Tamannaah: క్రెడిట్ ఇప్పటికీ వారికే దక్కుతుంది, ‘బాహుబలి’పై తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
‘బాహుబలి: ది బిగినింగ్’ సక్సెస్ ను తాను క్యాష్ చేసుకోలేకపోయానని చెప్పింది నటి తమన్నా. యాక్షన్ చిత్రాల క్రెడిట్ ఇప్పటికీ హీరోలకే దక్కుతుందని చెప్పుకొచ్చింది.
దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’. ఈ సినిమాతో తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పారు జక్కన్న. ప్రభాస్, రానా, అనుష్క శెట్టి, తమన్నా, రమ్యకృష్ణ, కీలక పాత్రల్లో నటించి ఈ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకుంది. 'బాహుబలి' సినిమా ఇండియన్ సినిమా స్థాయిని పెంచేసింది. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాతో ప్రభాస్, రాజమౌళికి ఇంటర్నేషనల్ వైడ్ గా గుర్తింపు వచ్చింది. ఒక రాజ్యం.. దాని సింహాసనాన్ని దక్కించుకోవడం కోసం ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగే కథను తీసుకొని 'బాహుబలి' లాంటి మాగ్నమ్ ఓపస్ ను రూపొందించారు. చిన్న కథైనా.. రాజమౌళి విజన్ మాత్రం భారీ స్థాయిలో ఉంటుంది. ఒక్కో ఫ్రేమ్ ను ఎంతో రిచ్ గా చూపిస్తూ.. తన క్రియేటివిటీతో ప్రేక్షకులను మెప్పించారు. ఒక్క 'బాహుబలి' కోసమే ఐదేళ్ల సమయం కేటాయించినప్పటికీ.. మరో వందేళ్ల తరువాత అయినా ఆ సినిమా గురించి గొప్పగా చెప్పుకునేలా తీశారు.
‘బాహుబలి’ సక్సెస్ ను క్యాష్ చేసుకోలేకపోయా
తాజాగా ఈ సినిమా గురించి నటి తమన్నా కీలక వ్యాఖ్యలు చేసింది. 2015లో విడుదలైన ‘బాహుబలి: ది బిగినింగ్’ కనీవినీ ఎరుగని విజయాన్ని అందుకున్నా, తాను ఆ సినిమాను సక్సెస్ ను క్యాష్ చేసుకోలేకపోయానని చెప్పింది. ఈ విజయాన్ని తన ఎదుగుదలకు కోరుకున్నంత స్థాయిలో ఉపయోగించుకోలేకపోయానని చెప్పుకొచ్చింది. ఈ చిత్రంలో తమన్నా అమరేంద్ర బాహుబలి సరసన అవంతికగా నటించింది. దేవసేనను కాపాడే సైన్యంలో నైపుణ్యం కలిగిన పోరాట యోధురాలుగా కనిపించింది. ‘బాహుబలి’ తొలి భాగంలో ఆమె కీలక పాత్రలో కనిపించినా, యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొన్నా.. రెండో భాగంలో మాత్రం కేవలం అతిథి పాత్రతోనే సరిపెట్టుకుంది.
యాక్షన్ చిత్రాల సక్సెస్ క్రెడిట్ హీరోలకే దక్కుతుంది
వాస్తవానికి యాక్షన్ చిత్రాల సక్సెస్ క్రెడిట్ అంతా హీరోలకే దక్కుతుందని తమన్నా తెలిపింది. "నేను ఇప్పటికీ భావిస్తున్నాను యాక్షన్ చిత్రాల సక్సెస్ క్రెడిట్ హీరోలకే దక్కుతుంది. ‘బాహుబలి’ సక్సెస్ కూడా ప్రభాస్, రానా కే ఎక్కువగా దక్కింది. అనుష్కకు, రమ్యకృష్ణ కూడా కొంత పేరు వచ్చినా, నా పాత్ర మాత్రం అతిథి పాత్రగానే మిగిలిపోయింది” అని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించింది.
‘బాహుబలి’ చిత్రం గురించి..
‘బాహుబలి’ సినిమాను దర్శకుడు రాజమౌళి తెరకెక్కించారు. రెండు భాగాలుగా ఈ సినిమాను రూపొందించారు. ప్రభాస్, తమన్నా, రానా దగ్గుబాటి, అనుష్క శెట్టి, రమ్య కృష్ణన్, సత్యరాజ్, నాజర్ కీలక పాత్రల్లోనటించారు. పీరియాడికల్ వార్ ఫిల్మ్గా ‘బాహుబలి’ రూపొందింది. ‘బాహుబలి1’తో పోల్చితే ‘బాహుబలి 2’ చిత్రం కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధించింది. అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రంతో రాజమౌళి స్థాయి మరింత పెరిగింది. ప్రభాస్ ఏకంగా పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిపోయారు. ఈ సినిమా తర్వాత ఆయన వరుసబెట్టి పాన్ ఇండియన్ సినిమాలే చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించిన అనుష్క, తమన్నా ఆ తర్వాత పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. ఈ నేపథ్యంలో తమన్నా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవికి జోడీగా 'భోళా శంకర్' చేస్తున్నారు. అందులో చిరు చెల్లెలుగా కీర్తీ సురేష్ కీలక పాత్ర చేస్తున్నారు. 'సైరా నరసింహా రెడ్డి' తర్వాత చిరు, తమన్నా కలయికలో వస్తున్న సినిమా 'భోళా శంకర్'. హిందీలో 'బోల్ చుడీయా', మలయాళంలో 'బాంద్రా' సినిమాలు చేస్తున్నారు.
Also Read : ప్రభాస్ అడగలేదు, మేమే కొన్నాం - 'ఆదిపురుష్' రైట్స్‌పై టీజీ విశ్వప్రసాద్
Read Also: విజయ వర్మతో తమన్నా డేటింగ్ - అసలు విషయం చెప్పేసిన మిల్కీ బ్యూటీ