అన్వేషించండి

Samajavaragamana: బాలయ్య డైలాగ్ అందుకే చెప్పాల్సి వచ్చింది - ఆ వివాదంపై స్పందించిన హీరో శ్రీవిష్ణు

‘సామజవరగమన’ సినిమాలో బాలయ్యను ఇమిటేట్ చేస్తూ ఓ డైలాగ్ పెట్టారు. అయితే ఆ సీన్ పై కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కూడా. సోషల్ మీడియాలో ఈ మూవీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో..

Samajavaragamana: టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటించిన సినిమా ‘సామజవరగమన’. ఈ మూవీకు రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈసినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా కూడా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. హీరో శ్రీవిష్ణు కూడా ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే గతంలో విడుల చేసిన టీజర్ లో బాలకృష్ణ వాయిస్ ను ఇమిటేట్ చేస్తూ ఓ డైలాగ్ పెట్టారు. దీంతో ఆ టీజర్ తెగ వైరల్ అయింది. అయితే అందులో బాలయ్య డైలాగ్ ను ఎందుకు పెట్టారో ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు హీరో శ్రీవిష్ణు. 

బాలయ్య ఇమిటేట్ డైలాగ్ పై స్పందించిన శ్రీవిష్ణు..

రీసెంట్ గా ‘అల్లూరి’ సినిమాతో యాక్షన్ హీరోగా అలరించారు హీరో శ్రీవిష్ణు. అయితే ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఈసారి మాత్రం తనకు బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్ లో ఈ ‘సామజవరగమన’ సినిమా చేశారు. అయితే ఈ సినిమాలో బాలయ్యను ఇమిటేట్ చేస్తూ ఓ డైలాగ్ పెట్టారు. అయితే ఆ సీన్ పై కొంతమంది బాలయ్య ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు కూడా. సోషల్ మీడియాలో ఈ మూవీపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాలో అలా ఎందుకు పెట్టారో అనే విషయాన్ని హీరో శ్రీవిష్ణు చెప్పుకొచ్చాడు.   మూవీలో బాలకృష్ణ వాయిస్ లాంటి డైలాగ్ కావాలని పెట్టలేదని అన్నాడు. సీన్ కు తగ్గట్టుగానే ఆ డైలాగ్ పెట్టామని అన్నాడు. హీరో బాగా చిరాకులో ఉన్నప్పుడు ఒక ఫోన్ వస్తుందని, అప్పుడు ఏదైనా ఫన్ జనరేట్ చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు ఆ డైలాగ్ ను రాశారని చెప్పాడు. దాని వలన టీజర్ కు మంచి హైప్ వచ్చిందని చెప్పాడు. 

ప్రతీ సీన్ నవ్విస్తుంది: శ్రీవిష్ణు

ఈ సినిమాతో రామ్ అబ్బరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ సినిమా కథ చెప్పినపుడు ఫస్ట్ సిట్టింగ్ లోనే ఓకే చేశానని చెప్పుకొచ్చాడు శ్రీవిష్ణు. మూవీ షూటింగ్ టైమ్ లో కూడా టీమ్ అంతా చాలా నవ్వుకున్నామని, షూటింగ్ అంతా చాలా సరదాగా సాగిందని చెప్పాడు. మూవీకు టైటిల్ కూడా బాగా ఆలోచించే ఇలా పెట్టామని అన్నాడు. ‘సామజవరగమన’ అనేది అల్లు అర్జున్ సినిమాలోని ఓ పాట అని అన్నాడు. ఈ పాట ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందేనని, ఇలాంటి టైటిల్ అయితే ఆడియన్స్ వెంటనే కనెక్ట్ అవుతారనే ఉద్దేశంతో టైటిల్ అలా పెట్టారని చెప్పాడు. ఈ సినిమాపై తనకు పూర్తి నమ్మకం ఉందని, సినిమాలో ప్రతీ సీన్ అందర్నీ నవ్విస్తుందని చెప్పాడు. 

ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు ‘సామజవరగమన’..

హీరో శ్రీవిష్ణు చాలా కాలం తర్వాత మళ్లీ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేశాడు. కెరీర్ మొదట్లో సహాయక పాత్రల్లో నటించిన శ్రీవిష్ణు తర్వాత హీరోగా మారాడు. పలు హిట్ సినిమాల్లో నటించారు. గతేడాది యాక్షన్ ఎంటర్టైనర్ మూవీస్ తో అలరించిన శ్రీవిష్ణు ఈసారి పక్కా కామెడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా రెబా మోనికా జాన్ నటిస్తోంది. జూన్ 29 న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Also Read: ‘స్పై’ to ‘సామజవరగమన’- జూన్‌ చివరి వారంలో థియేటర్లలో సందడి చేసే సినిమాలివే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Thalapathy Vijay First Salary: విజయ్ ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పుడు దానికంటే 'జన నాయగన్'కు 440000000 రెట్లు ఎక్కువ
విజయ్ ఫస్ట్ సినిమా రెమ్యూనరేషన్ ఎంత? ఇప్పుడు దానికంటే 'జన నాయగన్'కు 440000000 రెట్లు ఎక్కువ
Ramayana Trailer: గ్లోబల్ స్టేజిపైకి 'రామాయణ్'... శాన్ డియాగో కామిక్ కాన్‌లో రణబీర్ సినిమా ట్రైలర్ విడుదల
గ్లోబల్ స్టేజిపైకి 'రామాయణ్'... శాన్ డియాగో కామిక్ కాన్‌లో రణబీర్ సినిమా ట్రైలర్ విడుదల
Vishnu Vinyasam Box Office Collection : శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన

వీడియోలు

Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Pakistan Out of T20 World Cup 2026 | టీ20 వరల్డ్ కప్ నుంచి పాకిస్థాన్ అవుట్
India vs West Indies T20 World Cup Team India Batting Lineup | భార‌త అసిస్టెంట్ కోచ్ కీల‌క వ్యాఖ్య‌లు

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman BR Naidu: అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
అలాంటి వీడియోలకు భయపడే వ్యక్తిని కాదు.. వాళ్ల బాగోతం బయటపెడతా: బీఆర్ నాయుడు
Money Laundering Case: జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
జైలులో జీవితం నరకమే... తీహార్‌లో చావు కోసం చూశానని నటి ఆవేదన
Iran New Supreme Leader: ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఈ కీలక బాధ్యతలు ముళ్ల కిరీటమే!
Nawab Cafe OTT : ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
ఆ ఓటీటీలోకి నవాబ్ కేఫ్ - నెల రోజుల్లోపే స్ట్రీమింగ్... ఎప్పుడు, ఏ ప్లాట్ ఫాంలో అంటే?
Affordable Mileage Bikes: 70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
70 కి.మీ మైలేజ్, అద్భుతమైన ఫీచర్లు.. బడ్జెట్ ధరలో టాప్ 5 బైక్స్ ఇవే
Vishnu Vinyasam Box Office Collection : శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
శ్రీవిష్ణు విష్ణు విన్యాసం డీసెంట్ కలెక్షన్స్ - రెండు రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే?
Kakinada Fireworks Explosion: వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
వేట్లపాలెంలో ప్రమాద తీవ్రత ఎందుకు పెరిగింది ? భారీ ప్రాణ నష్టానికి కారణం ఇదే!
US Israel Strikes On Iran: దుబాయ్‌లో చిక్కుకున్న 'లెజెండ్' హీరోయిన్... ప్రధాని మోడీ సాయం కోరుతూ పోస్ట్
దుబాయ్‌లో చిక్కుకున్న 'లెజెండ్' హీరోయిన్... ప్రధాని మోడీ సాయం కోరుతూ పోస్ట్
Embed widget