Varun Tej-Lavanya: ఇటలీలో లవ్ బర్డ్స్ వరుణ్, లావణ్య - ఎంగేజ్మెంట్కు ముందే షికారు? ఇవిగో ఆధారాలు!
లవ్‌బర్డ్స్ వరుణ్ తేజ్, లావణ్య వెకేషన్లో ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్లోరెన్స్ వీధుల్లో చేయి చేయి పట్టుకుని చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్నారు.
2016 నుంచి ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఈ మధ్యే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. మెగా బ్రదర్ నాగబాబు ఇంట్లో వీరి నిశ్చితార్థ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ ఈ వేడుకకు హాజరైంది. ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో బంధుమిత్రుల ఆశీర్వాదం నడుమ వరుణ్, లావణ్య ఎంగేజ్మెంట్ ఉంగరాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీలు స్వయంగా తమ ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. త్వరలోనే వీరిద్దరు వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టనున్నారు.
ఇటలీ వెకేషన్లో వరుణ్ తేజ్-లావణ్య
ఎంగేజ్మెంట్ తర్వాత లావణ్య, వరుణ్ తేజ్ కలిసి ఇటలీలో వెకేషన్ కు వెళ్లారు. ప్రస్తుతం ఫ్లోరెన్స్ వీధుల్లో సరదాగా గడుపుతున్నారు. తాజాగా ఈ వెకేషన్ కు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “మాకు విషెస్ చెప్పిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!” అని వరుణ్ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. దానికి లవ్ ఎమోజీలు యాడ్ చేశారు. అయితే, నెటిజన్స్ ఈ ఫొటోలు ఎంగేజ్మెంట్ కంటే ముందువా? లేదా తర్వాతవా అని నెటిజనులు అడుగుతున్నారు. ఎందుకంటే.. వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్కు ముందు వెకేషన్స్ ఎంజాయ్ చేసి వచ్చాడు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. వరుణ్ ఇటలీలో షికారు చేస్తున్నప్పుడు తీయించుకున్న ఫొటోలతో కంపేర్ చేస్తున్నారు. ‘‘అమ్మ దొంగా.. ఎంగేజ్మెంట్ కంటే ముందే ఇటలీలో చక్కర్లు కొట్టేశారుగా’’ అని కామెంట్లు చేస్తున్నారు.
View this post on Instagram
ఎంగేజ్మెంట్కు ముందు వరుణ్ తేజ్ పోస్ట్ చేసిన వెకేషన్స్ ఫొటోలివే
View this post on Instagram
‘మిస్టర్’ సినిమా నుంచే ప్రేమాయణం
వాస్తవానికి లావణ్య, వరుణ్ తేజ్ చాలా కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్నారు. వారి గురించి పలు డేటింగ్ రూమర్స్ కూడా వచ్చాయి. కానీ, కొణిదెల ఫ్యామిలీ గానీ, వరుణ్ తేజ్, లావణ్య గానీ ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కొద్ది రోజుల క్రితం నాగబాబు, వీరిద్దరి పెళ్లి జరగబోతున్నట్లు సూచనప్రాయంగా ధృవీకరించారు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలసి ‘మిస్టర్’ అనే సినిమా 2017లో విడదల అయ్యింది. 2016లో ఈ సినిమా షూటింగ్ మొదలైన నాటి నుంచే లవ్ లో పడ్డారు. ఈ సినిమా తర్వాత ‘అంతరిక్షం’ అనే సినిమాలో కూడా లావణ్య వరుణ్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పటి నుంచే వీరిద్దరి మధ్య రిలేషన్ షిప్ కొనసాగుతుంది. వీరి డేటింగ్ వ్యవహారంపై వార్తలు కూడా వచ్చాయి. ఆ తర్వాత నాగబాబు ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ.. వరుణ్ కు ఈ ఏడాదిలోనే పెళ్లి చేస్తాం అని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ ఏడాదిలోనే వరుణ్, లావణ్యల పెళ్లి జరుగుతుందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. పెళ్లి ముహూర్తం ఇంకా ఖరారు చేయనప్పటికీ, ఈ ఏడాది పెళ్లి చేసుకుంటారని, అది కూడా అతి త్వరలో ఉంటుందని మెగా ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
'గాంఢీవధారి అర్జున' సినిమాలో నటిస్తున్న వరుణ్ తేజ్
ప్రస్తుతం వరుణ్ తేజ్ చేస్తున్న సినిమాలకు వస్తే... ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'గాంఢీవధారి అర్జున' సెట్స్ మీద ఉంది. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో పాన్ ఇండియా సినిమా ఒకటి చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి రెండు, మూడు సినిమాలు చేస్తున్నారు.
Read Also: క్రెడిట్ ఇప్పటికీ వారికే దక్కుతుంది, ‘బాహుబలి’పై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు