News
News
X

Ram Charan: రామ్ చరణ్ ఇంట్లో ఇండియన్ క్రికెటర్స్ - బయటకొచ్చిన ఫొటోలు!

రామ్ చరణ్ ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లిన ప్లేయర్స్ లో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాతో పాటు మరికొంతమంది ప్లేయర్స్ ఉన్నట్లు సమాచారం.

FOLLOW US: 
 
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) ఇంటికి ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కొందరు వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఆదివారం నాడు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఇండియా-ఆస్ట్రేలియా(IND vs AUS) మధ్య ఫైనల్ టీ20 మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఇండియా గెలిచింది. మ్యాచ్ తరువాత ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ కొందరు.. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్ లు కనిపిస్తున్నాయి. 

ఈ ఫొటోలు సూచిన రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. దీంతో వారు సోషల్ మీడియాలో ఈ ఫొటోలను మరింత సర్క్యూలేట్ చేస్తున్నారు. చరణ్ క్రేజ్ ఇది అంటూ తెగ పొగిడేస్తున్నారు. దీంతో రామ్ చరణ్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. రామ్ చరణ్ ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లిన ప్లేయర్స్ లో కెప్టెన్ రోహిత్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యాతో పాటు మరికొంతమంది ప్లేయర్స్ ఉన్నట్లు సమాచారం. రామ్ చరణ్ అసిస్టెంట్స్ లో ఒక వ్యక్తి హార్థిక్ తో ఫొటో తీసుకున్నారు. ఈ ఫొటో ఇప్పుడు బయటకొచ్చింది. 

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటింది. ఈ సినిమాలో చరణ్, ఎన్టీఆర్ ల నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇండియన్ క్రికెటర్స్ సైతం వారికి అభిమానులుగా మారిపోయారు. ఈ క్రమంలోనే వారంతా చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.  ఈ సినిమాలో చరణ్ ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను అక్టోబర్ నాటికి పూర్తి చేయాలనేది శంకర్ ప్లాన్. కానీ ఇప్పుడు దర్శకుడు శంకర్ 'ఇండియన్2' ప్రాజెక్ట్ ను టేకప్ చేయడంతో చరణ్ సినిమా ఆలస్యమయ్యేలా ఉంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఎస్ జె సూర్య విలన్ రోల్ లో కనిపించనున్నారు. 

గౌతమ్ ప్లేస్ లో కన్నడ దర్శకుడు:

'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో ఓ సినిమా చేయాలనుకున్నారు చరణ్. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం.. చరణ్-గౌతమ్ సినిమా ఆగిపోయినట్లు తెలుస్తోంది.  ఇప్పుడు ఈ సినిమాకి బదులుగా మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు రామ్ చరణ్. కొన్ని నెలలుగా చరణ్ ను కలిసి కథలు వినిపిస్తున్నారు దర్శకులు. ఈ క్రమంలో కన్నడ దర్శకుడు నర్తన్ చెప్పిన కథ చరణ్ కి బాగా నచ్చిందట. 

'మఫ్తి' అనే సినిమాతో కన్నడలో దర్శకుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు నర్తన్. చాలా కాలంగా ఆయన చరణ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. ఫైనల్ గా కథ సెట్ అవ్వడంతో చరణ్ కి వినిపించారు. ఆయన ఓకే చెప్పడంతో.. మెగాస్టార్ చిరంజీవికి కూడా ఫైనల్ నేరేషన్ ఇచ్చారు నర్తన్. కథ ఇంప్రెసివ్ గా అనిపించడంతో చిరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. కొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనుంది.

Also read: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Also read: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Published at : 26 Sep 2022 02:35 PM (IST) Tags: Hardik Pandya Ram Charan Indian cricketers India Australia match

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu December 8th: కడుపు పోయినట్టు నాటకం ఆడిన మల్లిక- రామాకి నిజం చెప్పిన జానకి, మాధురి కేసులో కన్నబాబు పాత్ర

Janaki Kalaganaledu December 8th: కడుపు పోయినట్టు నాటకం ఆడిన మల్లిక- రామాకి నిజం చెప్పిన జానకి, మాధురి కేసులో కన్నబాబు పాత్ర

Hamsa Nandini: క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో హంస నందిని బిజీ బిజీ!

Hamsa Nandini: క్యాన్సర్ ను జయించి మళ్లీ షూటింగ్స్ లో హంస నందిని బిజీ బిజీ!

Guppedantha Manasu December 8th Update: వసు ఇబ్బంది గమనించి హెల్ప్ చేసిన రిషి, దేవయాని ప్లాన్ ని ఫ్లాప్ చేసిన గౌతమ్

Guppedantha Manasu December  8th Update: వసు ఇబ్బంది గమనించి హెల్ప్ చేసిన రిషి, దేవయాని ప్లాన్ ని ఫ్లాప్ చేసిన గౌతమ్

Karthika Deepam December 8th Update: మతి స్థిమితం కోల్పోయిన మోనిత, సౌందర్య ఆగ్రహం, ఇంటికి చేరిన దీప-కార్తీక్

Karthika Deepam December 8th Update: మతి స్థిమితం కోల్పోయిన మోనిత, సౌందర్య ఆగ్రహం, ఇంటికి చేరిన దీప-కార్తీక్

Gruhalakshmi December 8th: తల గోడకేసి బాదుకున్న లాస్య, పట్టించుకోని నందు- హితబోధ చేసిన తులసి

Gruhalakshmi December 8th: తల గోడకేసి బాదుకున్న లాస్య, పట్టించుకోని నందు- హితబోధ చేసిన తులసి

టాప్ స్టోరీస్

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

అరవింద్‌ ఎక్కడ పోటీ చేస్తే అక్కడే బరిలో ఉండి గెలుస్తానన్న కవిత ఛాలెంజ్‌ సీక్రెట్ ఏంటి?

Gujarat Election Results 2022: సీఎంగా సాధించలేనిది, పీఎంగా సాధించిన నరేంద్ర మోడీ - గుజరాత్‌లో భారీ ఆధిక్యం

Gujarat Election Results 2022: సీఎంగా సాధించలేనిది, పీఎంగా సాధించిన నరేంద్ర మోడీ - గుజరాత్‌లో భారీ ఆధిక్యం

Bandi Sanjay padayatra: కరీంనగర్ లో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర- 17న భారీ బహిరంగ సభ- రానున్న నడ్డా

Bandi Sanjay padayatra: కరీంనగర్ లో ముగియనున్న బండి సంజయ్ పాదయాత్ర- 17న భారీ బహిరంగ సభ- రానున్న నడ్డా