అన్వేషించండి

Upcoming telugu movies: ‘స్పై’ to ‘సామజవరగమన’- జూన్‌ చివరి వారంలో థియేటర్లలో సందడి చేసే సినిమాలివే!

ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. నిఖిల్ నటించిన ‘స్పై’తో పాటు శ్రీవిష్ణు ‘సామజవరగమన’, పాయల్‌ రాజ్‌పుత్‌ ‘మాయా పేటిక’ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

జూన్ చివరి వారంలో పలు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. సినీ అభిమానులకు కావాల్సినంత వినోదాన్ని పంచనున్నాయి. ఇంతకీ, ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం..   

‘స్పై’- జూన్ 29న విడుదల

నిఖిల్‌ సిద్దార్థ్  హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘స్పై’. ఎడిటర్‌ గ్యారీ బీహెచ్‌ ఈ చిత్రంతో మెగా ఫోన్ పట్టారు.  ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా నటించింది. భారత స్వాతంత్ర్య సంగ్రామ సమర యోధుడు సుభాష్‌ చంద్రబోస్‌ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు  కె.రాజశేఖర్‌రెడ్డి కథని అందించారు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆయనే ఈ మూవీని నిర్మించారు.

సామజవరగమన’- జూన్‌ 29విడుదల

శ్రీవిష్ణు హీరోగా చేస్తున్న సినిమా ‘సామజవరగమన’. రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయ్యింది.  రెబా మోనికా జాన్‌ హీరోయిన్ గా నటిస్తోంది. రాజేష్‌ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. వినూత్నమైన ప్రేమకథతో ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని చిత్రబృందం వెల్లడించింది.  

ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’- జూన్‌ 29విడుదల

యాక్షన్‌, అడ్వెంచర్‌ చిత్రాలను ఇష్టపడే వారికి ‘ఇండియానా జోన్స్‌’ సినిమాలను ఎంతగానో నచ్చుతాయి. నిధుల వేట, అరుదైన వస్తువులను  అన్వేషించే కథాంశంతో ఈ సినిమాలను తెరకెక్కించారు. ఈ మూవీస్ కు ప్రత్యేకంగా ఫ్యాన్ బేస్ కలిగి ఉంది. ఇదే జానర్ లో ‘ఇండియానా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’ అనే మరో సినిమా రాబోతోంది.  ఇండియానా జోన్స్‌ గా హారిసన్‌ ఫోర్డ్‌ మరోసారి అభిమానులను ఆకట్టుకోబోతున్నారు. జూన్‌ 29న ఇంగ్లీష్‌తో పాటు పలు భారతీయ భాషల్లో విడుదలకానుంది.  

లవ్‌ యూ రామ్‌’- జూన్‌ 30విడుదల

ప్రేమించడం కాదు, నమ్మించడం జీవితం  అనుకుంటాడు ఓ అబ్బాయి. చిన్నప్పటి నుంచి ఒకే అబ్బాయిన ప్రేమిస్తూ తనే నా రాముడు అనుకుంటుంది ఓ అమ్మాయి. రెండు విరుద్ధమైన మనస్తత్వాలు కలిగి యువతీ, యువకుల మధ్య ప్రేమను బేస్ చేసుకుని ‘లవ్‌ యూ రామ్‌’ అనే సినిమా తెరకెక్కించాడు డి.వి.చౌదరి. రోహిత్‌ బెహల్‌, అపర్ణ జనార్ధనన్‌ ఈ చిత్రంలో హీరో, హీరోయిన్లుగా నటించారు. డి.వి.చౌదరి ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు మరో దర్శకుడు కె.దశరథ్‌తో కలిసి నిర్మించారు. ఈ సినిమాకు కె.దశరథ్‌ కథ అందించారు. ఈ మూవీ జూన్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘మాయా పేటిక- జూన్‌ 30న విడుదల

పాయల్‌ రాజ్‌పుత్‌, సునీల్‌, శ్రీనివాసరెడ్డి, విరాజ్‌ ముఖ్యపాత్రలో నటిస్తున్న చిత్రం ‘మాయా పేటిక’. రమేశ్‌ రాపార్తి ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నారు. జూన్‌ 30న థియేటర్‌లలో ప్రేక్షకులను అలరించబోతోంది.

Read Also: కేసీఆర్‌కు తెలంగాణ అంటే ఎంత ఇష్టమో, నువ్వు నాకు అంత ఇష్టం - ఫన్నీగా ఫన్నీగా ‘భాగ్ సాలే’ ట్రైలర్!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధంపుష్ప 2 మూవీలోని కిస్సిక్ సాంగ్‌పై విపరీతమైన ట్రోల్స్యూపీలోని షాహీ మసీద్‌ వద్ద తీవ్ర ఉద్రిక్తతవిజయ్‌తో రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిన రష్మిక

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Tecno POP 9 4G: రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
రూ.ఆరు వేలలోనే వావ్ అనిపించే ఫోన్ - టెక్నో పాప్ 9 4జీ వచ్చేసింది!
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget