇటీవలే ఆమె యూట్యూబ్ చానెల్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె హోమ్ టూర్ వీడియోతో తన ఇల్లు మొత్తాన్ని చూపించింది. అయితే, ఈ ఇల్లు చాలా ప్రత్యేకమైనది. ప్రకృతికి ఎంతో విలువనిస్తూ.. ఫ్యాన్లు, ఏసీలతో పనిలేకుండా సహజసిద్ధంగా చల్లగా ఉంచేలా ఈ ఇంటిని నిర్మించారు.
ధన్య బాలకృష్ణన్ హోమ్ టూర్ వీడియోలో పేర్కొన్న వివరాల్లోకి వెళ్తే. ముందుగా ధన్య లివింగ్ ఏరియా గురించి చెప్పింది. తన ఫ్యామిలీ మొత్తం కలసి కూర్చోని మాట్లాడుకునే హ్యాంగౌట్ ప్లేస్ ఇదేనని చెప్పింది. అలాగే తన ఫాదర్ కోసం ఎవరైనా గెస్టులు వచ్చినా ఇక్కడే కూర్చుంటాం అని చెప్పింది. ఆయన వీణ ప్లేయర్, కాబట్టి ఆయన కోసం ప్రత్యేకంగా ఓ గది ఉంటుందట. అక్కడే ఆయన ఉదయం, సాయంత్రం సంగీత సాధన చేస్తారని చెప్పుకొచ్చింది. అలాగే వందేళ్ల చరిత్ర ఉన్న వీణని కూడా చూపించింది ధన్య. ఇక ఇంట్లో ఓపెన్ కిచెన్ ని చూపించింది. తన నాన్మమ్మలాగే ఆమె కూడా వంట చేస్తుందట. అందుకే తన తండ్రి ఆమె వంటను ఇష్టపడతారు అని చెప్పింది. అలాగే తన తాతయ్యకు 1983లో వచ్చిన పద్మభూషణ్ అవార్డుని కూడా ధన్య చూపించింది. అలాగే ఇంట్లో తనకు ఇష్టమైన ప్రదేశాాలను కూడా చూపించింది. వాటితో తనకున్న జ్ఞాపకాలను వివరించింది.
తన ఇంట్లో ఇంకో ప్రత్యేకత గురించి కూడా చెప్పింది ధన్య. తమ కుటుంబంలో ఎవరికీ చెట్లు నరకడం అంటే ఇష్టం ఉండదట. అందుకే తమ ఇల్లు నిర్మాణం చేసేటపుడు మధ్యలో కొబ్బరి చెట్టు అడ్డు వస్తే దానిని అలాగే వదిలేసి ఇల్లు కట్టారట. ఇంటి మధ్యలో నుంచి ఎదిగిన ఆ కొబ్బరి చెట్టును కూడా చూపించింది ధన్య. ఆ ఇంట్లో ఉన్న పాతకాలపు బావిని కూడా చూపించింది. ఇక వాళ్ళ నానమ్మ గది, పాత రేడియో, చెక్క ఉయ్యాల ఇలా తన ఇంట్లో ఉన్న 100, 150 ఏళ్ళ క్రితం నాటి యాంటిక్ వస్తువులన్నిటిని చూపించి అందర్నీ ఆశ్చర్యపరిచిందీ బ్యూటీ. ఇంకా ఆమె ఇంట్లో ఏమేం ఉన్నాయో ఈ వీడియోలో చూసేయండి.
ధన్య బాలకృష్ణన్ తెలుగుతో పాలు తమిళ భాషల్లోనూ సినిమాలు చేస్తుంది. నిజానికి ఆమె హీరోయిన్ గా కంటే సైడ్ క్యారెక్టర్ లలోనే గానే ఎక్కువగా కనిపిస్తుంది. కానీ ఏ సినిమా లో నటించినా తన క్యారెక్టర్ గుర్తుండిపోయేలా నటిస్తుందీ బ్యూటీ. అలా తనకంటూ ఇండస్ట్రీ లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ధన్య. సూపర్ స్టార్ మహేష్, విక్టరీ వెంకటేష్ కలసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ఆమె క్యారెక్టర్ ఇప్పటికీ అందరికీ అలా గుర్తిండిపోయింది. ఇదే కాకుండా తెలుగులో చాలా సినిమాల్లో నటించి మెప్పించిందీ ముద్దుగుమ్మ. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
Read Also: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ కు మరో షాక్, పరువు నష్టం కేసు పెట్టిన నోరా ఫతేహి